Tour Package : కార్తీక మాసం స్పెషల్ ప్యాకేజీ.. కేవలం 650 రూపాయలకే లంబసింగి టూర్!
Tour Package : శీతాకాలం ప్రారంభం కాగానే ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయ, లంబసింగి పర్యాటక ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకొని సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ సీజన్లో మంచు కురవడం మామూలే అయినా, గతంలో ఎన్నడూ లేని విధంగా చెట్లు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. ఇది విశాఖపట్నం జిల్లా వాసులకే కాక, పర్యాటకులకూ సరికొత్త అనుభూతిని అందిస్తోంది.
ఈ అద్భుతమైన దృశ్యాలను తిలకించేందుకు విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చారు. వారు కేవలం 650 రూపాయలకే (ఎక్స్‌ప్రెస్ బస్సులో) లంబసింగి టూర్ ప్యాకేజీని అందిస్తున్నారు. అతి తక్కువ ధరలో ఈ టూర్ ప్యాకేజీ ప్రకటించడంతో పర్యాటకుల నుండి భారీ స్పందన వస్తుందని అధికారులు తెలిపారు.

లంబసింగికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ఛార్జీల వివరాలు
ఆంధ్రా కశ్మీర్‌గా పిలువబడే అరకులోయ, లంబసింగి ప్రాంతాలు సీజన్ ప్రారంభంలోనే మంచుతో కప్పబడి స్థానికులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో మంచు ఎక్కువగా కురిసినా ఉదయం 7 గంటలకు సూర్యరశ్మి కనిపించేది. కానీ ఇప్పుడు ఉదయం 10 గంటలు అవుతున్నా సూర్యుడు కనిపించడం లేదు. పట్టపగలే వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చారు. ఈ టూర్‌కు ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీలను బట్టి అల్ట్రా డీలక్స్ బస్సులో 800 రూపాయలు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 650 రూపాయలుగా నిర్ణయించారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
పిక్నిక్ టూర్ ప్యాకేజీలోని సందర్శనీయ స్థలాలు
కార్తీక మాసం సందర్భంగా లంబసింగికి పిక్నిక్ టూర్ కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. ఈ బస్సులు ప్రతీ శని, ఆదివారాలలో ఉదయం సరిగ్గా 03:00 గంటలకు ద్వారకా బస్ స్టేషన్ నుండి బయలుదేరుతాయి. ఈ టూర్లో లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మోదమాంబ గుడి (పాడేరు), కాఫీ తోటలు వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తారు. కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈ టూర్ వేస్తే, అది ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
కార్తీక మాసం ప్రత్యేక ఆఫర్ – టికెట్ల నమోదు
సాధారణంగా కార్తీక మాసంలో ఎక్కువ మంది పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తుంటారు. అందుకే వారి సౌలభ్యం కోసం ప్రతి సంవత్సరం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది కూడా కార్తీక మాసం నెల రోజుల పాటు ఈ బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ లంబసింగి టూర్ వేసి మంచు అందాలను చూసి ఆనందించాలని విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు ఆహ్వానిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఈ టూర్లో మంచుతో కప్పబడిన లంబసింగి అద్భుతమైన అందాలను దగ్గర నుండి చూడవచ్చు. ఈ మంచు దృశ్యాలలో సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేయడానికి ప్రాంతం అంతా చాలా బాగుంటుంది. ఆంధ్ర ఊటీ అరకులోయ అంటేనే అందాల అద్భుతం. దానికి మంచు అందాలు తోడైతే, ఆ అనుభూతి వర్ణించలేనిదిగా ఉంటుంది. కేవలం ఒక రోజు టూర్లో ఆర్టీసీ మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్లి తిరిగి చేరుస్తుందని అధికారులు హామీ ఇస్తున్నారు. మీరు కూడా లంబసింగి టూర్ వెళ్లాలనుకుంటే, త్వరగా ఆర్టీసీ డిపోకు వచ్చి మీ పేర్లు నమోదు చేసుకుని టిక్కెట్లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.