ప్రపంచంలో చాలా మంది మాల్దీవ్స్ ( Maldives ) వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కానీ త్వరలో వాళ్లంతా భారీ ఎగ్జిట్ ఫీజుతో ఇబ్బంది పడనున్నారు.
ఒకప్పుడు మాల్దీవ్స్ అనేది భారతీయులకు ఫేవరిట్ డెస్టినేషన్. కానీ ఇప్పుడు కాదు. మన భారతీయులం ఈ బుల్లి ఐలాండ్ దేశానికి ప్రత్యామ్నాయంగా మన లక్షద్వీప్‌ను ఎంచుకున్నాం. అయితే ప్రపంచంలో చాలా మంది మాల్దీవ్స్‌కు ( Maldives ) వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కానీ త్వరలో వాళ్లంతా భారీ ఎగ్జిట్ ఫీజుతో ఇబ్బంది పడనున్నారు.
ముఖ్యాంశాలు
చేతులారా చేసుకున్నారు…
గతంలో మాల్దీవ్స్ వెళ్లేందుకు భారతీయులం చాలా ఇష్టపడేవాళ్లము. అక్కడి ల్యాండ్‌స్కేప్, బీచులు ( Maldives beaches ), విలాసవంతమైన రిసార్ట్స్ ఇవన్నీ నచ్చేవి. అయితే అక్కడి ప్రభుత్వ నేతల ప్రవర్తన మన దేశంపై చేసిన కామెంట్స్ తరువాత మాల్దీవ్స్ వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా తగ్గింది.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
అసలు ఏం జరిగింది ?
2024 జనవరిలో ప్రధాని మోది లక్షద్వీప్ ( Lakshadweep) వెళ్లారు. అక్కడి బ్యూటిని ఫోటోల రూపంలో షేర్ చేశారు.
అయితే దీనిపై మాల్దీవ్స్ మంత్రి మరియం షియునా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన అంశాలు భారతీయులకు కోపాన్ని తెప్పించాయి. ప్రధాని మోదీ, భారత దేశంపై మరియంతో పాటు మరికొంత మంది మాల్దీవ్స్ నేతలు చేసిన కామెంట్స్ వల్ల భారతీయులు మాల్దీవ్స్‌ను బాయ్ కాట్ చేశారు. కొత్త బుకింగ్స్ చేయడం లేదు. పాత్ బుకింగ్స్ కేన్సిల్ చేసుకున్నారు.
దీంతో టూరిజంపై ఆధారపడే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తిరిగి పుంజుకునేందుకు మాల్దీవ్స్ మళ్లీ ప్రయత్నిస్తోంది. 2024 డిసెంబర్ 1 నుంచి తమ దేేశాన్ని వీడే పర్యాటకుల నుంచి ఎగ్జిట్ ఫీజు ( exit fee ) వసూలు చేయనుంది మాల్దీవ్స్. ఇది ప్రయాణికుల బడ్జెట్‌ను కూడా పెంచనుంది
డిపార్ట్చర్ టాక్స్ అంటే ? | What Is Maldives Departure Tax ?
మాల్దీవ్స్ తమ దేశ పౌరులు కాని వారి నుంచి డిపార్చర్ ట్యాక్స్ వసూలు చేయనుంది. వయసూ, జాతీయతతో సంబంధం లేకుండా వెళ్లే అందరిపై ఈ నిర్ణయం ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది. ఈ ఫీజు అనేది ప్రయాణికుల విమాన సర్వీస్ బుకింగ్‌ను బట్టి ఉండనుంది.
ఎకానమీ క్లాస్ :
Maldive Economy Class Departure Fee : మాల్దీవ్స్ నుంచి బయల్దేరే ఎకానమీ క్లాస్ ప్రయాణికులు గతంలో 30 డాలర్లు పే చేసేవాళ్లు. ఇకపై వారు ఇప్పుడు 50 డాలర్లు పేయాల్సి ఉంటుంది.
బిజినెస్ క్లాస్
Maldive Business Class Departure Fee: మాల్దీవ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యే ఫారిన్ టూరిస్టులు గతంలో 60 డాలర్లు చెల్లించేవారు. వారు ఇకపై 120 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఫస్ట్ క్లాస్
Maldive First Class Departure Fee : బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాసులకు చార్జీలను డబుల్ చేశారు. కానీ ఫస్ట్ క్లాసు వారికి అంతకు మించి పెంచారు. గతంలో 90 డాలర్లు మాత్రమే డిపార్చర్ చార్జెస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అది 240 డాలర్లకు పెంచారు.
ప్రైవేట్ జెట్
Maldives Private Jet Departure Fee : ప్రైవేట్ జెట్‌లో మాల్దీవ్స్ వెళ్లేవారికి భారీగా ఎగ్జిట్ ఫీజు పెంచింది ఈ దేశం. గతంలో ఈ ఫీజు 120 డాలర్లు ఉండేది. ఇప్పుడు దాన్ని పెంచి 480 డాలర్లు చేశారు. ఇలా భారీగా ఎగ్జిట్ ఫీజును పెంచి తమ దేశ ప్రధాన ఆదాయ మార్గం అయిన పర్యాటకులపై భారం మోపనుంది మాల్దీవ్స్.
అయితే ఈ డబ్బును వెలెనే ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సదుపాయాలను మెరుగుపరిచేందుకు వినియోగించనుందట. మాల్దీవ్స్ ఇన్లాండ్ రెవెన్యూ ఆథారిటీ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందట. అదే ప్రయాణికులపై ఎగ్జిట్ చార్జీలను కనీసం రెట్టింపు చేయడం.
ఈ ఫీజును ఎందుకు పెంచారు ?
Why maldives increased departure fee : కూర్చున్న కొమ్మను నరుక్కుంటే కిందపడతారు అనే కథ మీకు తెలిసే ఉంటుంది. మాల్దీవ్స్‌కు కూడా ఇక్కడే అదే పని చేసింది. అక్కడి నేతలు భారత్‌కు వ్యతిరేకంగా కామెంట్ చేశారు. దీంతో భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్లే పర్యాటకులు తగ్గిపోయారు.
మాల్దీవ్స్ వైపు భారతీయులు ఎవరూ తొంగి చూడటం లేదు. అంతేనా ఎక్కడికైనా వెళ్తాం కానీ మాల్దీవ్స్‌కు మాత్రం లైఫ్‌లో ఎప్పుడూ వెళ్లం అని భారతీయులు ప్రమాణాలు చేశారు. ఇచ్చిన మాటపై నిలబడటం భారతీయులు బాగా తెలుసు. దాంతో పాటు తిరిగి ఇచ్చేయడం కూడా బాగా తెలుసు. బాయ్‌కాట్ మాల్దీవ్స్ ( boycott maldives ) అంటూ ఈ చిన్న దేశానికి వెళ్లం అని నిర్ణయించుకున్నారు.
ఆర్థికంగా నష్టం..
మాల్దీవ్స్ నేతల ప్రవర్తన వల్ల అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య దాదాపు 40 శాతం తగ్గిపోయింది. అదే సమయంలో మాల్దీవ్స్ చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. చైనా నుంచి మాల్దీవ్స్ వెళ్లే పర్యాటలకు సంఖ్య 70 శాతం పెరిగింది. అయితే భారతీయుల్లో ఇది మరింత కోపాన్ని పెంచింది.
నిజానికి భౌగోళికంగా మాల్దీవ్స్‌కు చేరువలో ఉన్న దేశం భారత దేశం. చాలా విషయాల్లో భారత్‌పై ఆధారపడి దేశం ఇది. మాల్దీవ్స్‌లో భారత్ ఎన్నో స్కూల్స్, ఆసుపత్రులు కట్టించింది. ఇంకా లెక్కకు రాని ఎన్నో విషయాల్లో సాయం చేసింది. అక్కడ సరైన వైద్యం అందని వారు భారత్‌లో తక్కువ ధరకు వైద్యం చేయించుకునే వారు.
ఇలా వెయ్యి రకాల సాయాలు భారత్ నుంచి ఈ దేశానికి అందేది. కానీ ఆ దేశ ప్రతినిధులు కూర్చున్న కొమ్మను నరకడం ప్రారంభించారు.
Read Also: UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు
ఈ వైఖరి వల్ల దేశం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతోంది. దీంతో పాటు పలు రకాల ఆర్థిక కష్టాలు ఆదేశాన్ని చుట్టుముట్టాయి. ప్రపంచ బ్యాంకు ( The International Monetary Fund – IMF ) మాల్దీవ్స్‌పై కొన్ని నెలల ముందు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశలో కదులుతోంది అని వరల్డ్ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది.
అయితే మాల్దీవ్స్‌తో పాటు శ్రీలంక, నేపాల్ దేశాలను కూడా అప్పుల్లో కూరుకుపోయాయి అని ప్రకటన చేసింది ప్రపంచ బ్యాంకు. ఈ రుణభారం వల్లే కొన్ని ప్రాజెక్టుల ఫండింగ్ కోసం చైనా చెంతకు చేరింది. ఇక కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం చాలా కష్టం మాల్దీవ్స్ అధ్యక్షుడు ముహమ్మద్ మొయిజ్జు అన్నాడు.
భారత్‌కు వ్యతిరేకంగా చైనాకు దగ్గరగా ఉన్న మొయిజ్జు ( Mohamed Muizzu ) ఈ మధ్యే భారత్‌ను సందర్శించాడు. ఒకప్పుడు ఇండియా ఔట్ ( india out ) అనే నినాదం చేసి అదే నినాదంతో గెలిచిన మొయిజ్జు చివరికి ఆర్థిక సాయం కోసం మన దేశానికి వచ్చాడు. సాయం అందిన తరువాత థ్యాంక్స్ కూడా చెప్పాడు. కానీ ఇవన్నీ భారతీయుల కోపాన్ని ఏ మాత్రం తగ్గించలేవు అనేది నిర్వివాదిత అంశం.
డిపార్చర్ ఫీజు పెంచేందుకు దోహదం చేసిన కారణాలు
- ఆదాయం లేదు : మాల్దీవ్స్ టూరిజంపై ఆధారపడి బతుకుతున్న దేశం. ఈ దేశ జీడీపీలో 27 శాతం టూరిజం నుంచి వచ్చే ఆధాయమే ఉంటుంది. ఈ ఫీజు వల్ల ఈ దేశ ఆదాయం పెరుగుతుంది.
- ఎయిర్‌పోర్ట్ నిర్వాహణ: మాల్దీవ్స్ వచ్చే పర్యాటకులు ఎక్కువగా వెలెనా ఇంటర్నేషనల్ విమనాశ్రయం ( Velena International Airport ) నుంచే రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నిర్ణయం వల్ల ఎయిర్‌పోర్టు నిర్వాహణకు డబ్బులు లభిస్తాయి.
టూరిజంపై దీని ప్రభావం పడనుందా ?
ఒకప్పుడు మీరు మాల్దీవ్స్ నుంచి బయల్దేరే టైమ్‌లో రూ.2531 ఎగ్జిట్ ఫీజుగా ఇస్తే ఇకపై రూ.4218 ఇవ్వాలి.
Read Also: Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
అదే ప్రైవేట్ జెట్‌లో వెళ్లే వారు రూ.10124 డిపార్చర్ ఫీజు కడితే ఇప్పుడు వాళ్లు రూ.40498 కట్టాలి. ఇంత కట్టాల్సి ఉంటుంది అని తెలిస్తే ఎంత మంది మాల్దీవ్స్ వెళ్తారు ? భుటాన్ ( Bhutan ) లాంటి కొన్ని దేశాలు రెస్పాన్సిబిల్ టూరిజం అనే కాన్సెప్టుతో చార్జీలు వసూలు చేసి క్వాలిటీ టూరిజంను ప్రోత్సాహిస్తున్నాయి
భూటాన్, దుబాయ్‌లకు ( Dubai ) ఎక్కువ మంది టూరిస్టుల కన్నా బాధ్యతాయుతమైన పర్యాటకులు కావాలి. అందుకే టూరిస్టుల కోసం కొన్ని రూల్స్ పెట్టాయి. అయితే టూరిజంపై ఆధారపడిన మాల్దీవ్స్ ఇలా ఫీజులు పెంచితే భారతీయులు ( Indians Visiting Maldives ) ఎలాగూ వెళ్లడం లేదు కదా…ఇకపై విదేశీయులు కూడా వెళ్లే అవకాశాలు తగ్గుతాయి..
- ఈ ఫీజులు డైరెక్టుగా పర్యాటకుల నుంచి తీసుకోదు మాల్దీవ్స్. టికెట్ ధరలోనే వీటిని కలిపేస్తారు.పర్యాటకులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అంశం.
- ప్రీ పర్చేస్ ఆప్షన్ : ఈ కొత్త చార్జీలు 2024 డిసెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ దీన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు నవంబర్ 30 లోపు టికెట్లు బుక్ చేసుకోండి డబ్బు సేవ్ చేసుకోండి అని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
మన దేశంలో గోవాకు వెళ్లేవారి సంఖ్య చాలా తగ్గింది. ఎందుకు ? అక్కడ ట్యాక్సీ మాఫీయా, ప్రతీ దాంట్లో ఖర్చులు పెరగడం, విమాన చార్జీలు ఇవన్నీ కారణం అని సోషల్ మీడియాలో కామెంట్స్ చదివితే అర్థం అవుతోంది. ఇండియాలో ఉన్న గోవానే కాస్ట్‌లీ అని వెళ్లడం లేదు అలాంటిది భారత్‌ను అవమానించిన ఆ మాల్దీవ్స్‌కు ఇలాంటి చార్జీలు పెట్టుకుని వెళ్లేవారు తక్కువే అనొచ్చు.
మాల్దీవ్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అక్కడి టూరిజం, హోటల్ పరిశ్రమ అన్నీ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. వేరే దేశానికి వెళ్లే అవకాశం లేకపోలేదు.
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతంది అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.