Uzbekistan : భారతీయులకు ఫ్రీ వీసా అందించే యోచనలో ఉజ్బెకిస్తాన్

షేర్ చేయండి

ప్రపంచ పర్యాటక రంగంలో (World Tourism) భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వివిధ దేశాలు భారతీయులను తమ దేశానికి వచ్చేలా పథకాలు రచిస్తున్నాయి. తాజగా ఉజ్బెకిస్తాన్ (Uzbekistan) కూడా భారతీయులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది.

భారతీయుల జాదూ | Indian Travelers 

ప్రపంచ పర్యాటక రంగంలో (World Tourism) భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వివిధ దేశాలు భారతీయులను తమ దేశానికి వచ్చేలా పథకాలు రచిస్తున్నాయి. అమెరికా నుంచి యూఏఈ (UAE) వరకు అనేక దేశాలు భారతీయ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేస్తున్నాయి. మరి కొన్ని దేశాలు ఫ్రీ వీసా, లేదా ఆన్ అరైవల్ వీసా కల్పిస్తూ ఆకర్షిస్తున్నాయి. ఆ జాబితాలో చేరేందుకు ఉజ్బెకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 

మిషన్ 2030 | Uzbekistan

Uzbekistan Culture
వినూత్నమైన కల్చర్‌‌ ఉజ్బెకిస్తాన్‌కు సొంతం

తాజా సమాచారం ప్రకారం ఉజ్బెకిస్తాన్ పర్యాటక (Uzbekistan Tourism) రంగంలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భారతీయులను వీసా ఫ్రీ ట్రావెల్ జాబితాలో చేర్చనున్నట్టు తెలుస్తోంది. 2030 వరకు ఉజ్బెకిస్తాన్ వెళ్లే భారతీయుల సంఖ్యను మూడు రెట్లు పెంచే దిశలో ఈ చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుత వీసా పాలిసి | Uzbekistan Current Visa Policies 

Chimgan Mountain
ఉజ్బెకిస్తాన్‌లోని చింగాన్ పర్వత ప్రాంతం

ఉజ్బెకిస్తాన్ చరిత్ర (History), ఆచారాలు, కల్చర్ అనేవి అనేక అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకుంటున్న అంశాలు. అందుకే పలు దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో భారత్‌ను చేర్చడం వల్ల భారతీయ ప్రయాణికుల సంఖ్యను పెంచి, వారి ప్రయాణంలో ఉన్న ప్రాథమిక ఇబ్బందులను తొలగించాలని ప్రయత్నిస్తోంది ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం. అధిక సంఖ్యలో భారతీయులు తమ దేశాన్ని సందర్శించాలని కోరుకుంటోంది ఆ దేశం.

భారతీయు పర్యాటకులే లక్ష్యంగా | Benefits for Indian Tourists 

Uzbekistan Arts
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఉజ్బెకిస్తాన్ హస్తకళలు

ఉజ్బెకిస్తాన్ కొత్త వీసా (Uzbekistan Visa) విధానం వల్ల అధిక సంఖ్యలో భారతీయులు ఆ దేశాన్ని సందర్శించే అవకాశం కలుగుతుంది. ఈ దేశానికి అద్భుతమైన చరిత్ర ఉంది. అలాగే అక్కడి వారసత్వ సంపద, ఆకట్టుకునే పురాతన  కట్టడాలు, ప్రకృతి అందాలు, అచార సంప్రదాయలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 

Shah i Zinda in Samarkand
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కంద్‌లో ఉన్న ప్రముఖ షాహ్ ఈ జిందా కట్టడం (Shah-i-Zinda )

మీ ముఖ్యంగా సమర్‌కాండ్ (samarkand), బుఖారా (bukhara) వంటి ప్రాంతాల్లో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, ప్రదేశాలతో పాలు సిల్కు రోడ్ (Silk Road) చరిత్ర అక్కడ ప్రధాన ఆకర్షణలు అని చెప్పవచ్చు.

 భారత్‌ను వీసా ఫ్రీ (Visa-Free Travel List) జాబితాలో చేర్చడం ద్వారా అధిక సంఖ్యలో పర్యాటకులను ఈ ప్రాంతాల వైపు ఆకర్షించి ఆర్థికంగా లబ్ది పొందాలని తద్వారా అంతర్జాతీయ పర్యాటక రంగంలో దూసుకెళ్లాలని చూస్తోంది ఉజ్బెకిస్తాన్.

పర్యాటకమే కాదు | Uzbekistan Free Visa

Sha-i-Zinda in Samarkand
షాహ్ ఈ జిందా అంటే రాజు ఇంకా జీవించి ఉన్నాడు అని అర్థం వస్తుంది.

అయితే భారతీయులకు ఫ్రీ వీసా కల్పించడం వెనక ఉన్న ఉద్దశాలలో కేవలం పర్యాటకాన్ని ఊతం అందించడం మాత్రమే కాదు..ఇదరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య (Trade) బంధాల్ని పటిష్టంగా మార్చడం కూడా ఉన్నాయి అని అక్కడి అధికారులు అంటున్నారు.

భవిష్యత్తులో వాణిజ్యం, విద్యా, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పని చేయడానికి కూడా ఈ ఫ్రీ వీసా విధానం ఊతం అందించనుంది అని చెబుతున్నారు.

మొత్తానికి

భారత్ (India) లాంటి కిలక అంతర్జాతీయ టూరిజం ప్లేయర్లను ఆకట్టుకోవడానికి ఉజ్బెకిస్తాన్ పర్యాటక మౌలిక సదుపాయాలను వేగంగా డెవెలెప్ చేస్తోంది. వీసా ఫ్రీ వల్ల కేవలం టూరిజాన్ని మాత్రమే కాదు ఇరు దేశాలు లబ్ది పొందే అనేక అంశాలపై కూడా ఫోకస్ పెడుతోంది. 

Lake Shore in Moun, Uzbekistan
ఉజ్బెకిస్తాన్‌లోని ఒక అందమైన సరస్సు వద్ద నవ వధువు

మొత్తానికి పర్యాటక రంగంలో తన సత్తా చాటే దిశలో వేగంగా అడుగులు ముందుకేస్తోంది. అయితే ఈ ఫ్రీ వీసా (Visa) అనేది ఎప్పటి నుంచి అమలు అవుతోందో సమాచారం లేదు. సమాచారం వచ్చిన వెంటనే అప్డేడ్ చేస్తాం. అప్పటి వరకు ప్రయాణికుడు డాట్ కామ్‌లో (Prayanikudu.com) వచ్చే ఇతర స్టోరీస్‌ను కూడా చదవండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసలం సబ్‌స్క్రైబ్ బెల్‌పై క్లిక్ చేయండి. 

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!