Flamingo Festival 2025 at Nelapattu : జనవరి 18 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. ఈ వేడుక విశేషాలివే !
అరుదైన పక్షులకు తాత్కాలిక అతిథ్య ఇచ్చే నేలపట్టులో నాలుగేళ్ల తరువాత ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుక ( Flamingo Festival 2025 at Nelapattu ) విశేషాలు, ముఖ్యమైన తేదీలు ఇవే.
Table Of Content
ప్రతీ ఏటా దేశ విదేశాల నుంచి వచ్చే అరుదైన పక్షులకు తాత్కాలిక నివాసంగా మారుతుంది నేలపట్టు బర్డ్ శాంక్చువరి. ఈ విదేశీ విహంగాల రాకను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival 2025 at Updates ) నిర్వహిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా జరగని ఈ పక్షుల వేడుక మళ్లీ షురూ కానుంది. పూర్తి వివరాలు

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 అప్డేట్
తిరుపతిలోని సూళ్లూరుపేటలో ( Sullurpeta ) ఏటా ప్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్ల నుంచి ఈ ఫెస్టివల్ నిర్వహించడం లేదు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ పక్షుల వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు ఇటీవలే సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ( Nelavala Vijayasree ), స్థానిక అధికారులు కలిసి దొరవారిసంత్రం ( Doravarisatram ) మండలంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చువరిని సందర్శించారు.
ఈ సందర్భంగా పక్షుల పండగకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. ఈ ప్రాంత జీవ వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేయడంతో పాటు, స్థానికుల్లో పర్యావరణంపై అవగాహణ కల్పించేందుకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Also Read : ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
ఫ్లెమింగో ఫెస్టివల్ తేదీలు | Flamingo Festival 2025 Dates
తొలూత 2025 లో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు నిర్వాహించాలని భావించారు. తరువాత ఈ తేదీలను మార్చి జనవరి 18 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు అని ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2025 ) , ద్వాదశికి చాలా మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఇదే సమయంలో ఈ ఫెస్టివల్ తేదీలు కూడా ఉండటంతో రద్దీ పెరిగే అవకాశం, మరిన్ని అంశాలను గమనించి తేదీలను మార్చాలని నిర్ణయించారు. అయితే తేదీలు మారినా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు జరుగుతాయి.
చరిత్ర | Flamingo Festival History
నేలపట్టులోని బర్డ్ శాంక్చువరిలో ( Nelapattu Bird Sanctuary ) 2020 వరకు ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహించేవారు. తరువాత నాలుగేళ్ల పాటు నిర్వహించలేదు. అయితే కొంత కాలం క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ఈ వేడుకపై మరోసారి ఆసక్తి పెరిగింది. దీంతో ఐదు ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఆ ప్రాంతాలు ఇవే | Flamingo Festival 2025 Key Locations
- నేలపట్టు
- బీవి పాలేం
- అతకనితిప్ప
- శ్రీసిటి
- సూళ్లూరు పేట
ఈ వేడుక సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. స్థానిక జీవ వైవిధ్యాన్ని ( Nelapattu Biodiversity ) ప్రతిబింభించడంతో పాటు సందర్శకులకు, పిల్లలకు అవగాహన కల్పించేలా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
నేలపట్టు శాంక్చువరి ప్రాధాన్యత | Importance Of Nellapattu Bird Sanctuary
నేలపట్టు బర్డ్ శాంక్చువరి అనేది తన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఎన్నో రకాల అరుదైన పక్షులకు నెలువు . ఈ బర్డ్ శాంక్చువరి అనేది గ్రే పెలికాన్లు ( Grey Pelican ), కార్మోరాంట్, స్పూన్ బిల్, ఓపెన్‌బిల్ స్టార్క్ వంటి ఎన్నో రకాల పక్షులకు ఆవాస కేంద్రం. ఈ పక్షులు సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థానిక పులికాట్ సరస్సు ( Pulicat Lake ) వద్ద తమ నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ ఉన్న చేపలను ఆహారంగా తీసుకుంటాయి. ఇక్కడ పిల్లలను కని వాటిని పెంచుతాయి. మార్చి లేదా ఏప్రిల్ సమయంలో తమ తమ ప్రాంతాలకు బయల్దేరుతాయి. దేశ విదేశాలకు చెందిన అరుదైన పక్షులు సంతానోత్పత్తికి నేలపట్టును ఎంచుకోవడం విశేషం.

ఈ పక్షులు శ్రీలంకా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వస్తుంటాయి. అంత దూరం నుంచి వచ్చే పక్షుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. వీటి కోసం పులికాట్ సరస్సులో చేపలను కూడా వదులుతుంటారు. అక్టోబర్ , నవంబర్ సమయంలో ఇక్కడికి వచ్చే పక్షులు డిసెంబర్, జనవరి సమయంలో గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. పిల్లల బయటికి వచ్చాక వాటిని పెంచి తరువాత ఎండాకాలం ప్రారంభంలో తమ ప్రాంతాలకు వెళ్లిపోతుంటాయి.
అరుదైన అవకాశం | Arrangements For Flamingo Festival
నేలపట్టు పరిసర ప్రాంతాల్లో జరిగే ఈ బర్డ్ శాంక్చువరికి పక్షిప్రేమికులు ( Bird Lovers ) , శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, పరిశోెధకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వీరితో పాటు సందర్శకుల్లో పర్యాటకులు, విద్యార్థులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ( Travelers ) కూడా ఉంటారు.
అరుదైన ఈ విహంగాల ( Rare Birds ) గురించి తెలుసుకోవడానికి వచ్చేవారి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాచ్ టవర్లు ఏర్పాటు చేసి ఎత్తు నుంచి పక్షులను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పాటు ఆహ్లాదకరమైన పార్కులు , ఫుడ్ జోన్ వంటి సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తారు. సందర్శకులు ఈ వేడుకలో వివిధ పక్షి జాతులను చూసే అవకాశం ఉంటుంది. పర్యావరణంలో వాటి పాత్ర గురించి తెలుసుకుని వాటిని సంరక్షించేందుకు చేయాల్సిన పనుల గురించి అవగాహన పెంచుకుంటారు.
నేలపట్టు విస్తీర్ణం | Ecology of Nelapattu Bird Sanctuary
నేలపట్టు బర్డ్ శాంక్చువరి అనేది సుమారు 460 హెక్టార్ల మేరా విస్తరించి ఉంది . ఇది మంచి ఇకో టూరిజం స్పాట్ . ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులకు ఆవాసం కల్పించడంతోొ పాటు వాటి సంతానోత్పత్తిక సరైన, అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. ఇక్కడికి వచ్చే గ్రే పెలికాన్స్ను పవిత్ర పక్షులగా ( Devine Birds ) భావిస్తారు. ఈ వేడుకకే కాదు ఈ బర్డ్ శాంక్చువరికి కూడా ఇవే హైలైట్ అని చెప్పవచ్చు.
బర్డ్ ఫెస్టివల్ ( Sullurpet Bird Festival ) ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) , ఉపముఖ్యమంత్రి ( Pawan Kalyan ) వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న ఈ వేడుక కోసం పక్షి ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారు. 4 సంవత్సరాల తరువాత మళ్లీ జరగనున్న ఈ వేడుకకోసం స్థానికులు కూడా ఎదురు చూస్తున్నారు.
Trending Video On : Prayanikudu Youtube Channel
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని ఫిల్లాంగ్