ఈ 7 దేశాల్లో అసలు నదులే లేవు…ఆ దేశాలు ఏవంటే | countries without rivers

షేర్ చేయండి

నది ఉన్న చోటే నాగరికత వెలుస్తుంది. నది లేని చోట ఉండరాదు అని ఆచార్య చాణిక్యుడు కూడా చెప్పాడు. నదుల వల్ల నీటి లభ్యతే కాదు, రవాణా సౌకర్యం, వ్యవసాయానికి కావాల్సిన (countries without rivers) సాగు నీరు కూడా అందుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు నదులే లేదు. అందులో 7 దేశాల గురించి ఈ పోస్టులో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

1. సౌదీ అరేబియా | Saudi Arabia

countries without rivers
Saudi Arabia

అరేబియా ద్వీపకల్పంలోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఈ దేశంలో ఒక్క నదీ కూడా లేదు. కానీ ఆధునిక డిసాలినేషన్ సాంకేతికత (desalination technology) సాయంతో భూగర్భంలో ఉన్న నీటిని వినియోగించుకుంటుంది ఈ దేశం.

2. బహ్రెయిన్ | Bahrain 

a city with many tall buildings
బహ్రెయిన్

ఈ చిన్న ఐలాండ్ దేశంలో నది లేదు . అందుకే తాగునీటి అవసరాకోసం భూగర్భ జలాలపై (Ground Water), అడ్వాన్స్ డిసాలిటేషన్ టెక్నాలజీపై ఆధారపడతారు.

3. కువైట్ | Kuwait

Kuwait
కువైట్ టవర్

తన పొరుగు దేశాల్లాగే కువైట్ కూడా నదిజలాలపై ఆధారపకుండా నాగరికతను ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ప్రధానంగా డిసాలినేషన్ ప్లాంట్స్‌ వల్లే నీరు అందుతుంది. దీంతో పాటు వర్షాకాలలో ఎండిపోయిన నదుల్లో చేరిన నీటిని కూడా వినియోగించుకుంటారు.

4.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 

United Arab Emirates
యూఏఈలోని భవనాలు

United Arab Emirates : యూఏఈలో నదులు లేకపోయినా అది తన ప్రజల అవసరాల కోసం నీటిని అందించేందుకు ఆధునిక సాంకేతిక సాయం తీసుకుంటోంది. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడం వంటి విధానాలతో పాటు, అధ్యాధునిక డిసాలినేషన్ సాంకేతికత వల్ల ప్రజల దాహాన్ని తీర్చగలుగుతోంది.

5.ఖతార్ | Qatar

Qatar
ఖతార్

ఖతార్‌లో మంచి నీటిని మొత్తం డిసాలినేషన్ ప్రాసెస్‌‌లో సేకరించడంతో పాటు దిగుమతి (Water Imports) చేసుకోవడం చేస్తారు. దీన్ని బట్టి ఆ దేశంలో నీరు ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. చుక్క చుక్కను ఒడిసిపట్టుకుని జాగ్రత్తగా వాడుతారు.

6.ఒమన్ | Oman 

Oman
ఒమన్

ఒమన్ మంచి నీటి కోసం ఎండిపోయిన నదులపై (Dry River) ఆధారపడుతుంది. వర్షాకాలంలో ఈ ఎండిన నదీ ప్రాంతాల్లో నీరు చేరుకుంటుంది. దీంతో పాటు డిసాలినేషన్ ప్లాంట్స్‌ ఏర్పాటు చేసిన వాటితో తమ ప్రజల నీటి అవసరాలను నెరవేర్చుతుంది.

7.మాల్దీవ్స్ | Maldives

Maldives
మాల్దీవ్స్

వందలాది ద్వీపాలు ఉన్న (Island Nations) మాల్దీవ్స్‌లో ఒక్క నది కూడా లేదు. చుట్టూ ఉన్న సముద్ర నీటిలోంచి ఉప్పును (Saline Water) తొలగించి వాటిని వాడుకుంటుంది. దీంతో పాటు వర్షపు నీటిని జాగ్రత్తగా కాపాడుకుని వాడుకుంటారు. 

డిసాలినేషన్ అంటే ఏంటి ?

desalination
వాటర్‌ట్రీట్మెంట్ ప్లాంట్

What is Desalination : డిసాలినేషన్ అంటే సముద్రపు నీరు లేదా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిలోని ఉప్పు, ఇతర మలినాలను తొలగించడం. ఈ ప్రాసెస్ పూర్తి చేసి ఈ నీటిని ప్రజల అవసరాలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ నీటిని తాగడానికి, సాగుకోసం, పరిశ్రమల కోసం వినియోగిస్తారు. మంచినీటి సదుపాయం లేని దేశాలు, ప్రాంతాల్లో డిసాలినేషన్ ప్రక్రియ ద్వారా నీటి అవసరాలను తీర్చుతారు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!