World Snake Day : అన్ని పాములు విషపూరితం కావు… హైదరాబాద్ జూలో పాములపై అవగాహనా కార్యక్రమం
World Snake Day : ప్రపంచంలో ఉన్న జీవుల్లో మనం బాగా తప్పుగా అర్థం చేసుకునే ప్రాణుల్లో పాములు (Snakes) కూడా ఒకటి. ప్రతీ పాము విషపూరితం (Venomous) అని అనుకుంటారు చాలా మంది. అందుకే పాము కనిపించగానే విపరీతంగా భయపడిపోవడమో లేక దాడి చేయడానికి ప్రయత్నించడమో చేస్తుంటారు.
స్నేక్ డే (Snake Day) | World Snake Day
వరల్డ్ స్నేక్ డే (World Snake Day) సందర్భంగా పాములు గురించి ఉన్న అపోహలను తొలగించేందుకు హైదరాబాద్ జూపార్క్ (Nehru Zoological Park Hyderabad) లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 700 మంది స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
- వారికి పాముల్లో రకాలు (Types of Snakes), ఏవి విషపూరితం (Venomous Snakes), ఏవి కావు (Non-Venomous Snakes), వాటిని ఎలా గుర్తించాలో పిల్లలకు చక్కగా వివరించారు ఎడ్యుకేషన్ అధికారి ఎం. దీపక్ తరుణ్.
ఈ కార్యక్రమంలో పాములు ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తాయి (Habitat), విషపూరిత , విషం లేని పాములను ఎలా గుర్తించాలి, పాముల గురించి ఉన్న అపోహలు (Myths About Snakes), పాము ఎదురొస్తే ఏం చేయాలి (Precautions), పాము కాటేస్తే ఫస్ట్ ఎయిడ్ (Snakebite First Aid) ఏం చేయాలో తెలిపారు.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో మరో జూపార్కుకు అనుమతి…మరి నెహ్రూ జూపార్క్‌ను తరలిస్తారా ? | Hyderabad To Get Second Zoo
పాములు గురించి ఆసక్తికరమైన విషయాలు (Interesting Facts About Snakes)
ప్రస్తుతం హైదరాబాద్ జూలో సుమారు 20 రకాల పాములు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా (World wide) సుమారు 3,900 జాతుల పాములు (Species of Snakes) ఉన్నాయని గుర్తించారు.
- అందులో 300 రకాల పాములు (Species in India) భారతదేశంలో ఉన్నాయి.
- ఈ 3,900 రకాల పాముల్లో కేవలం సుమారు 600 పాములు అంటే సుమారు 15 శాతం మాత్రమే విషపూరితమైనవి (Venomous).
- స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే ఆ 600లో కేవలం 200 మాత్రమే మానవులకు ప్రాణాంతకంగా ఉండేవి (Medically Significant).
పాములు గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాటికి అసలు కనుపాపలే ఉండవు (No Eyelids). అవి కళ్లు తెరిచే నిద్రపోతాయి (Sleep with Eyes Open).
కింగ్ కోబ్రా (King Cobra) తన శరీరాన్ని మూడో వంతు (One Third) ఎత్తులో లేచి నిలబడుతుంది.
పైథాన్ (Python) పాములు విషపూరితం కావు (Non-Venomous). కానీ అవి తమ వేటను బాగా క్రష్ చేసి చంపుతాయి (Constriction).
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.