తిరుమల కళ్యాణ వేదికలో ఉచిత వివాహం సదుపాయం పూర్తి గైడ్ | Tirumala Kalyana Vedika
Tirumala Kalyana Vedika లో ఉచిత వివహ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలి ? ఎవరు అర్హులు ? డాక్యుమెంట్స్ ఏవి కావాలి ? కంప్లీట్ గైడ్
తిరుమలలో టీటీడీ (TTD) నిర్వహిస్తున్న కళ్యాణ వేదిక ఉచిత వివాహ సదుపాయానికి ప్రతి సంవత్సరం భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపవినాశనం రోడ్డులో ఉన్న కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నారు. 2025 డిసెంబర్ 31 వరకు ఇక్కడ 26,777 వివాహాలు విజయవంతంగా జరగడం ఈ పథకం ఎంత పాపులర్‌గా ఉందో సూచిస్తోంది.
టీటీడీ ఉచితంగా అందించే సదుపాయాలు
ఈ స్కీమ్‌లో భాగంగా టీటీడీ తరఫున పురోహితులు, మంగళ వాయిద్యాలు, పసుపు, కుంకుమ, కంకణం వంటి అవసరమైనవి ఉచితంగా అందిస్తారు. అయితే, వివాహానికి కావాల్సిన మిగతా సామగ్రిని వధూవరులే తీసుకుని రావాలి.
తల్లిదండ్రుల హాజరు తప్పనిసరి | Parents Must
వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా వివాహానికి హాజరుకావాలి. ఒకవేళ తల్లిదండ్రులు రాలేని పరిస్థితిలో ఉంటే, అందుకు సంబంధించిన ఆధార పత్రాలు సమర్పించాలి.
దర్శనం, లడ్డూలు & రూమ్ సదుపాయం | Tirumala Kalyana Vedika
వివాహం అనంతరం రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా వధూవరులు, ఇరువైపుల తల్లిదండ్రులు కలిపి మొత్తం 6 మందికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తారు. దర్శనం పూర్తయ్యాక, వివాహ రసీదులో పేర్కొన్న సంఖ్య ప్రకారం లడ్డూలు ఉచితంగా పొందవచ్చు. అందుబాటులో ఉంటే రూ.50 రూమ్ ను CRO / ARP కార్యాలయం ద్వారా కేటాయిస్తారు.
ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ | How To Book
ఉచిత వివాహం కోసం ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in లో ‘కళ్యాణ వేదిక’ ఆప్షన్‌ను ఎంపిక చేసి వధూవరుల వివరాలు, తల్లిదండ్రుల వివరాలు, ఆధార్, వయస్సు ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి.
- వయస్సు ధృవీకరణకు బర్త్ సర్టిఫికేట్
- SSC మార్క్ మెమో
- ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్
- పంచాయత్ లేదా మునిసిపల్ సర్టిఫికేట్ అంగీకరిస్తారు
- బుకింగ్ పూర్తయ్యాక అక్నాలెడ్జ్ రిసిప్ట్ జారీ అవుతుంది
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & అర్హతలు | Documents and Qualification
ఈ అక్నాలెడ్జ్ రిసిప్ట్‌తో పాటు వధూవరులు ఇరువురు ఎమ్మార్వో (తహసిల్దార్) నుండి Unmarried Certificate తీసుకోవాలి. వివాహానికి 6 గంటల ముందే తిరుమల చేరుకుని, కళ్యాణ వేదిక కార్యాలయంలో జిరాక్స్ డాక్యుమెంట్లు సమర్పించి స్టాఫ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
ఈ ఉచిత వివాహాలకు హిందూ మతస్తులే అర్హులు. వరునికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రెండవ వివాహాలు, ప్రేమ వివాహాలు ఇక్కడ జరగవు.
- ఇది కూడా చదవండి : ఒకే రోజులో తిరుమల దర్శనం సాధ్యమా? తాజా నియమాలు & పూర్తి గైడ్
వివాహ రిజిస్ట్రేషన్ సౌకర్యం
పెళ్లి అయిన వెంటనే హిందూ మేరేజ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందుకోసం వయస్సు ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, పెళ్లి ఫోటోలు, ఇన్విటేషన్ కార్డు, కళ్యాణ వేదిక రసీదు సమర్పించాలి.
ఆధ్యాత్మిక వాతావరణంలో, శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని ఆశించే జంటలకు Tirumala Kalyana Vedika ఒక అద్భుతమైన అవకాశంగా నిలుస్తోంది.
- మరింత సమాచారం కోసం కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్: 0877-2263433
- సమయం: ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
