తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు 2025 ఏప్రిల్ 2వ తేది బుధవారం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ (Surya Prabha Vahanam) జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
ముఖ్యాంశాలు
వాహనసేవ విశేషాలు | Surya Prabha Vahanam

ఆలయ మాడ వీధుల్లో జరిగిన వాహన సేవలో అడుగడగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి (Sri Kodandarama Swamy) దర్శనం చేసుకుని తరించారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం విధి నిర్వహించారు. ఈ సందర్భంగా చందనం, పాలు, తేనె, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకం నిర్వహించారు.
సూర్యప్రభ వాహనం విశిష్టత

సమస్త జగత్తుకు వెలుగును, శక్తిని ఇచ్చే తేజోనిధి సూర్యుడు (Sun). ఎన్నో రోగాలను నివారించే భానుడు ప్రకృతికి చైతన్యాన్ని ప్రసాదిస్తాడు. భూమిపై వర్షానికి కారణం అవుతాడు. ఆహారం, ఔషదం అందించి జీవ కోటికి ప్రాణాధారం అయ్యాడు. సూర్యప్రభ వాహనంపై స్వామివారు సేవకు అందుకే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
ఈ వాహన సేవలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
రథోత్సవం | Rathotsavam
శ్రీ కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు అయిన 2025 ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 5.15 నిమిషాలకు స్వామివారు రథారోహణ చేస్తారు. అనంతరం ఉదయం 9.15 నిమిషాలకు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తూ విహరిస్తారు. తరువాత రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి వారు అశ్వ వాహనంపై విహరిస్తారు.
ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.