Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ పొంగల్‌లో పురుగు కలకలం.. రూ.25లక్షలు కొట్టేసే ప్లాన్
Rameshwaram Cafe : బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక షాకింగ్ ఘటన జరిగింది. ప్రముఖ రామేశ్వరం కేఫ్ ఔట్లెట్లో ఒక కస్టమర్ పొంగల్ ఆర్డర్ చేయగా, అందులో పురుగు కనిపించిందని ఆరోపించాడు. మొదట సిబ్బంది దీన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని, కానీ తర్వాత పూర్తి డబ్బు వాపసు ఇచ్చారని కస్టమర్ తెలిపాడు. ఈ ఘటనపై కేఫ్ యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రావు కూడా స్పందించారు.
గురువారం ఉదయం బెంగళూరు ఎయిర్‌పోర్టులోని రామేశ్వరం కేఫ్‌లో ఒక కస్టమర్ తన పొంగల్‌లో పురుగును కనుగొన్నాడు. అతను సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వారు మొదట అతని ఫిర్యాదును పట్టించుకోలేదు. దాంతో అతను ఆ ఘటనను రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. కస్టమర్ తన స్పూన్లోని పొంగల్‌లో ఉన్న పురుగును చూపించాడు. రెస్టారెంట్‌ను కూడా పాక్షికంగా చూపించాడు. కేఫ్ యజమానితో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫిర్యాదు చేయడం గురించి అతను మరొక కస్టమర్‌తో మాట్లాడుతున్నట్లు వినిపించింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులోని రామేశ్వరం కేఫ్ సిబ్బంది అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి, పొంగల్‌కు రూ.300 పూర్తి డబ్బు వాపసు ఇచ్చారు.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
రామేశ్వరం కేఫ్ సహ-యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రావులను బెంగళూరు ఎయిర్‌పోర్టు ఔట్లెట్లో జరిగిన ఘటన గురించి మీడియా సంప్రదించింది. రాఘవేంద్ర మీడియాకు మాట్లాడుతూ.. వారు కస్టమర్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే అతను ప్రస్తుతం ప్రయాణిస్తున్నందున స్పందించడం లేదని తెలిపారు. మరోవైపు, దివ్య ఈ ఆరోపణలను ఖండించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. కొంతమంది కస్టమర్లు కావాలనే ఆహారంలో పురుగులను కలిపి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.
ఓ గుంపు కస్టమర్లు ముందు గలాటా సృష్టించి, పొంగల్‌లో పురుగు ఉందని తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వారిలో కొంతమంది వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించారని, కొద్దిసేపటికే ఫోన్ చేసి ఆ వీడియో బయటకు రాకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై తమ వద్ద ఉన్న కాల్ రికార్డులు, మెసేజ్ స్క్రీన్షాట్లు పోలీసులకు ఇచ్చామంటూ కేఫ్ నిర్వాహకులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
గతంలో జరిగిన అలాంటి సంఘటనలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని, అయితే ఈసారి ఎయిర్పోర్ట్ ఔట్లెట్లో కెమెరాలు లేకపోవడంతో దీనిని గుర్తించడం కష్టమని వారు చెప్పారు. ఈ విషయంపై పరిశీలించి త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వారు తెలిపారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.