Flight Ticket Booking Hacks : విమాన టికెట్ బుక్ చేసే ముందు ఒకసారి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. వీటిలో కొన్నింటిని ట్రై చేసి చూడండి. డబ్బు ఎవరికి ఊరికే రావు. అందుకే అవకాశం ఉన్నప్పుడే ట్రై టు సేవు .
నాలుగు రాళ్లు వెనకేయాలి అంటే కష్టపడటంతో పాటు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం రావాలి. ఎందుకంటే జేబులో ఉంటే డబ్బు..గుండెల్లో ఉండదు గుబులు. ప్రయాణికుడిని కాబట్టి ఆర్థిక వేత్తలా మాట్లాడకుండా డైరక్టుగా విషయానికి వస్తాను.
విమాన టికెట్లు బుక్ చేసే ( Flight Ticket Booking ) సమయంలో మనం మన అవసరాన్ని, పరిస్థితిని బట్టి కనిపించిన ధరకు టికెట్లు కొనేస్తాం. అయితే అలాంటప్పడు కూడా కొంత డబ్బు మిగుల్చోవడానికి మీ కోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాను. వీటి వల్ల మీరు నాలుగు రాళ్లు వెనకేస్తారు ( నిజంగా రాళ్లు వెనకేయకండి. వెనక ఉన్నవారికి దెబ్బలు తగులుతాయి ).
ముఖ్యాంశాలు
డబ్బు ఎవరికీ ఊరికే రాదు | Flight Ticket Booking Hacks
విమాన టికెట్ బుక్ చేసే ముందు ఒకసారి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. వీటిలో కొన్నింటిని ట్రై చేసి చూడండి. డబ్బు ఎవరికి ఊరికే రావు. అందుకే అవకాశం ఉన్నప్పుడే ట్రై టు సేవు..
1.తేదీల విషయంలో రాజీ | Travel Date Flexibility
మీ ప్రయాణ తేదీలను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటే అలా చేసి చూడండి. ఎందుకంటే వీకెండ్స్, పండగలు, ప్రత్యేక రోజులు, సీజన్లో చాలా మంది బుకింగ్ కోసం ప్రయత్నిస్తారు. అందుకే మీరు వీక్ డేస్ అంటే మంగళవారం, బుధవారం, గురువారం రోజు ప్రయత్నించండి. ఈ రోజుల్లో పోటీ మిగితా రోజుల కన్నా తక్కువగా ఉంటుంది.
2. ఇంకాగ్నిటో మోడ్ | Incognito Mode For Flight Ticket Booking

ఇంకాగ్నిటో అనే ఆప్షన్ ప్రతీ బ్రౌజర్‌లో ఉంటుంది. దీనిని ప్రైవేట్ విండో అని కూడా పిలుస్తారు. మీరు ఇంకాగ్నిటో వాడి విమాన వివారాలు తెలుసుకుని బుక్ చేయడం వల్ల బ్రౌజర్, మీ సెర్చ్ హిస్టరినీ ట్రాక్ చేయలేదు. బ్రౌజర్ ముందరికాళ్లకు బంధం వేసి ఇలా బుక్ చేస్తే మీకు అందరిలాగే అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రైజులు లభించే అవకాశం ఉంది. లేదంటే మామూలు బ్రౌజర్ నుంచి బుక్ చేసేందుకు ట్రై చేస్తే సెర్చ్ హిస్టరీని బట్టి ఎక్కువ ధరలు చూపించే అవకాశం ఉంది.
3.అలెర్ట్ పెట్టుకోండి | Flight Ticket Price Alert
కొన్ని వెబ్‌సైట్స్ అండ్ యాప్స్‌లో మీకు విమాన ధరలపై అలెర్ట్ పంపించే ఆప్షన్ ఉంటుంది. మీరు వెళ్లాలి అనుకున్న డెస్టినేషన్‌కు అలెర్ట్ సెట్ చేస్తే ధరలు తగ్గినా, ఆఫర్లు ఉన్నా, పెరుగుతున్నా మీకు తెలిసిపోతుంది. ధర ఇట్ల తగ్గంగనే అట్ల బుక్ చేసుకోండి. దగ్గు వచ్చినా తుమ్ములు వచ్చినా ఆగకండి. జస్ట్ కిడ్డింగ్ ముందు దగ్గండి. ఎందుకంటే ఆరోగ్యం ఫస్ట్. తరువాత బుకింగ్ నెక్ట్స్.
- ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
4. ముందుగానే బుక్ చేసుకోండి | Flight Ticket Booking In Advance
వీలైతే మీ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకోండి. టికెట్లు ముందే బుక్ చేసుకోండి. కనీసం ఒక నెల నుంచి 3 నెలల వరకు ముందు బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీని వల్ల మీకు తక్కువ ధరకే టికెట్ దొరుకుతుంది. చివరి నిమిషంలో బుకింగ్ అనేది వీలైనంత వరకు ఎవాయిడ్ చేయండి. లేదంటే ఆకాశం నుంచి జారే చినుకు డైరక్టుగా మ్యాన్‌హోల్లో పడినట్టు మీరు సేవ్ చేసే డబ్బు వేస్ట్ అవుతుంది.
5. కంపేర్ చేసుకోండి | Air Fare Comparison

బంగారాన్ని మాత్రమే కాదు టికెట్ ధరలు కూడా కంపేర్ చేయండి. ఒక టికెట్ ధర ఎక్కడ ఎంత ఉందో మీరు ముందే చెక్ చేసుకుని తరువాత బుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దీని కోసం మీరు ఫ్లైట్ సెర్చ్ ఇంజిన్స్ ( Flight Search Engines ) వినియోగించండి .అందులో ప్రముఖమైనవి..
- స్కై స్కానర్ ( Skyscanner )
- కయాక్ ( Kayak)
- గూగుల్ ఫ్లైట్స్ ( Google Flights )
ఈ ఫ్లైట్ సెర్చ్ ఇంజిన్లో మీరు మీ ప్రయాణ వివరాలు అందిస్తే బెస్ట్, చీప్ అనే ఆప్షన్స్‌తో మీకు వివరాలు అందుతాయి. అందులో మీరు చవక ధరకు టికెట్ బుక్ చేయాలి అనుకుంటున్నారా, లేేక మంచి ప్రయాణ అనుభూతి కోరుకుంటూ బుక్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చిన ఆప్షన్ ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయవచ్చు.
6. కనెక్టింగ్ ఫ్లైట్స్ | Connecting Flights
మీకు టైమ్ ఉంటే ఇది మంచి ఛాయిస్ అవుతుంది. మీరు మీ ప్రయాణాన్ని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఒక పాయింట్ చేరుకుని, తరువాత అక్కడి నుంచి మీ డెస్టినేషన్‌కు చేరుకోవచ్చు. లేదంటే మీరు మల్టిపుల్ స్టాప్స్, లేయోవర్స్ ఉన్న ఫ్టైట్ ఎక్కితే టికెట్ ధర తగ్గుతుంది. అయితే ఇది మీ షెడ్యూల్‌కు సరిపోతేనే చేసుకోండి. బుకింగ్ చేసే ముందు లెక్కలు వేసుకుని చూడండి.
7. కుకీస్ క్లియర్ చేసుకోండి | Cookies and Flight Tickets

మీరు విమాన టికెట్ల గురించి సెర్చ్ చేసే సమయంలో మీ బ్రౌజర్లో ఆ సెర్చుకు సంబంధించిన కొన్ని కుకీస్ సేవ్ అవుతాయి. వాటిని మీరు బ్రౌజర్ నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంకాగ్నిటో వాడండి.
8. ఎర్రర్ ఫేర్ | Error Fare Flight Ticketing
ఇతరులు తప్పు చేస్తే వాటి నుంచి లాభాలు పొందడం మంచిది కాదు. కానీ ఫ్లైట్ బుకింగ్ విషయంలో ఇది ఒక టెక్నిక్‌గా మారింది. కొన్ని సార్లు విమాన సంస్థలు పొరపాటున టికెట్ ధరలను తగ్గిస్తాయి. అప్పుడు మీరు బుక్ చేసుకుంటే వాళ్లు డబ్బు వెనక్కి అడగరు. ఎందుకంటే అది వారి తప్పు. మరి ఈ పొరపాట్లు జరిగాయి అని తెలుసుకోవడం ఎలా అంటారా.. వీటిలో చెక్ చేయండి.
- సీక్రెట్ ఫ్లైయింగ్ ( Secret Flying )
- ఎయిర్‌ఫెయిర్ వాచ్ డాగ్ ( Airfarewatchdog )
PS: నేను చెెప్పానని చెప్పకండి.
9. లాయల్టీ ప్రోగ్రామ్ | Airline Loyalty Program
తరచుగా విమానయానం చేసేవారి కోసం ఎయిర్‌లైన్ సంస్థలు రివార్డులు ప్రకటిస్తాయి. దీని కోసం మీరు వారి లాయల్టీ ప్రోగ్రామ్‌లో చేరాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు విమాన టికెట్ ధరలు తక్కువ ధరకి లేదా కొన్ని సార్లు ఉచితంగా లభిస్తాయి.
10. తక్కువ లగేజ్ | Travel Light On Flight

బ్యాగు ఎంతపెద్దదైతే అంత సమాన్లు నింపుతాం మనం. ఎందుకంటే ఇది బేసిక్ హ్యూమన్ టెండెన్సి. అందుకే మీ ప్రయాణానికి చిన్న బ్యాగులు ఎంచుకోండి. 80 లీటర్ల బ్యాగ్ అవసరం అనిపిస్తే 65 లీటర్స్‌కి వెళ్లండి. వీలైతే ఇంకా తగ్గించండి. వీలైనంత లైట్‌గా ప్రయాణించండి. దీని వల్ల మీకు ఎక్‌స్ట్రా బ్యాగేజ్ ఫీజు తగ్గుతుంది. .
11. ఆఫర్ సమయంలో బుక్ చేయండి | Offers On Flight Tickets
ఎలాగైతే మనం కిరాణ సామాన్లు కొనేందుకు, గ్యాడ్జెట్స్ కొనేందుకు మంచి ఆఫర్లు, డీల్స్ కోసం ఎదురు చూస్తుంటామో అలాగే ఎయిర్‌లైన్స్ వారు ఇచ్చే డీల్స్ కోసం వేచి చూడండి. మరీ ముఖ్యంగా పండగ సమయంలో, బ్లాక్ ఫ్రైడే లాంటి స్పెషల్ ప్రమోషన్స్ డే సమయంలో ప్రయాణాలు పెట్టుకోవచ్చు. ఈ సమయంలో చంద్రముఖిగా మారిన గంగను చూడవచ్చు. సారి టికెట్ ధరల్లో తగ్గుదలను చూడవచ్చు.
12. దగ్గర్లోని ఎయిర్‌పోర్టులు | Flight Ticket Booking Secrets

ఇది చాలా మందికి తెలియని టెక్నిక్. మీరు ఒక ప్రాంతానికి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో లేదా అక్కడికి దగ్గర్లో ఉన్న విమానాశ్రయాలను ( Air Ports ) వెతకండి. టికెట్ ధరలు పోల్చి చూడండి. అన్ని లెక్కలు వేసి మీకు డబ్బు సేవ్ అవుతుంది అనిపిస్తే బుక్ చేసుకోండి. ఇందులో మీరు ఎయిర్ పోర్టు నుంచి మీ గమ్యస్థానానికి వెళ్లేందుకు క్యాబ్ లేదా ఆటో, బస్ చార్జీలను కూడా పోల్చి చూడండి. విమానం టికెట్‌లో రూ.10 సేవ్ చేసి బయట క్యాబుకు వంద చెల్లించాల్సి ఉంటే అది అంత మంచి డీల్ కాదు. ఏమంటారు ?
13. నాన్ రిఫండబుల్ టికెట్లు | Non-refundable Tickets
మనం గన్‌షాట్‌గా ఒక ప్రదేశానికి వెళ్తాం, కేన్సిల్ చేసే ప్రసక్తే లేదు అని ష్యూర్‌గా అనిపిస్తే నాన్ రిఫండబుల్ టికెట్లు బుక్ చేసుకోండి. ఇవి మీకు తక్కువ ధరకు లభిస్తాయి. అయితే ఏమో తెలియదు, నాకేం అర్థం కావట్లేదు అనిపిస్తే మాత్రం రిఫండబుల్ వైపు వెళ్లండి.
14. క్రెడిట్ కార్డు రివార్డు | Flight Tickets With Credit Card Rewards
క్రెడిట్ కార్డు అనేది ఉంటే మంచిది. లేకుంటే ఇంకా మంచిది. అయితే తెలివైన వ్యక్తికి క్రెడిట్ కార్డు అనేది అల్లావుద్దీన్ చేతిలో అద్భుత దీపం లాంటిది. తెలివిగా వాడుకుని క్రెడికార్డులో అందుబాటులో ఉండే రివార్డులను ఉపయోగించి విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీకు క్యాష్ బ్యాక్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ఇలాటి రివార్డులు ( Travel Rewards Credit Cards ) ఇచ్చే కార్డు గురించి కూడా కనుక్కోండి.

ఈ 14 టెక్నిక్స్ ( Flight Ticket Booking Hacks ) తెలిస్తే ఇక రెచ్చిపోవచ్చు అనుకునే వారికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. రెచ్చిపోండి. తెలివిగా డబ్బు సేవ్ చేసుకోండి. నాలుగు రాళ్లు వెనకేసుకోండి. విమానయానం అనేది చాలా కాస్ట్‌లీ అనుకునేవారికి ఇటు చూడు అని మీరు తక్కువ ధరకు బుక్ చేసుకున్న టికెట్ చూపించండి. బడ్జెట్ పద్మనాభం కాదు నేను…అయితే అందివచ్చే లాభం వదులుకోను అని చెప్పండి.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.