కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 16 ప్రత్యేక ట్రైన్లు | Spl Trains To Kumbh Mela 2025 From Telugu States

Share This Story

2025 లో జరగబోయే మహాకుంభ మేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ( South Central Railway ) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని గమనించి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 23 వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ( Trains To Kumbh Mela 2025 ) ప్రకటించింది.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
మహాకుంభ మేళా ప్రత్యేక ట్రైన్ వివరాలు
1.గుంటూరు- ఆజంగడ్-గుంటూరు స్పెషల్ ట్రైన్స్ ( Train No. 07701 / 07702 )


Guntur -Azamgarh -Guntur Special Trains : ఈ రెండు సర్వీసులు అనేవి గుంటూరు నుంచి ఆజంగడ్, ఆజంగఢ్ నుంచి గుంటూరు మధ్యలో నడవనున్నాయి.
ఈ ట్రైన్ ఆగు స్టేషన్ల వివరాలు: – ఈ ట్రైన్లు విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిల్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సి, పిపారియా, నర్సింగ్‌పుర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, చియోకి, మిర్జాపూర్, బెనారస్, షాహ‌గంజ్‌లో కూడా ఆగనున్నాయి.

2.మౌలాలి- ఆజంగడ్-మౌలాలి స్పెషల్ ట్రైన్స్ ( Train No. 07707 / 07708 )


Maula Ali- Azamgarh-Maula Ali Special Train : ఈ రూట్లో నాలుగు సర్వీసులు ఉండనున్నాయి.ఈ ట్రైన్లు చెర్లపల్లి, జన్‌గావ్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిల్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సి, పిపారియా, నర్సింగ్‌పుర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, చియోకి, మిర్జాపూర్, బెనారస్, షాహ‌గంజ్‌లో స్లేషన్‌లలో ఆగనున్నాయి.

3. మౌలాలి-గయా-మౌలాలి స్పెషల్ ట్రైన్స్ ( Train No. 07711 / 07712 )

Moula Ali-Gaya-Moula Ali Special Trains : ఈ రూట్లో రెండు సర్వీసులు ఉండనున్నాయి.ఈ ట్రైన్‌‌లు జన్‌గావ్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిల్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సి, పిపారియా, నర్సింగ్‌పుర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, చియోకి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, చండౌలీ మజ్వార్, భాబువా రోడ్, ససరామ్, డెహ్రీ , నారాయణ రోడ్‌లో ఆగుతాయి.

4. మౌలాలి- గయా స్పెషల్ ట్రైన్ ( Train No. 07729 )
Trains To Kumbh Mela 2025
మహాకుంభ మేళాకు సుమారు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

ఈ ట్రైన్ అనేది మౌలాలి నుంచి జనవరి 22వ తేదీన బయల్దేరి గయా నుంచి 24వ తేదీన బయల్దేరుతుంది. పైన వివరించి మార్గంలోనే ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది.

5.గుంటూరు- గయా స్పెషల్ ట్రైన్ (Train No.07719 )


Guntur-Gaya Special Train : గుంటూరు నుంచి ఈ ట్రైన్ 2025 జనవరి 25వ తేదీన బయల్దేరుతుంది. గయా నుంచి జనవరి 27న గుంటూరు వైపునకు బయల్దేరుతుంది.
ఈ ట్రైన్ ఆగు స్టేషన్ల వివరాలు:- విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నాకల్, మహాబూబా బాద్, వరంగల్,పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిల్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సి, పిపారియా, నర్సింగ్‌పుర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, చియోకి, చండౌలీ మజ్వార్, భాబువా రోడ్, ససరామ్, డెహ్రీ , నారాయణ రోడ్లో ఆగనుంది.

6. నాందేడ్- పాట్నా స్పెషల్ ట్రైన్ ( Train No. 07721 ) | Trains To Kumbh Mela 2025


Nanded-Patna Special Train : ఈ ట్రైన్ నాందేడ్ నుంచి జనవరి 22వ తేదీన పాట్నావైపు బయల్దేరుతుంది. జనవరి 24వ తేదీన పాట్నా నుంచి బయల్దేరుతుంది.
ఈ ట్రైన్ ఆగు స్టేషన్ల వివరాలు:- పూర్ణా, బస్మాత్, హింగోలి, వాషిమ్, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా, ఇటార్సి, పిపారియా, నర్సింగ్‌పుర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, చియోకి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బక్సర్, ధనాపూర్.

కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్ | Kacheguda- Patna Special Train :


పైన వివరించిన ట్రైన్లతో పాటు దక్షిణ మధ్య రైల్వే మరో ప్రత్యేక రైలును కాచిగూడ నుంచి నడపనుంది. కాచిగూడ నుంచి పాట్నా స్పెషల్ పేరుతో ( Train No.07725) ఈ ట్రైన్ జనవరి 25వ తేదీన కాచిగూడ నుంచి బయల్దేరనుంది. పాట్నా నుంచి జనవరి 27వ తేదీన కాచిగూడ వైపు తిరుగుప్రయాణం మొదలుపెట్టనుంది.

ఈ ప్రత్యేక ట్రైన్లు ( Trains To Kumbh Mela ) మహకుంభ మేళాకు వెళ్లాలి అనుకునే తీర్థయాత్రికులకు సేవలు అందించనున్నాయి. వీటి సేవలు వినియోగించుకోవాలి అని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను కోరింది.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

Share This Story

Leave a Comment

error: Content is protected !!