పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశలో ఉక్రెయిన్ కీలక (Ukraine Restores E-Visa) అడుగులు వేసింది. కొన్నేళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం వల్ల పర్యాటకం, వీసా ప్రక్రియ అనేది హెల్డ్‌లో పెట్టింది ఉక్రెయిన్. అయితే ఇప్పుడు 45 దేశాలకు ఈ వీసా అందించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.
ముఖ్యాంశాలు
రెండేళ్లు హోల్డ్‌లో పెట్టిన తరువాత…| Ukraine Restores E-Visa
యుద్ధ మేఘాల నడుమ ఈ వీసా సేవలును తిరిగి ప్రారంభించనున్నట్టు తెలిపింది ఉక్రెయిన్. ఈ ఎలక్ట్రానిక్ వీసా (Electronic Visa) జారీ ప్రక్రియలో భారత్, భూటాన్ (Bhutan), మాల్దీవ్స్, నేపాల్ (Nepal) వంటి 45 దేశాల నుంచి పర్యాటకులను స్వాగతించనుంది ఉక్రెయిన్.
యుద్ధ సంక్షోభంలో ఉన్న కారణంగా గత రెండేళ్లుగా ఈవీసా ప్రక్రియను హోల్డ్ లో పెట్టింది ఉక్రెయిన్. పరిస్థితులు మారకపోయినా పర్యాటకాన్ని (Ukraine Tourism) మళ్లీ ప్రారంభించే దిశలో గతంలో ఉన్నట్టే ఈ వీసా సర్వీసులు మళ్లీ షురూ చేసింది.
ఈ వీసాకు కావాల్సినవి | Ukraine visa Essentials
ఉక్రెయిన్ ఈ వీసా పాలసీ వల్ల ఈ జాబితాలో ఉన్న దేశాల నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే వీసా అప్లై చేయవచ్చు. దీని వల్ల ప్రాసెసింగ్‌లో వేగం పెరుగుతుంది. ఎంబసీలకు వెళ్లే అవసరం కూడా ఉండదు కాబట్టి టైమ్ కూడా మిగులుతుంది. చిక్కులు లేకుండా ఉక్రెయిన్ వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ఈ ప్రక్రియ ఉపయోకరంగా ఉంటుంది. అంతర్జాతీయ పర్యాటకులు, వ్యాపారవెత్తలు లేదా కుటుంబాన్ని కలవడానికి వెళ్లేవారికి ఈ వీసా పునరుద్ధరణ వల్ల ఉపయోగం ఉంటుంది.
45 దేశాలు..అందులో వ్యూహాలు

ఉక్రెయిన్ ఈ వీసా పునరుద్ధరణ (Ukraine E Visa Resumes) జాబితాలో భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక దేశాలు కూడా ఉన్నాయి. వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు మళ్లీ జీవం పోసేందుకు వివిధ ఖండాల నుంచి కీలక దేశాల ఈ వీసాను పునరుద్ధరించింది ఉక్రెయిన్.
ఎలాంటి జాప్యాలు లేకుండా డైరక్టుగా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఈ వీసా ప్రక్రియను సులభతరం చేసింది. అంతర్జాతీయంగా పర్యాటక దేశంగా ఉన్న తన ఖ్యాతిని మళ్లీ లైన్లోకి పెట్టేందుకు చర్యలు తీసుకోవడంలో ఇదో కీలక అడుగు అని చెప్పవచ్చు.
ఉక్రెయిన్‌లో చూడాల్సిన ప్రదేశాలు | Places To Visit In Ukraine
ఉక్రెయిన్‌లో ఎంతో అందమైన లొకేషన్స్ ( Locations In Ukraine) ఉండటంతో పాటు దాని కల్చర్, అద్భుతమైన భౌగోళిక స్వరూపం (Ukraine Landscape) యుద్ధానికి ముందు చాలా మందిని ఆకట్టుకుంది. అయితే చాలా కాలం తరువాత మళ్లీ పర్యాటకులను తమ దేశానికి ఆహ్వానించే దిశగా అడుగులు ముందుకేస్తోంది.
ఉక్రెయిన్‌లో సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని:

- కీవ్ | Kyiv : ఉక్రెయిన్ రాజధాని కీవ్. సెంట్ సోఫియా క్యాథెడ్రల్, కీవ్ పెచెర్క్స్ లావ్రా అనే యూనెస్కో హెరిటేజ్ సైట్ ఉంటుంది.
- లివ్ | Lviv : అద్భుతమైన కాఫీ కల్చర్, అందమైన ఆర్కిటెక్చర్ ఇక్కడ మీరు చూడవచ్చు.ఇక్కడి స్ట్రీట్స్, చారిత్రాత్మక ప్రదేశాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
- ఒడెసా | Odesa: అందమైన బీచులు, ప్రముఖ పోటెంకిన్ మెట్లు ఉన్న అందమైన తీర ప్రాంతం ఇది.
- కార్పాథియ్ పర్వతాలు : నేచర్ లవర్స్ అండ్ ట్రెక్కర్స్‌కు స్వర్గం లాంటి ప్రదేశం ఇది.
- చెర్నోబిల్ | Chernobyl : ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన తీవ్ర విషాదం చోటు చేసుకున్న న్యూక్లియర్ ప్రమాద ప్రదేశం ఇది. నాటి విషాదానికి సాక్ష్యంగా నిలుస్తోంది చెర్నోబిల్. టూరిస్టు గైడుల సాయంతో ఈ ప్రదేశాన్ని చూడవచ్చు
దీంతో పాటు టన్నెల్ ఆఫ్ లవ్, బకోటా (Bakota), చెర్నిహీవ్(Chernihiv), ఉజోరోడ్ (Uzhhorod) వంటి అనేక ప్రదేశాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభాల నడుమ ఏ ప్రదేశాలకు వెళ్లాలో ఏంటో అనేది వెళ్లే ముందు కనుక్కోవాల్సి ఉంటుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.