"కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభ మేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి 150 దేశాల నుంచి హిందువులు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ అరుదైన కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు సాగుతుంది.
ముఖ్యాంశాలు
45 కోట్ల మంది భక్తులు…| Total Devotees In Maha Kumbh Mela
ఈ 45 రోజుల్లో మొత్తం 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంతో పాటు ఇతర ప్రాంతాల్లో పవిత్ర స్నానాన్ని ఆచరించే అవకాశం ఉంది. అయితే అంతమంది ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు రైల్వే, ఎయిర్‌లైన్ ( Airlines ) సంస్థలు తెగ కష్ట పడిపోతున్నాయి.
దీనికి తోడు భక్తులు కూడా వీలైతే ట్రైన్లో వెళ్తాం లేదంటే విమానాల్లో, వెళ్తాం మా అంటే కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అంతేగా అనుకుంటున్నారు.అనుకున్నదే తడవు వెంటనే టికెట్ ధర ఎంతైనా సరే బుక్ చేసుకుంటున్నారు.
ఈ కుంభమేళా 144 సంత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన కుంభ మేళా. కొంత మందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Maha Kumbh Mela 2025 ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు భక్తులు.
రైళ్లలో రద్దీని చూసి | Trains To Kumbh Mela
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ( Kumbh Mela From Telugu States ) వెళ్లే భక్తులు ముందుగా విమానాల గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ట్రైన్లలో ఎక్కవ సమయం పట్టడం, టికెట్లు కన్ఫర్మ్ అవ్వకపోవడం, దొరక్కపోవడం, లేదా రిజర్వేషన్ లభించని ప్రయాణికుల మధ్య వెళ్లి తమ సీట్ల కోసం ఇబ్బంది పడటం వంటి కారణాల వల్ల ఫ్లైట్స్ గురించి ఆలోచిస్తున్నారు.
ట్రైన్లో రెండు రోజులు పడుతుంది. బస్సులో వెళ్తే రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. టైమ్ ఈజ్ మనీ అనుకుని కొంత మందివ ఫ్లైట్స్‌లో వెళ్లేందుకు ఆసక్త చూపిస్తున్నారు.
తగ్గేదిలే…| Kumbh Mela Flight Tickets Fares
ఆకాశంలో విమాన ధరలు: ఇక కుంభమేళా సమయంలో విమాన ( Flights ) ధరలకు రెక్కలు వచ్చాయి. కనీసం 300 నుంచి 500 శాతం పెరిగాయి అని వార్తలు వస్తున్నాయి. సాధాణంగా టికెట్ ధర వచ్చేసి రూ.7,000 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు టికెట్ ధర రూ.25016 ( 20 నుంచి 23 గంటల ప్రయాణం ) నుంచి రూ.39,443 వరకు (2 గంటల నుంచి 4 గంటల సమయం) ఉంటోంది.ఇవి స్టాండర్డ్ ధరలు మాత్రమే ఇక ఫ్లెక్సిబుల్ టికెట్ల ధర అయితే రూ.44,965 వరకు ఉంటుంది.
తగ్గాల్సిందే ..| Civil Aviation Ministry About Prayagraj Flight Tickets

విమాన టికెట్ల ధరలు అమాంతం పెరగడంపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ), వినియోగదారుల వ్యవహారాల శాఖ రంగంలోకి దిగాయి. టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి అని వివిధ విమానయాస సంస్థల ప్రతినిధులను కోరాయి.
దీంతో ముందుగా స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ( Indigo ) 50 శాతం మేరా టికెట్ల ధరలను తగ్గించేందుకు సుముఖత చూపించింది. మారిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఇవి ఫిబ్రవరి 18 వరకు అమలులో ఉంటాయని తెలిపింది ఇండిగో.
రైళ్లలో ఖాళీల్లేవు…
రైళ్లలో ( Indian Railways) ఖాళీల్లేవు, విమానాల ధరలు అందుబాటులో లేవు. దీంతో చేసేదేమీ లేకా భక్తులు మినీ వ్యాన్లు, టూరిస్టు బస్సులు, సొంత వాహనాల్లో కుంభ మేళాకు వెళ్తున్నారు. ఇక వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణ సంస్థలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు ( Prayagraj ) బస్సులు నడుపుతున్నాయి. వాటి షెడ్యూల్‌ను ముందస్తుగాన భక్తులతో షేర్ చేసుకుంటున్నాయి.
ఇప్పుడు అన్ని దారులు కుంభమేళా వైపే వెళ్తున్నాయి.అందుకే ప్రయాణం కాస్త కష్టంగానూ, కాస్ట్‌లీ వ్యవహారంగా మారింది. అయితే భక్తుల సంకల్పం మాత్రం ఏం మారలేదు.అత్యంత పవిత్రమైన కుంభమేళా వెళ్లేందుకు ఖర్చుల విషయంలో తగ్గేదేలే అంటన్నారు భక్తులు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాగ్‌రాజ్‌లో 22 సందర్శనీయ ప్రదేశాలు | 22 Places To Visit In Prayagraj
- IRCTC Maha Kumbh Gram : లక్ష మంది కోసం లగ్జరీ టెంట్స్ ఏర్పాటు చేసిన ఐఆర్సీటిసి…మహా కుంభ గ్రామం విశేషాలు
- Maha Kumbh 2025 : కుంభ మేళాలో మీ వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఏం చేయాలి ?
- Kashi Travel Guide : కాశీ నగరం విశేషాలు…కాశీలో దర్శిచుకోవాల్సిన ఆలయాలు..కాశీ చరిత్ర, కాశీ ట్రావెల్ గైడ్
- మహాకుంభ మేళ పవిత్ర స్నానాల ప్రాధాన్యత ఏంటి ?