థాయ్‌లాండ్ అనేది ఒక హ్యాపీ కంట్రీ. అక్కడ ఉన్నవాళ్లు హ్యప్పీగా ఉంటారు. అక్కడికి వెళ్లిన వాళ్లు సంతోషంగా ఎన్నో మెమోరీస్‌తో తిరిగివస్తారు. థాయ్‌లాండ్ (Thailand) నిజంగా మీ హార్ట్‌ను హ్యప్పీగా ఫీల్ చేసే టూరిస్ట్ డెస్టినేషన్.
ఎన్నో బ్యూటిఫుల్ డెస్టినేషన్స్, చారిత్రాత్మక ప్రదేశాలు, టేస్టీ ఫుడ్ అండ్ సంతోషంగా పలకరించే స్థానికులు ఇవన్నీ కలిపి థాయ్‌లాండ్‌ను లక్షలాదిమంది ఫేవరిట్ డెస్టినేషన్‌గా మార్చాయి. అయితే 2024 లో థాయ్‌లాండ్ వెళ్లాలి అనుకునే వారు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఈ స్టోరీలో చదవండి
ముఖ్యాంశాలు
థాయ్‌లాండ్ ఎప్పుడు వెళ్లాలి ?
థాయ్‌లాండ్ నిత్యం పర్యటకులతో కిటకిటలాడుతుంది. ప్రత్యేక సీజన్ అంటూ పెట్టుకోకుండా చాలా మంది అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్తుంటారు. అయితే మీ లాంటి టేస్ట్ ఉన్న వ్యక్తులు మాత్రం బెస్ట్ టైమ్ ఏంటో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
బెస్ట్ టైమ్ విషయానికి వస్తే నవంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి 20 వరకు బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.
తరువాత ఎండలు మొదలవుతాయి. ఆ టైమ్‌లో చాలా మంది థాయ్‌లాండ్ వెళ్లడాన్ని ఎవాయిడ్ చేస్తారు.
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి, పొగమంచుతో అలరించే అందమైన కొండలు లోయలు, సముద్ర తీరాలు బాగుంటుంది ఈ టైమ్‌లో.
Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ఈ టైమ్‌లో థాయ్‌లాండ్‌లో చాలా లోకల్ ఫెస్టివల్స్ జరగుతుంటాయి. వాటిని ఎంజాయ్ చేయొచ్చు. డిసెంబర్ నెలలో “ సాంగ్‌క్రాన్” ( Songkran ) అనే వాటర్ ఫెస్టివల్ జరగుతుంది.
దాంతో పాటు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు జరగుతుంటాయి.
థాయ్‌లాండ్ ఫ్లైట్ టికెట్ ధరలు
Thailand Flight Ticket Prices : ఒకవేళ మీరు 2024 లో థాయ్‌లాండ్ వెళ్లాలి అనుకుంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే మంచిది. మే నుంచి జులై మధ్యలో ఫ్లైట్ టికెట్ ధరలు తక్కువ ధరకు లభిస్తాయి. సుమారు రూ.23,000 నుంచి రూ.27,000 వేల వరకు అప్ అండ్ డౌన్ చార్జెస్ ఉంటాయి.
అదే మీరు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే మీకు అప్ అండ్ టికెట్ చార్జీలు రూ.33,000 వరకు పడే అవకాశం ఉంది. వివిధ విమానయాన సంస్థలు అందించే ధరలను కంపేర్ చేసి బెస్ట్ డీల్ బుక్ చేసుకుంటే బెటర్.
Read Also: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
థాయ్‌లాండ్‌లో ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి ?
Things To Do In Thailand : థాయ్‌లాండ్ అంటే కేవలం జల్సాలకే కాదు…ఇదో అందమైన ప్రపంచం. బ్యాంకాక్ కు వెళ్తే బాధలన్నీ పోతాయి అనేలా ఈ తరం ఫీల్ అవుతోంది అంటే ఎందుకో చూడండి.
1.బ్యాంకాక్ | Bangkok :
తెలుగు వాళ్లు చాలా మంది బ్యాంకాక్‌కు వెళ్తుంటారు. టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ చాలా సార్లు బ్యాంకాక్ గురించి ప్రస్తావించడంతో తెలుగు వాళ్లు కూాడా ఇక్కడికి రావడం మొదలుయ పెట్టారు. ఇక్కడ మీరు వాటర్ బోట్‌లో టూర్ వేయొచ్చు, ఎన్నో చారిత్రాత్మక ఆలయాలు, లైబ్రెరీలు, స్పాట్స్ విజిట్ చెయెచ్చు. థాయ్ మసాజ్ ట్రై చేయొచ్చు. న్యూ ఇయర్ టైమ్‌లో ఇక్కడ బాగా సందడిగా ఉంటుంది.
Also Read | Manali : ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
2.చియాంగ్ మై | Chiang Mai
పర్వతాలు, కొండలను ఇష్టపడే వారికి చియాంగ్ మై బాగా నచ్చుతుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి.
ఇక్కడ ఎన్నో బౌద్ధారామాలు (Buddhist monasteries) ఉన్నాయి. తరచూ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్స్ ( Food Festivals) జరుగుతూ ఉంటాయి.
3.పట్టాయా | Pattaya
సేల్స్ టీమ్ తమ టార్గెట్ అఛీవ్ చేస్తే చాలా సంస్థలు పట్టాయాకు టూరుకు పంపిస్తాయి. ఎందుకంటే పట్టాయాలో బీచెస్ ఉన్నా, జిగేల్‌మనే వెలుగులతో అన్నీ మర్చిపోయేలా చేసే నైట్ లైఫ్ ఉంటుంది మరెన్నో టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ సన్ బాథింగ్ అండ్ వాటర్ స్పోర్ట్స్ ( Water Sports ) మిమ్మల్ని ఎంజాయ్ చేసేలా చేస్తాయి
4.థాయ్ క్యూజిన్ | Thai Food Experience
థాయ్‌లాండ్‌లో ఎక్కడికి వెళ్లినా మీకు కొత్తరకం ఆహార పదార్థాలు కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు ఫుడ్‌తో చాలా ఎక్స్‌పరిమెంట్స్ చేస్తుంటారు. దీంతో పాటు పాడ్ థాయ్, టామ్ యుమ్ గూంగ్, మాసమాన్ కర్రీ ఇలా ఎన్నో ఫేమస్ రెసెపీలను ఎంజాయ్ చేయొచ్చు మీరు.
5.స్కూబా డైవింగ్ | Scuba Diving In Thailand
థాయ్‌లాండ్ అంటే చాలా మంది గుర్తొచ్చేదే వాటర్ స్పోర్డ్స్ అందులోనూ స్కూబా డైవింగ్ అనేది ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్. ఇక్కడి నీటిలో జలకాలాటలే కాదు జలక్రీడలు కూడా ఒక అద్భుతమైను అనుభవాన్ని మీకు అందిస్తాయి.
మొత్తానికి థాయ్‌లాండ్ ఎవరినీ నిరాశ పరచదు. అయితే మీ టూర్ మిమ్మల్ని నిరాశ పచరకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ముందుగానే హోటల్స్, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోండి. అవసరమైన వాటిని ప్యాక్ చేసుకోండి. మీ ట్రావెల్ డెస్టినేషన్స్ అండ్ చేయాల్సిన యాక్టివిటీస్ గురించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే థాయ్‌లాండ్ ట్రిప్ మోస్ట్ మెమోరేబుల్ ట్రిప్‌గా జీవితాంతం మిగిలిపోతుంది.
Also Read : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి