మనును మానవ జాతి నిర్మాత అని చెబుతారు. అతని పేరు మీదే మనాలి (Manali) కి ఆ పేరు వచ్చింది
ఇండియాలో ఉన్న అత్యంత బ్యూటిఫుల్ హిల్ స్టేషన్లో మనాలి ఒకటి. 4000 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి స్నో ఎక్కువ పడుతుంది. అందుకే చల్లగా ఉంటుంది.
ఈ స్టోరీలో మీకు మనాలిలో ట్రావెల్ చేయడానికి ఎలాంటి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో వివరిస్తాను.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఒక వేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో, హోటల్, వెహికల్, ఫుడ్, మంచి మంచి డెస్టినేషన్స్ గురించి మీకు ఈ పోస్టులో వివరిస్తాను.
- మనాలి అనేది ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా నుంచి 40 కిమీ దూరంలో ఉంటుంది.
- ఇది షిమ్లా నుంచి 270 కమీ దూరం
- ఢిల్లీ నుంచి 540 కిమీ దూరం
- హైదరాబాద్ నుంచి 2068 కిమీ దూరం
- విజయవాడ నుంచి 2314 కీమ దూరంలో ఉంటుంది
Manali Travel Guide
1.మనాలి ఎలా వెళ్లాలి ? | HOW TO REACH MANALI ?
నిజానికి మనాలికి డైరెక్టుగా విమానం సర్వీసు లేదా రైల్వే స్టేషన్ లేదు. కాబట్టి మీరు బైరోడ్ ప్లాన్ చేసుకుంటే బెస్టు.
మీరు దేశంలో ఏ భాగంలో ఉన్నా మీరు ముందు డిల్లీ లేదా చంఢిగడ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మీరు ప్రైవేట్ బస్సులో లేదా హెచ్చార్టీసి బస్సులో మనాలికి చేరుకోవచ్చు.
నేను ఢిల్లీ నుంచి వోల్వో బస్సులో వచ్చాను చార్జీ వచ్చేసి రూ. 800 నుంచి -రూ.1200 వరకు ఉంటుంది.
ఢిల్లీ నుంచి 12 గంటల్లో ఛంఢిగడ్ నుంచి 8 గంటల్లో మనాలికి తీసుకొచ్చేస్తుంది బస్సు.
ఫ్లైట్‌లోనే రావాలి అనుకుంటే మాత్రం కులులో ఉన్న భుంటర్ ఎయిర్‌పోర్టు వరుకు రావచ్చు. ఇది మనాలికి 50 కీమీ దూరంలో ఉంటుంది.
కులు ఎయిర్‌పోర్ట్ నుంచి లిమిటెడ్ విమానాలు నడుస్తాయి. టికెట్ కాస్ట్ కూడా ఎక్కువే 15 వేలు పైమాటే ఉంటుంది. అందుకే చాలా మంది బస్సు జర్నీనే ఫ్రిఫర్ చేస్తారు. ఎందుకంటే జర్నీలో ఎన్నో అందమైన లొకేషన్స్ చూసేయొచ్చు.
2.మనాలి వెళ్లే బెస్ట్ టైమ్ ఏంటి ? | BEST TIME TO VISIT MANALI
మనాలి సంవత్సరం మొత్తం అందంగానే కనిపిస్తుంది. కానీ అక్టోబర్ నుంచి జులై మధ్య కాలంలో దీని బ్యూటి గుండెను లూటీ చేస్తుంది. డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మీరు స్నో ఫాల్ కూడా చూడొచ్చు. మార్చి నుంచి ఈ స్నో కరగడం మొదలవుతుంది.

చాలా మంది డిల్లీ ఎండలను తట్టుకోలేక మార్చి నుంచి జులై మధ్యలో మనాలికి వస్తుంటారు. ఇలాంటి సమయంలో కూడా మీకు కొన్ని ప్రాంతాల్లో అంటే సొలాంగ్, అటల్ టన్నెల్, రోహ్తాంగ్ పాస్, సిసులో మంచు కనిపిస్తుంది.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఇలాంటి ప్రాంతాల్లో మీరు ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు. నేను సొలాంగ్‌లో స్కీయింగ్ ప్రాక్టిస్ చేశాను.ఎన్ని సార్లు ప్రయత్నించినా నేను స్కీయింగ్ చేయలేకపోయాను.
మేబీ ఒకటికి రెండు నెలలు ప్రాక్టిస్ చేస్తే నేను కూడా సినిమా హీరోల్లా స్కీయింగ్ చేయగలనేమో.
సొలాంగ్ వ్యాలీలో చాలా మంది అడ్బెంచర్స్ చేయడానికి ఇష్టపడతారు. నేను కూడా ఇలా రాక్ క్రాసింగ్ చేశాను.
3.మనాలిలో ఎక్కడ ఉండాలి ? | WHERE TO STAY IN MANALI ?
చాలా మంది మనాలికి 30 కిమీ దూరం నుంచే హోటల్స్‌లో చెకింగ్ చేయడం ప్రారంభిస్తారు. కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్లినా అక్కడి మాల్ రోడ్ అంటే మెయిన్ మార్కెట్ కి దగ్గరగా ఉండేలా చూసుకుంటాను.
రేటు అటూ ఇటు అయినా ట్రావెల్ చార్జెస్ మిగులుతాయి కదా అక్కడ సేవ్ చేసుకుంటాను.

మనాలీలో మీకు 800 నుంచి 10 వేల వరకు చార్జ్ చేసే హోటల్స్ రూమ్స్ దొరుకుతాయి. అయితే మీరు ట్రావెల్ ఏజెంట్స్‌తో డిస్కస్ చేసి మొత్తం టూరుకు ప్యాకేజీ మాట్లాడితే మీకు బడ్జెట్ అండ్ టైమ్ రెండూ సేవ్ అవుతాయి.
4.బైక్ రెంటుపై దొరుకుతుంది | Bike on Rent In Manali
ఇక్కడ మంచుకొండల్లో ఘాట్ రోడ్డులో బైక్‌పై తిరగాలి అనుకునే వారికి బైకులు రెంటుపై కూడా లభిస్తాయి.వీటి ప్రైస్ రూ.500 నుంచి రూ.1800 వరకు ఉంటుంది.
లోకల్ ట్యాక్సీలో వెళ్లాలి అనుకుంటే మాత్రం రూ.4500 చార్జ్ చేస్తారు. మనాలీలో ఉన్న సైట్స్ అన్నీ చూపిస్తారు. అయితే రోహ్తాంగ్ పాస్ వెళ్లాలి అనుకుంటే మాత్రం ఎక్స్‌ట్రా రూ.3000 ఇవ్వాల్సి ఉంటుంది.
ట్యాక్సీలు ముందు బుక్ చేయడం కన్నా అక్కడికి వెళ్లి బేరం చేసుకుంటేనే బెస్ట్.
5.మనాలి వెళ్లే ముందు ఇవి ప్యాక్ చేసుకోండి
Essential Thing To Pack for Manali ? | ఇక మనాలికి వస్తే ఎలాంటి బట్టలు ప్యాక్ చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది… పేజి 2 లో చదవడం కొనసాగించండి...