Travel Tips 06 : ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? 7 హ్యాక్స్ ట్రై చేయండి
Travel Tips 06 : జేబుకు చిల్లు పడకండా ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? అయితే అయితే ఈ 7 హ్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి.
ఈ చిట్కాలు పాటిస్తే మీరు వైజాగ్ ఆర్కే బీచు (RK Beach) నుంచి గుంటూరు తిరుపతి వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తక్కువ ఖర్చుతో మీ ప్రయాణాన్ని సాఫీగా పూర్తి చేసుకోవచ్చు. అది కూడా అత్యంత తక్కువ బడ్జెట్‌తో. ఈ టిప్స్ మీకు పనికొస్తాయిన అని ఆశిస్తున్నాను.
1. పల్లె వెలుగు బస్సులు | Palle Velugu
Andhra Pradesh : ఏపీలో మారుమూల గ్రామానికి అయినా కూడా పల్లె వెలుగు బస్సులో ప్రయాణించవచ్చు టికెట్ ధర రూ.10 నుంచి రూ. 150 మధ్యలో ఉంటుంది. ఏపీలో అన్ని జిల్లాలలో పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే వారు ఇలా డబ్బు సేవ్ చేసుకుంటూ తమ ప్రయాణం పూర్తి చేసుకుంటున్నారు.
- దీంతో పాటు గ్రామీణ జీవితాన్ని చూడాలి అనుకుంటే కూడా ఈ బస్ మీకు బాగా ఉపయోగపడుతుంది.
2.ప్యాసింజర్ రైళ్లు | AP Passenger Trains
(Cheapest Travel Option In AP) ఏపీలో చవకగా ప్రయాణించే మరో సాధనం ప్యాసింజర్ ట్రైన్. టికెట్ ధర చాలా తక్కువ. రూ.5 నుంచి మొదలవుతుంది. మీరు కొద్దిగా టైమ్ తీసుకుని ప్రయాణించగలను అనుకుంటే డబ్బు సేవ్ అవడం ఖాయం.
- స్లో బట్ ఫ్లోలో వెళ్లిపోతుంది.
- విద్యార్థులకు, చిన్న వ్యాపారులుకు ఇది బాగా సెట్ అవుతుంది.
- ఇక టైమ్‌తో పని లేకుండా ప్రయాణించాలి అనుకునే వారికి కూడా మంచి ఆప్షన్ అవుతుంది.
- ఇది కూడా చదవండి : Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు
3.షేర్ ఆటోలు, టెంపోస్ | Share Autos and Tempos
మన తెలుగు రాష్ట్రాల్లో షేరింగ్ ఆటోలకు కొదువే లేదు. మేజర్ సిటీల నుంచి చిన్న గ్రామాల వరకు అనేక చోట్ల షేరింగ్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. దూరాన్ని బట్టి రూ.10 నుంచి రూ.30 వరకు ఫేరింగ్ చేసుకుని షేరింగ్‌లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.
- గుంటూరు నుంచి గన్నవరం వరకు, నెల్లూరు నుంచి చిత్తూరు వరకు పాడేరు నుంచి పార్వతీపురం వరకు షేరింగ్ ఆటోలు, కార్ల సర్వీసులు అన్ని చోట్లా మీకు అందుబాటులో ఉంటాయి.
- ఇక బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆలయాలు, కాలేజీలు ఇలా చాలా చోట్ల షేర్ ఆటోలూ ష్యూర్‌గా దొరుకుతాయి.
- ఇది కూడా చదవండి : Travel Tip 03 : జూలై నెలలో టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రాంతాలకు వెళ్తే బెటర్
4.సిటీ బస్సులు | AP City Busses | Travel Tips 06
తిరుపతి (Tirupati), విజయవాడ. వైజాగ్ లాంటి నగరాల్లో మీకు సులభంగా సిటీ బస్సులు దొరకుతాయి. టికెట్ ధర రూ.5 నుంచి రూ.25 వరకు మాత్రమే ఉంటుంది.
- సిటీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సిటీ బస్సులు బాాగా ఉపయోగపడతాయి.
- ఇక ఏసీ బస్సులు ఎండాకాలం బాగా ఉపయోగపడతాయి.
5.రైల్వే సీజన్ టికెట్లు | Railway Season Tickets
నిత్యం రైలులో ప్రయాణించేవాారికి రైల్వే సీజన్ టికెట్ బాగా పనికొస్తుంది. ఒకసారి పేమెంట్ చేస్తే నెల మొత్తం ట్రావెల్ చేసే వెసులుబాటు లభిస్తుంది. చిరు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఈ పాస్ గోల్డెన్ పాస్ లాంటిది. డబ్బు బాగా సేవ్ చేసుకోవచ్చు
6. దేవస్థానం ఉచిత బస్సులు | Temple Free Busses
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆలయాల్లో భక్తులకు ఉచిత బస్సు సేవలు వినియోగించుకోవచ్చు.. తిరుమల, శ్రీశైలం వంటి పలు ప్రముఖ దేవాలయాల్లో భక్తల కోసం ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
- అన్నప్రదాదం, ఉచిత లేదా తక్కువ ధరకు వసతి సౌకర్యం కూడా లభిస్తుంది.
- ఉచిత బస్సు, భోజనం, వసతి ఇవన్నీ కూడా భక్తులకే కాదు సాధారణ ప్రయాణికులకు కూడా ఉపయోగపడే విషయాలు.
- నెక్ట్స్ టైమ్ ఏదైనా ఆలయానికి వెళ్తుంటే ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
7. రైడ్ షేరింగ్ యాప్స్ | Ride Sharing Apps In AP
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ ప్రయాణించేవారి కోసం కొన్ని ప్రత్యేక రవాణా సదుపాయాలు ఉన్నాయి. కొన్ని యాప్స్ వాడితో షేరింగ్‌లో మరికొంత మందితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది.
- ఇలా వెళ్తే నార్మల్ ట్యాక్సీ కన్నా తక్కువ ఖర్చులో ట్రావెల్ చేయవచ్చు.
- ఈ మధ్య కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇలాంటి సేవలు అందిస్తున్నారు.
- ఇప్పుడు ఇదే లేటెస్ట్ హ్యాక్.
- కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి, వెరిఫై చేసుకుని ప్రొసీడ్ అవ్వగలరు.
ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అని ఆశిస్తున్నాను. మీలాగే ఎవరికైనా పనికొస్తుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఈ షార్ట్ చూడండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.