Thailand e-visa: ఇక థాయ్‌ వెళ్లడం ఛాయ్ తాగినంత ఈజీ….ఎందుకో తెలుసా? ! 5 Facts

భారతీయ ప్రయాణికులకు థాయ్‌లాండ్ నుంచి ఒక శుభవార్త వచ్చింది !  2025 జనవరి 1 వ తేదీ నుంచి భారతీయుల కోసం ఈ వీసా ( Thailand e-visa) ను అందుబాటులోకి తీసుకురానుందట థాయ్ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

ఈ వీసా ( e-visa ) సదుపాయాన్ని వినియోగించాలి అనుకుంటున్న వారు ఎంబసీలు, కాన్సులేట్స్ అందించే పేమెంట్ ఆఫ్షన్స్‌‌లో ఒకదాన్ని ఎంచుకుని వీసా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. థాయ్‌లాండ్ వెళ్లే భారతీయ టూరిస్టుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

థాయ్ అంటే జాయ్ | Thailand For Indians

భారతీయులు ఎక్కువగా సందర్శించే దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఒకటి. ఇక్కడి అద్భుతమైన బీచులు, అన్ని రకాలు టూరిస్టులను ఆకట్టుకునే బ్యాంకాక్ , పట్టాయ ( Pattaya ), ఫుకెట్, చియాంగ్ మై ( Chiang Mai ), కో సముయ ( Ko Samui )  వంటి డెస్టినేషన్స్‌ను భారతీయులు బాగా ఇష్టపడుతుంటారు. చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ( Destination Wedding ) , హనీమూన్ ( Honeymoon ), రొమాంటిక్ ట్రిప్ కోసం కూడా చాలా మంది థాయ్ వెళ్తుంటారు.

ఈ వీసా అంటే ఏంటి ? | What is e-visa?

ఈ వీసా అనేది ఒక డిజిటల్ వీసా ( Visa ). ఇందులో దరఖాస్తుదారులు వీసా కోసం ఆన్‌లైన్లో అప్లై చేస్తారు. వీసాకు అనుమతి కూడా అక్కడే లభిస్తుంది. దీని వల్ల ప్రయాణికులు ఎంబసీకి లేద కాన్సులేట్‌‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ వీసా సదపాయం వల్ల ఇక తమ ఇంట్లోంచే వీసాను అప్లే చేసి వీసా ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. సాంకేతికతపై అవగాహన కుర్రకారుకు ఈ సదుపాయం చాలా ఉపయోగపడనుంది.

ఈ వీసా వల్ల ఉపయోగాలు ? | Benefits of e-visa

అంతా ఆన్‌లైన్‌లోనే :  ఈ వీసా అనేది పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే ప్రక్రియ. ప్రయాణికులు తమ వివరాలను ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కూడా ఆన్‌లైన్‌‌లోనే చేయాల్సి ఉంటుంది.

వెయిటింగ్ టైమ్ : ఈ వీసా వల్ల వెయిటింగ్ టైమ్ గణనీయంగా తగ్గనుంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ వీసాలకు అప్రూవల్ దొరుకుతుంది. కొన్ని రోజుల్లోనే ఈ వీసా వచ్చేస్తుంది.

ఎంట్రీ ఆప్షన్లు : ఎంచుకున్న వీసా ప్రకారం ప్రయాణికులు మల్టిపుల్, సింగిల్ ఎంట్రీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. 

యూజర్ ఫ్రెండ్లీ :  ఈ వీసా కోసం యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌పామ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. తక్కువ ఎర్రర్స్‌తో వేగంగా పూర్తి ప్రక్రియ జరిగేలా ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది

ఇరుపక్షాలకు లాభం : ఈ వీసా వల్ల భారత్ – థాయ్‌లాండ్ మధ్య టూరిస్టుల ( Tourists ) సంఖ్యే కాదు వ్యాపార లావాదేవీలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఇది దేశాలు లాభపడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
Prayanikudu
థాయ్‌లాండ్ అంటే హాయ్ లాండ్‌లా మారిపోయింది భారతీయులకు. వీలు దొరికితే చాలు వెళ్లిపోతున్నారు | Photo: Pexels
భారతీయులు థాయ్‌లాండ్ ఎందుకు వెళ్తున్నారు ?

Why Indians Visiting Thailand ? | థాయ్‌లాండ్ భారతీయులకు ఫేవరిట్ దేశాల్లో ఒకటిగా మారింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ముందుగా ఒకప్పుడు చాలా మంది భారతీయులు గోవా ( goa ) కు వెళ్లేవారు. కానీ గోవాలో బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోంది. అందుకే రూపాయి ఎక్కువ అయినా సరే గోవాకు కాకుండా థాయ్‌లాండ్, బాలి ( Bali ), మారిషస్‌కు ( Mauritius ) వెళ్లడానికి భారతీయులు ఇష్డపడుతున్నారు.

పైగా థాయ్‌లాండ్ భారత దేశానికి దగ్గర్లో ఉంటుంది. అక్కడ భారత పర్యాటకులు కోరుకునే అన్ని సదుపాయాలు లభిస్తాయి. బ్యాంకాక్ ( Bangkok )వీధుల్లో సందడి, ఫుకెట్‌లోని ( Phuket ) దీవుల బ్యూటి ఇలా భారతీయులు ఇష్టపడే అంశాలు చాలానే ఉన్నాయి. 

థాయ్‌లాండ్ వెళ్లే భారతీయులు ఈ విషయాలు గమనించాలి 

Tips for Indian Tourist Visiting Thailand : థాయ్‌లాండ్‌కు మొదటిసారి వెళ్లినా లేకా మరోసారి వెళ్లినా కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే మీ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

డాక్యుమెంట్స్ :  ఈ వీసా అయినా సరే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్ వ్యాలిడటీ, ట్రావెల్ ఐటినెరీ ( Thailand travel itinerary ), మీరు ఉండబోతున్న స్టే , హోటల్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

వీసా పాలసీలు :  వీసా పాలిసీలు అనేవి రాత్రికి రాత్రి కూడా మారవచ్చు. అందుకే మీరు థాయ్‌ మాత్రమే కాదు ఎక్కడికి వెళ్లినా అక్కడి లేటెస్ట్ వీసా పాలసీ తెలుసుకోండి. దీని కోసం థాయ్ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు లేదా మంచి ట్రావెల్ ఏజెన్సీని ( Travel Agency ) సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

ఇక్కడికి వెళ్తుంటారు :   చాలా మంది థాయ్‌లాండ్ వెళ్తే పాపులర్ డెస్టినేషన్స్‌ను మాత్రమే తమ ప్లాన్‌లో భాగంగా విజిట్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు తక్కువ మంది వెళ్లే ప్రాంతాలకు కూడా వెళ్లవచ్చు. ఉదాహరణకు చియాంగ్ మై ( Chiang mai ) లేదా పై ( Pai) వంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు. 

థాయ్‌లాండ్ వెళ్లే ముందు అక్కడి సంప్రదాయం గురించి మీరు కొంచెం అయినా తెలుసుకుంటే బెటర్. 

ఈ వీసా ఎలా అప్లై చేయాలి ? | How to apply Thailand e-visa

థాయ్‌ లాండ్ ఈ వీసా కోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్ తెరవగానే మీకు Thai E Visa Official Website అని కనిపిస్తుంది. కిందికి స్క్రోల్ చేయగానే ఈ వీసా ఎలా అప్లై చేయాలి ? ఎవరు అప్లై చేయాలి? ఎలాంటి వీసా కోసం అప్లై చేయాలి అనే సందేహాలకు మీకు సమాధానం దొరకుతుంది.

దీని కోసం థాయ్‌లాండ్ కింగ్డమ్ ( Kingdom Of Thailand) నిర్వహించే అధికారిక వెబ్ సైట్ విజిట్ చేయవచ్చు.

మొత్తానికి 

జనవరి రావడానికి ఇంకా కొంత సమయమే ఉంది. వింటర్‌లో థాయ్‌లో ( Winter In Thailand ) ఎన్నోఉత్సవాలు జరుగుతాయి. పైగా జనవరి అంటే అక్కడికి వెళ్లడానికి బెస్ట్ టైమ్ కూడా. థాయ్ బీచులు ( Thailand Beaches ), అక్కడి ఫుడ్, కల్చర్‌ ఇవన్నీ భారతీయులు ఇష్ట పడే అంశాలు. దీనికి తోడు ఈ వీసా అందుబాటులోకి రానుండటంతో ఈ పొరుగు దేశానికి వెళ్లే వారి సంఖ్య కూడా బాగా పెరిగే అవకాశం ఉంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
వాట్సాప్‌లో ప్రయాణికుడు ట్రావెల్ అప్డేట్స్ అండ్ కంటెంట్ కోసం గ్రూపులో చేరవచ్చు. Click To Join WhatsApp Group వాట్సాప్ 

Leave a Comment

error: Content is protected !!