Viral Video : కోడైకెనాల్‌లో వ్లాగర్‌ను దోచుకున్న కోతులు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
Viral Video : ఇండియాలో ఎక్కడికి వెళ్లినా కొన్ని సంఘటనలు అలా జీవితంలో గుర్తుండిపోతాయి. అందమైన ప్రదేశాలు, నోరూరించే వంటకాలు, మంచి మనుషుల ఆతిథ్యం.. ఇవన్నీ ఓ వైపు ఉంటే, ఊహించని కోతుల గోల మరోవైపు ఉంటుంది. మంచుతో కప్పబడిన మనాలి రోడ్లపై నడిచినా, బృందావన్ అందాలను చూసినా, ఈ అల్లరి కోతులు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. అవి మన ప్రయాణంలో కొంచెం నవ్వులు పూయిస్తాయి, కొన్నిసార్లు తల పట్టుకునేలా చేస్తాయి. కళ్ళజోళ్ళు లాక్కోవడం దగ్గరి నుండి చిప్స్ ప్యాకెట్లతో నవ్వుతూ పారిపోవడం వరకు, అవి పర్యాటకులకు అడిగినా దొరకని గైడ్ల్లా మారిపోతాయి. ముఖ్యంగా దొంగతనంలో వాటికి స్పెషల్ టాలెంట్ ఉంటుంది.
ఇటీవల తమిళనాడులోని కోడైకెనాల్‌లో తిరుగుతున్న ఒక ట్రావెల్ వ్లాగర్‌కు ఇలాంటి సంఘటన ఎదురైంది. తనకి జరిగిన ఈ ఫన్నీ అనుభవాన్ని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం. వ్లాగర్ స్కూటర్ డిక్కీలో నుంచి కోతులు తినే వస్తువులను దొంగిలిస్తుంటాయి. అయ్యో.. కోతులు నన్ను దోచుకుంటున్నాయి! అని అతను అరుస్తాడు. అప్పుడు అవి ఒక చాక్లెట్ కేక్ మొత్తం, ఇంకా కొన్ని ఆరెంజ్‌లను ఎత్తుకెళ్లాయని చెప్పాడు. కొద్దిసేపటికే, ఒక కోతి ప్రశాంతంగా ఒక ఆరెంజ్‌ని ఒలిచి రోడ్డు పక్కన తింటూ కనిపిస్తుంది. నా బ్యాగ్ ఖాళీ చేశాయి. నా దగ్గర ఏమీ లేదని అతను కొంచెం నిరాశగా, కొంచెం సరదాగా వాపోయాడు.

ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
ఈ వీడియో చూసిన వాళ్లకి తెగ నవ్వు వస్తుంది. ఇండియాలో కోతులతో ఇలాంటి అనుభవాలు చాలా కామన్. వాటి అల్లరి చేష్టలు తరచుగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు వారు అస్సలు ఊహించని అనుభవాలను ఇస్తాయి. ఈ వీడియోకు ఇంటర్నెట్లో వెంటనే స్పందన వచ్చింది. చాలా మంది నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. ఓ నెటిజన్.. మాకు కూడా ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది అని మరొకరు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకో నెటిజన్.. బ్రో, ఇది ఇండియా. ఇండియా మనుషుల కోసం, జంతువుల కోసం, పక్షుల కోసం, ఇంకా ప్రకృతి కోసం కూడా అని ఒకరు కామెంట్ చేశారు. భయ్యా దేవుడు సృష్టించిన చిన్న జీవులు కూడా తినాలి కదా అని మరొకరు అన్నారు.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
ఈ సంఘటన వ్లాగర్‌కు కొంచెం నిరాశ కలిగించినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా మందిని నవ్వించి, కోతులతో తమకు ఎదురైన సరదా అనుభవాలను గుర్తు చేసింది. భారతదేశంలో ప్రయాణం అంటే కేవలం ప్రదేశాలను చూడటమే కాదు ఇలాంటి సరదా సంఘటనలను అనుభవించడం కూడా.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.