Kolli Hills : ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన అనుభూతి.. నమక్కల్ కొల్లి హిల్స్ టూర్ ప్యాకేజీ.. కేవలం రూ.450కే
Kolli Hills : వేసవి వచ్చిందంటే చాలు, చల్లని ప్రదేశాలకు వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు. మీరు కూడా సినిమాల్లో చూసిన అందమైన కొండలు, జలపాతాలు, పచ్చని వాతావరణం మధ్య కొంత సమయం గడపాలని అనుకుంటున్నారా? అయితే తమిళనాడులోని కొల్లి హిల్స్ మీకు బెస్ట్ ప్లేస్. నమక్కల్ జిల్లాలో సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండలు, తూర్పు కనుమలలో ఒక భాగం. వేసవిలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ ప్రాంతానికి, జిల్లా యంత్రాంగం, అటవీ, పర్యాటక శాఖలు కలిసి ఒక ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని ప్రకటించాయి. కేవలం రూ.450కే ఈ అందమైన ప్రదేశాన్ని ఎలా చూడవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

కొల్లి హిల్స్ ప్రత్యేక టూరిజం ప్యాకేజీ
వేసవిలో ప్రకృతితో కలిసి ఆస్వాదించడానికి, నమక్కల్ జిల్లా యంత్రాంగం, అటవీ, పర్యాటక శాఖలు కలిసి ఒక ప్రత్యేక పర్యాటక ప్రణాళికను ఏర్పాటు చేశాయి. ఈ ప్రత్యేక పర్యటనకు ప్రయాణ ఛార్జీ ఒక్కొక్కరికి రూ.300 కాగా, టిఫిన్, భోజనంతో సహా మొత్తం రూ.450 చెల్లించాలి. అంటే, చాలా తక్కువ ఖర్చుతో కొల్లి హిల్స్ అందాలను చూడవచ్చు. ఈ ప్యాకేజీ జూన్ 1, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో మళ్లీ వచ్చే వేసవికి కూడా తీసుకుని రావాలని అధికారులు భావిస్తున్నారు. కొల్లి హిల్స్ ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులకు మరచిపోలేని అనుభూతిని ఇస్తాయి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఈ టూర్ ఉదయం 8 గంటలకు సెంబేడు బస్ స్టాండ్ నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్లో మాసిలా జలపాతం, ఎట్టుకై అమ్మన్ ఆలయం, గిరిజన మార్కెట్, కొల్లి హిల్స్ సహజ ఉత్పత్తుల దుకాణం, శీక్కు పారా వ్యూ పాయింట్, సెల్లూర్ వ్యూ పాయింట్, అరప్పళ్ళీశ్వరర్ ఆలయం వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ పర్యటన సాయంత్రం 5:40 గంటలకు ముగుస్తుంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
కొల్లి హిల్స్ సహజ అందాలను ఆస్వాదించాలనుకునే వారు, ఈ టూర్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 7092311380, 9789131707, 6383324098, 7397715684లను సంప్రదించవచ్చు. ఈ టూర్ ప్రకృతిని తక్కువ ఖర్చుతో ఆస్వాదించాలనుకునే వారికి ఒక మంచి అవకాశం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.