Vizag : వైజాగ్ టూర్ ప్లాన్ లో మార్పు చేయండి.. ఈ నాచురల్ ఆర్చ్ చూడకుండా రావద్దు
Vizag : వేసవి అంటే విశాఖపట్నానికి వచ్చే పర్యాటకులకు ఆర్కే బీచ్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ తోట్లకొండ బీచ్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన బీచ్. అయితే, ఈ మధ్య ఈ ప్రాంతం చాలా ట్రెండీగా మారింది. దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే? అక్కడ ఉన్న సహజసిద్ధమైన ఆర్చ్.. ప్రకృతిచేతనే రూపుదిద్దుకున్న ఈ అద్భుతం.. అక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. విశాఖపట్నం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సహజసిద్ధమైన ఆర్చ్‌ను చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. విశాఖపట్నం నుండి భీమిలికి వెళ్ళే ప్రతి పర్యాటకుడు ఈ ఆర్చ్ వద్ద ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. ఏర్పడిన ఈ ఆర్చ్‌ను మొదటిసారి చూస్తున్నామని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యోదయం, సహజసిద్ధమైన ఆర్చ్
వైజాగ్‌లోని ఇతర బీచ్‌ల లాగానే, ఈ బీచ్ కూడా ఒక సూర్యోదయం బీచ్. సూర్యోదయం సమయంలో ఈ ఆర్చ్‌ను చూడటానికి రెండు కళ్ళు చాలవు. బీచ్‌లో సహజసిద్ధమైన ఆర్చ్ గుండా సూర్యోదయాన్ని చూడటం ఒక అద్భుతమైన దృశ్యం. వేల సంవత్సరాల క్రితం తీరం వెంబడి గాలి, ఇసుక చర్యల ఫలితంగా ఈ సహజసిద్ధమైన ఆర్చ్ ఏర్పడింది. అయితే వారాంతాల్లో ఈ బీచ్ రద్దీగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?

ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఒకప్పుడు ఏకాంతం, ఇప్పుడు సందడిగా
ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న ఈ బీచ్, వారాంతాల్లో సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రజలు సహజసిద్ధమైన వంపు వద్ద సెల్ఫీలు క్లిక్ చేసుకుంటున్నారు. కొందరు భౌగోళికంగా సున్నితమైన ఈ ప్రాంతంలో బైక్ స్టంట్లు కూడా చేస్తున్నారు. అయితే, అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇలాగే ఉందని.. కొద్దిగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.
ఎలా వెళ్ళాలి?
మీరు కూడా ఈ తోట్లకొండ బీచ్ లేదా మంగమరిపేట బీచ్‌కు వెళ్లాలనుకుంటున్నారా? బీచ్ రోడ్ మీదుగా భీమిలి వైపు వెళితే సరిపోతుంది. మీరు 900కె బస్సు తీసుకోవచ్చు. ఎంవిపి నుండి ఆటోలో కూడా వెళ్లవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
