Tirumala Alert : శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్…జనవరి దర్శన కోటా రేపు విడుదల.. పూర్తి వివరాలు
Tirumala Alert : కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి హిందువు ఆశిస్తాడు. పవిత్ర తిరుమల క్షేత్రంలో స్వామివారిని కనులారా చూసేందుకు భక్తులు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఈ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి నెలా మాదిరిగానే, కొత్త సంవత్సరం – జనవరి 2026 నెలకు సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్లు, వసతి (గదుల) బుకింగ్ కోటాను విడుదల చేయబోతోంది.
ముఖ్యంగా జనవరి 1వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉండటం వలన, ఆ నెలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. ఈ పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ఆన్లైన్ బుకింగ్‌ల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. రేపటి నుంచే అంటే అక్టోబర్ 19 నుంచే బుకింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
టీటీడీ సంస్థ తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ముందస్తు దర్శన టికెట్లు, గదుల బుకింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. మరో రెండు నెలల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అంతేకాకుండా, జనవరి 1వ తేదీన వైకుంఠ ఏకాదశి కావడంతో, చాలా మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం జనవరి నెల దర్శన కోటా రేపు విడుదల కానుంది. అంతేకాకుండా, శ్రీవారి సేవలకు సంబంధించిన లక్కీ డిప్‌తో పాటు వివిధ రకాల సేవలు, ప్రత్యేక దర్శనాలను ముందుగానే బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ అందిస్తోంది.

జనవరి 2026 దర్శన కోటా వివరాలు
టీటీడీ జనవరి 2026 నెలకు విడుదల చేయనున్న వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు కింద చూడొచ్చు.
అర్జిత సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు: అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్ల జనవరి కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఈ సేవా టికెట్ల కోసం అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారికి అక్టోబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లించిన వారికి టికెట్లు మంజూరు చేయబడతాయి.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
అర్జిత సేవా టికెట్ల విడుదల (అక్టోబర్ 23): కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను టీటీడీ అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
వర్చువల్ సేవా కోటా విడుదల (అక్టోబర్ 23): వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
శ్రీవాణి దర్శన కోటా విడుదల (అక్టోబర్ 24): శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ కోటాను అక్టోబర్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయబడుతుంది.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా (అక్టోబర్ 24): వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల దర్శనం చేసుకోవడానికి వీలుగా, టీటీడీ అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కోటా (అక్టోబర్ 25): ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
గదుల కోటా విడుదల (అక్టోబర్ 25): తిరుమల, తిరుపతిలో గదుల కోటాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయబడుతుంది.
ఈ సేవలను పొందాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.