Shakambari Utsavalu Day 2 : శాకాంభరి ఉత్సవాలు.. రెండో రోజు కూడా అదే వైభవం…
Shakambari Utsavalu Day 2 : అమ్మలగన్న అమ్మ విజయవాడలోని ఇంద్రికీలాద్రిపై కొలువైన దుర్గమ్మ. అమ్మవారి అవతారం అయిన శాకాంభరి దేవి ఉత్సవాలు ప్రస్తుతం ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారి అలకరణ, ఆలయ పరిసరాలను చూసి భక్తులు తరిస్తున్నారు. రెండవ రోజు హైలైట్స్ చిత్రాల్లో…

ప్రతీ ఏటా వైభవంగా నిర్వహించే ఈ వేడుకకు దూరదూరం నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మనుసులోని కోరికను కోరి అవి నెరవేరితే వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

ఆలయంలో ప్రతిష్టాత్మకంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి లోపాలు, ఇబ్బందులు లేకుండా అంతా సవ్యంగా సాగేలా అధికారులు కృషి చేస్తున్నారు.
- ఇది కూడా చదవండి : ఇక్కడ మారేడు దళం నీటిలో వేస్తే , కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple

ఆలయ ప్రాంగణంలో అలకంరణ..
- ఇది కూడా చదవండి : ఇది కూడా చదవండి : ఏపీ, తెలంగాణలో అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్లు ఏవో తెలుసా? | Mango Markets In Telugu States

శాకాంభరి ఉత్సవాల (Shakambari Devi) కోసం కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. ఏపిలోని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి దాతల నుంచి ఈ ఉత్సవానికి సంబంధించిన కూరగాలయను సేకరించారు.

ఈ ఉత్సవానికి విచ్చేసే భక్తులకు రుచికరమైన కదంభం ప్రసాదంగా అందిస్తున్నారు. దీని కోసం 50 టన్నుల కూరగాయలను వినియోగించారు.

వివిధ ప్రాంతాల్లో ఉన్న దాతల నుంచి కూరగాయలు సేకరించి, వాటిని అలంకరించే పనిలో 10 రోజుల నుంచి అక్కడి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

శాకాంభరి ఉత్సవాల ( vijayawada Kanaka Durgamma) సమయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. అదే సమయంలో ఉత్సవాల్లో చివరి రోజు అయిన జులై 10 వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
All photos and event details in this article were provided by Sri Durga Malleswara Swamy Varla Devasthanam PR Team.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.