TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. నవంబర్ దర్శనం టికెట్ల బుకింగ్ షెడ్యూల్ ఇదే
TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, వసతి గదుల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) త్వరలో విడుదల చేయబోతోంది. ప్రతి నెలా లాగే ఈసారి కూడా ఆన్లైన్లో భక్తులు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టీటీడీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, భక్తులు ఏ రోజు ఏ టికెట్లు బుక్ చేసుకోవచ్చో పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు
నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఈ టికెట్లు పొందాలంటే, ఆగస్టు 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. లక్కీడిప్‌లో టికెట్లు వచ్చిన భక్తులు ఆగస్టు 20 నుంచి 22న మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలి.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
అదేవిధంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి ఇతర ఆర్జిత సేవల టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇక వర్చువల్ సేవల కోసం ప్రత్యేక కోటాను ఆగస్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
అంగప్రదక్షిణ, శ్రీవాణి టికెట్లు
శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు అంగప్రదక్షిణ టోకెన్ల కోసం ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ప్రయత్నించవచ్చు. చాలా ముఖ్యమైనది శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్లైన్ కోటా. వీటిని ఆగస్టు 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ టికెట్లు పొందేవారు సులువుగా దర్శనం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం
వయసు పైబడిన వారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. వీరికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం కల్పిస్తారు.
రూ.300 దర్శనం టికెట్లు, గదుల కోటా
సాధారణ భక్తులు ఎక్కువగా ఆశించే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను కూడా విడుదల చేస్తారు. గదులు చాలా త్వరగా అయిపోతాయి కాబట్టి, ముందుగా బుక్ చేసుకోవడం మంచిది.
ముఖ్య గమనిక: భక్తులు శ్రీవారి దర్శన టికెట్లు, వసతి, ఇతర సేవలను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.