ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో (Ugadi In Tirumala) ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) చెందిన ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పువ్వులతో, పండ్లతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు.

ఆలయ పరిసరాల్లో ఈ అందమైన అలంకరణ కోసం 8 టన్నుల ట్రెడిషనల్ ఫ్లవర్స్‌తో పాటు, కట్ ఫ్లవర్స్‌ను కూడా వినియోగించారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి (Tirumala Temple) వారి ఆలయం లోపలి భాగంలో పుష్పాలు, ఫలాలతో చేసిన అలంకరణ విశేషంగా భక్తులను ఆకట్టుకుంది.

ఆలయంలోపలి భాగంగా పలు వెరైటీ పండ్ల గుత్తులు, మేలుజాతి పుష్పాలతో అందంగా అలంకరించారు.

ఇక ఆలయం వెలుపలి భాగంలో గొల్లమండపం (Golla Mandapam) పక్కనే పల్లకిలో శయనిస్తున్న శ్రీనివాసుడి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇరువైపులా గరుఖ్మంతుడు, ఆంజనేయుడు ( Lord Hanuman) పల్లకిని మోస్తున్నట్టు మీరు చూడవచ్చు.

ఉగాది (Ugadi 2025) పర్వదినం సందర్భంగా ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న రాధాకృష్ణులు, తోటలో స్నేహితులతో కలిసి మామడి పండ్లను తింటున్న నందగోపాలుడి రూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ అందమైన పుష్ప, ఫలా అలంకరణలను చూస్తూ ఆనందంగా ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకున్న భక్తులు.

చాలా మంది ఈ అలంకరణ ముందు ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.