Travel Tip 04 : ప్రయాణాల్లో తప్పకుండా తీసుకెళ్లాల్సిన టాయిలెటరీస్ ఏంటో తెలుసా?
Travel Tip 04 : ప్రయాణాల్లో మనం బట్టలు, బుకింగ్స్ వంటి విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం. టాయిలెటరీస్ (Toiletries), అంటే సబ్బులు, షాంపు ఇలా ఏఏ వస్తువలు ప్యాక్ చేసుకోవాలనే విషయంలో కొంత మంది తికమక పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్టు.
ముఖ్యాంశాలు
ఇక స్టార్ట్ చేద్దామా…
ఎవరికైనా ఇవి అవసరం | Must Carry Toiletries For Travel
ఇందులో వీలైనంత వరకు మగవారికి, మగువలకు చిట్కాలను వేరు వేరుగా అందించాను. అయితే కొన్ని కామన్ ఉంటాయి కాబట్టి వాటిని డివైడ్ చేయలేదు.
ప్రతీ ప్రయాణికుడు (Prayanikudu) తమనో పాటు తీసుకెళ్సిన కామన్ వస్తువులు వచ్చేసి టూత్ బ్రష్, టూత్ పేస్ట్ , సబ్బు లేదా బాడీ వాష్ లిక్విడ్, వెట్ వైప్స్, శానిటైజర్, షాంపూ , కండిషనర్ వీటిని మీ అవసరాన్ని బట్టి ఎంచుకుని తీసుకెళ్లండి.
- వీలైనంత వరకు చిన్న సైజులో ఉన్నవి, తక్కువ క్వాంటిటిలో ఉన్నవి ప్యాక్ చేసుకోండి.
మెడికల్ కిట్ | Medical Kit For Traveling
ప్రయాణాల్లో మనం ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటాం. అన్ని చోట్లా అన్ని వస్తువులు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. అందుకే మీతో పాటు మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యులు సూచించిన మందులతో పాటు , బ్యాండెయిడ్, బామ్, వంటి వాటితో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ తయారు చేసుకుని తీసుకెళ్లండది. దీంతో పాటు మీరు కాంటాక్ట్స్ లెన్స్ వాడుతోంటే వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుని బయల్దేరండి.
- ఇది కూడా చదవండి : 2025 లో స్మార్ట్ ట్రావెలర్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్ ఇవే !
Toiletry Women Need To Pack For Traveling : మహిళలు ఏదైనా యాత్రకు బయల్దేరే ముందు అవసరాన్ని బట్టి శానిటరీ ప్యాడ్స్ లాంటి హజీనిక్ ప్రొడక్ట్స్ మీతో పాటు తప్పనిసరిగా తీసుకెళ్లండి.
- ఏ ప్రయాణంలో అయినా మన అవసరాలకు తగిన వస్తువులు అక్కడ దొరుకుతాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
- దొరుకుతాయని మీకు పక్కగా తెలిసినా అవకాశం ఉంటే క్యారీ చేయడం ఉత్తమం.
- ఇది కూడా చదవండి :విదేశీ ప్రయాణానికి మందులు ఎలా ప్యాక్ చేయాలి? కంప్లీట్ గైడ్ | Medicines For An International Trip
గ్రూమింగ్ అండ్ షేవింగ్ కోసం… Toiletry Women Need To Pack For Traveling
Grooming For Traveling : మగవారిలో చాలా మంది రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటారు. ప్రయాణాల్లో కూడా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా కనిపించేందుకు షేవింగ్ బ్లేడ్, షేవింగ్ జెల్ లేదా బ్లేడ్ క్యారీ చేయండి.
- ఒకవేళ సబ్బుతోనే మేనేజ్ చేయలగను అంటే క్రీమ్ లేదా జెల్ అవరం లేదు అనుకుంటే అది మీ ఇష్టం ( టూర్లలో నేను అదే చేస్తాను).
- ఇక షేవింగ్ తరువాత ఆప్టర్ షేవ్ మాత్రం తప్పనిసరి కదా….ఇక మీరు గడ్గం బాస్ అయితే మాత్రం బియర్డ్ ఆయిల్ (Beard Oil) లేదా స్టైలింగ్ కోసం బామ్ వాడితే అది కూడా తీసుకెళ్లవచ్చు.
మహిళల విషయానికి వస్తే మీ ప్రిఫరెన్స్‌ను, అవసరాన్ని బట్టి రేపర్స్ లేదా ఎపిలేటర్స్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. మీకు అవసరం అయితే హెయిర్ రిమూవల్ క్రీమ్‌ను కూడా క్యారీ చేయవచ్చు. కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడ షాపింగ్ చేయడం కన్నా మన దగ్గర ఉన్నవే క్యారీ చేసే అవకాశం ఉంటే అదే చేయండి.
ప్రయాణాల్లో హెయిర్ కేర్ కోసం
Hair Products To Carry For Travel : ప్రయాణాల్లో చాలా మంది నెగ్లెక్ట్స్ చేసే విషయం ఏంటంటే హెయిర్ కేర్. జుట్టే కదా అని వదిలేస్తుంటారు. కొంత మంది అయితే కనీసం దువ్వెన కూడా తీసుకెళ్లరు.
- అంటే తీసుకెళ్లమని చెప్పడం లేదు. కానీ దువ్వెన లేదా ట్రావెల్ హెయిర్ బ్రష్ ఉంటే బెటర్ కదా.
- ఇక మహిళలు జుట్టును ముడివేసుకోవడానికి క్లిప్పులు, బ్యాండ్స్ లాంటివి తీసుకెళ్లవచ్చు.
- ఇక దువ్వెనే ఎక్కువ అనుకునే పురుషులకు స్టైలింగ్ కోసం జెల్, వ్యాక్స్ తీసుకెళ్లాలమని నేను ఎలా చెప్పగలను ?
- కానీ తీసుకెళ్లాలి అనుకున్న వాళ్లు తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా హ్యాండ్సమ్గా కనిపించే అధికారం ప్రతీ పురుషుడికి ఉంటుంది అనేది మా తాత చెప్పేవాడు.
- దీంతో పాటు పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోకండి. మార్కెట్లో మినీ వర్షన్స్ కూడా దొరుకుతున్నాయి.
- ఇది కూడా చదవండి :Travel Tip 02 : జూలైలో వెళ్లకూడని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే
ప్రయాణాల్లో చర్మ రక్షణ కోసం…
Skin Care During Travel : స్త్రీ పురుషులు అనే తేడాలు ఏమీ లేకుండా ముఖానికి మాయిచ్ఛరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ (Sunscreen Lotion), లిప్ బామ్, ఫేస్ వాష్ లిక్విడ్, బాడీ లోషన్లో మీ అవసరాన్ని బట్టి మీతో పాటు తీసుకెళ్లండి. ఇందులో మీ చర్మానికి సెట్ అయ్యేవి మాత్రమే తీసుకోండి.
ప్రయాణాల్లో ప్యాకింగ్ ఎలా ? | Travel Tip 04
ప్రయాణాల్లో ఏం తీసుకెళ్లాలో ఏం తీసుకెళ్లకూడాదో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అంతగా ఆలోచించ పని లేకుండా సులభంగా తెలుసుకోవాలి అనుకుంటే మీకోసమే ఈ పోస్టు. ఇందులో నేను చాలా ప్రాక్టికల్‌గా టిప్స్ ఇచ్చాను.
ఇక సబ్ హెడింగ్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా కొన్ని టిప్స్ చెప్పడం సంస్కారం కదా .
- ప్రయాణాల్లో ఉన్నప్పుడు మంచి వాటర్ బాటిల్ అది కూడా నీళ్లు బయటకు రాని లీక్ ప్రూఫ్ బాటిల్స్ క్యారీ చేయండి.
- ఇక మీతో పాటు చిన్న టాయిలెటరీ కిట్ రెడీగా తీసుకెళ్లండి. ఇందులో బేసిక్ వస్తువులు పెట్టుకుని బ్యాగులో మీకు సులభంగా అందే విధంగా చూసుకోండి.
Travel Tip 04 : ఈ టిప్స్‌లో చెప్పిన వస్తువులను అదే విధంగా తీసుకెళ్లాలని అనడం లేదు. అయితే సాధారణంగా తీసుకెళ్లే, లేదా తీసుకెళ్లాల్సిన వస్తువులను మీకోసం అందించాను. అందులో మార్పులు చేర్పులు అనేవి మీ ఇష్టాన్ని బట్టి చేసుకోగలరు. నేను మిస్ అయినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.