ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన కుంభ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే సుమారు 2 కోట్ల మంది కుంభ మేళాకు ( Maha Kumbh Mela View ) వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు. అయితే కుంభ మేళాకు వెళ్లని వాళ్ల కోసం ఆ వైభవం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు ఒక ప్రయాణికుడు. తను ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి కుంభమేళా ప్రాంగణాన్ని చూపించాడు. ఈ ఏర్పాట్లు చూసి అద్భుతం అంటున్నారు నెటిజెన్లు.
ముఖ్యాంశాలు
ప్రకాశిస్తున్నప్రయాగ్‌రాజ్ | Prayagraj Is Shining
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ప్రయాగ్‌రాజ్ ( Prayagraj ) వైభవాన్ని చాటే ఒక వీడియోను చాలా మంది ఇష్టపడుతున్నారు. మేళా జరుగుతున్న సమయంలో ప్రాంగణం ఎంతగా మెరిసిపోతోందో ఆ వీడియోలో చూపించాడు ఒక ప్రయాణికుడు. ఈ వీడియోలో గంగా, యుమునా, సరస్వతీ పవిత్ర నదులు కలిసే త్రివేణి సంగమం, ఆ చుట్టు పక్కల ప్రాంతాలు జిగేలుమని మెరుస్తూ కనిపించాయి.
- ఇది కూడా చదవండి : కుంభ మేళాలో చేయకూడని 8 పనులు | Maha Kumbh Mela 2025
మహిమాన్వితమైన మహాకుంభమేళా | Maha Kumbh Mela Began With Shine
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కుంభ మేళా 2025 జనవరి13 తేదీన వైభవంగా ప్రారంభమైంది. 45 రోజుల పాటు సాగే కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ మేళాలో పవిత్ర సంగమంలో ( Triveni Sangam ) నదీ స్నానం చేయడానికి ప్రపంచంలోని 100 కు పైగా దేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు అధికారులు.
భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే అనేక కారణాల వల్ల కుంభ మేళాకు వెళ్లలేని వారికోసం మేళా ప్రాంగణం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు ఒక రైల్వే ప్రయాణికుడు.
అర్థరాత్రి మహాద్భుతం | Prayagraj At Night
కుంభమేళా వైభవాన్ని చూపించే ఈ వీడియోను అరుణ్ యాదవ్ అనే వ్యక్తి రికార్డు చేశాడు. ఈ వీడియోను మేళా ప్రారంభం అవ్వడానికి ముందే రికార్డు చేశాడు ( Kumbh Mela Video ) అరుణ్. ” కుంభ మేళా వైభవాన్ని చూడండి…ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. మీరు కూడా ఇక్కడికి రావాలి అనుకుంటే తప్పకుండా వచ్చేయండి” వీడియో చూసే వాళ్లను కూడా ఆహ్వానించాడు.
“రోమాలు నిక్కబొడుచుకున్నాయి” | Netizens About Maha Kumbh Mela Videos
కుంభ మేళాకు సంబంధించిన ఈ వీడియోను ( Maha Kumbh Mela View ) చూసిన నెటిజెన్లు తెగ పొగుడుతున్నారు. ఇది ఒక అద్భుమతైన సన్నివేశం. మహాద్భుతమైన అనుభవం అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ కామెంట్ చేస్తూ చాలా థ్రిల్లిగంగ్ వ్యూ అని స్పందించారు. అయితే రైలు తలుపు దగ్గర నిలబడి వీడియో తీసిన అరుణ్ జాగ్రత్తగా ఉండాలి, కదులుతున్న ట్రైనులో అలా నిలబడకూడదు అని సలహా ఇచ్చాడు మరో యూజర్.
అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.