ఆధునిక అంటరానితనం…ఫుడ్ డిలివరీ ఏజెంట్‌కు చేదు అనుభవం | Blinkit Delivery Worker

షేర్ చేయండి

ఢిల్లీలో ఇటీవలే జరిగిన ఒక ఘటనతో (Blinkit Delivery Worker) అంటరానితనం గురించి మరోసారి చర్చలు మొదలయ్యాయి. బాగా చదువుకున్న హై క్లాస్ సొసైటీల్లో వివక్షత ఎలా కొత్త రూపాన్ని ధరించిందో ఈ ఘటన చాటి చెబుతోంది. బ్లింకిట్ అనే డిలివరీ సంస్థలో ఒక చదువుకున్న పెద్ద అధికారి ఒక్క రోజు కోసం డిలివరీ ఏజెంటుగా చేరాడు.

ఈ సమయంలో అనేక చోట్ల తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని అతను ఒక పోస్ట్ చేశాడు. ఈ పనులు చేస్తున్న వారిని చాలా మంది అసలు గౌరవించడం లేదు అని అతను తన పోస్టులో పేర్కొన్నాడు.

అంటరానితనం అంటే ? | What is Untouchability ?

కొన్ని వర్గాల ప్రజలను దూరంగా ఉంచి వారితో అమానవీయంగా ప్రవర్తించడం అనేదే అంటరాని తనం, వివక్ష. భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. కానీ నేటికీ గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ అనాగరికమైన విధానం కొనసాగుతోంది. దీని వల్ల చాలా మందికి విద్యా, ఉపాది, నివాసం వంటివి అందడంలో ఇబ్బంది అవుతోంది. 

ఆధునిక అంటరానితనం | Modern Untouchability

అంటరానితనం ఇప్పుడు కొత్త రూపం తొడిగింది. బ్లింకిట్ డిలివరీ ఏజెంట్‌గా (Blinkit Delivery worker) మారిన ఒక వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం ఎంత సీరియస్‌గా ఉందో చాలా మందికి తెలిసింది. మనుషులు చేసే పని, వారి వ్యాపారాన్ని బట్టి వారిని అగౌరవ పరచడం అనేది ఆధునిక అంటరానితనంగా చెప్పవచ్చు. 

డిలివరీ ఏజెంట్లను, ఇంటి పనిలో సాయం చేసే వాళ్లను, శానిటేషన్ వర్కర్స్‌‌ను తక్కువగా చూస్తుంటారు కొంత మంది (viral travel video). వారికి గౌరవం ఇచ్చే అవసరం లేదు అనే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇందులో బాగా చదువుకున్న వాళ్లు కూడా ఉండటం బాధాకరమైన విషయం.

Blinkit Delivery Worker
Blinkit : డిలివరీ చేసే సమయంలో కొన్నిసార్లు ఇలాంటి ఇంఫర్మేషన్ కూడా ఫ్రీగా అందిస్తుంది బ్లింకిట్.

మండుటెండలో డిలివరీ | Blinkit Delivery Worker

ఢిల్లీకి (Delhi) చెందిన సల్మాన్ సలీమ్ అనే వ్యక్తి బ్లింకిట్ అనే సంస్థకు డిలివరీ ఏజెంటుగా ఎన్‌రోల్ చేసుకున్నాడు. తరువాత తనకు ఎదురైన అనుభవాలను షేర్ చేశాడు. మండుటెండలో, దుమ్మూ ధూళిని తట్టుకుని డిలివరి చేయడానికి వెళ్తే పోలిసులు, ఏసి కార్లలో కూర్చున్న వాళ్లు డిలవరీ వర్కర్స్‌ను సెకండ్ క్లాస్ ట్రావెలర్స్‌గా ట్రీట్ చేస్తున్నారన్నాడు సల్మాన్. 

  • తనకు లిఫ్ట్ ఎక్కే అవకాశం ఇవ్వకపోవడంతో 4 అంతస్తులు మెట్లు ఎక్కి వెళ్లాడట. సర్వీస్ లిఫ్ట్ కూడా ఎక్కొద్దని చెప్పారట.
  • వివక్షత, అంటరానితనం గురించి సోషల్ మీడియాలో గొప్పగా మాట్లాడే ధనవంతులు నివసించే లగ్జరీ నివాసాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అని తెలిపాడు.
  • డిలివరీ ఎగ్జిక్యూటీవ్స్ (food delivery) కూడా మనుషులే అని ఈ సమాజం గుర్తించాలని తన పోస్టులో రిక్వెక్ట్ చేశాడు సల్మాన్.
  • ఒక వ్యక్తి వేసుకున్న యూనిఫామ్, లేదా అతను వేషధారణను చూసి వారిని చులకనగా చూడటం ఆపాలని, అందరినీ గౌరవంగా చూడాలని కోరాడు.
  • అలాటే జొమాటో (Zomato), బ్లింకిట్ లాంటి సంస్థలు ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల అందరికి గౌరవం లభిస్తుంది అని ఆశించాడు.
  • ఇది కూడా చదవండి :  “లండన్‌లో కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro

బ్లింకిట్ ఘటన వల్ల…

 వివక్షత, అంటరాని తనం అనేది ఎక్కడో మారుమూల గ్రామాలకు మాత్రమే పరిమితం కాదు అని…బాగా చదువుకున్న సొసైటీల్లో కొత్త రూపంలో ఊపిరి పీల్చుకుంటోంది అని అర్థం చేసుకోవచ్చు. మనిషికి తిండి ఎంత అవసరమో గౌరవం కూడా అంతే అవసరం కదా. ఒకరిని గౌరవిస్తే ఎక్కువలో ఎక్కువ ఏమవుతుంది వాళ్లు తిరిగి గౌరవిస్తారు. అంతే కదా !

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. | YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. | WhatsApp ఛానెల్‌లో చేరడానికి  ఇక్కడ క్లిక్ చేయండి. | ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!