Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు 

షేర్ చేయండి

హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi)  భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి. 

ఒక వేళ మీరు మహాశివరాత్రి (Maha Shivaratri 2025 ) సందర్భంగా వారణాసికి వెళ్తే  అక్కడ సందర్శించానల్సిన 7 ప్రధాన ఘాట్లు ఇవే. అసలైన శివరాత్రి వేడుకను వీకించే అవకాశం లభిస్తుంది.


ఆ ఘాట్లు ఇవే: Spiritual Ghats In Varanasi

1. మణికర్ణిక ఘాట్ | Manikarnika Ghat

MANIKARNIKA GHAT
| మణికర్ణిక ఘాట్

మోక్షానికి దారి : చావు పుట్టుకల జీవన చక్రాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది కాశీలోని (Kashi) అంతిమ సంస్కారాలు నిర్వహించే ప్రధాన ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ అంతిమ సంస్కారం జరిగితే మోక్షం (Moksha) లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. జీవితం క్షణికం. కాదేది శాశ్వతం అని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.

2. దషశ్వమేధ ఘాట్ | Dashashwamedh Ghat

DASHASHWAMDH GHAT
| దషశ్వమేథ ఘాట్

అద్బుతమైన హారతికి వేదిక : ప్రపంచంలో నదీని పూజించే సంప్రదాయం మన దేశంలోనే ఉంది. మరీ ముఖ్యంగా గంగా నదీ ప్రవాహించే దారిలో అనేక చోట్ల గంగా నదికి హరతిని (Ganga Aarti) ఇస్తుంటారు. ఈ ఘాట్‌ను బ్రహ్మదేవుడే (Lord Brahma) క్రియేట్ చేశారంటారు. 

పవిత్రమైన అగ్నికి వాయువుగా నిలిచే పవిత్ర మంత్రాలు, భక్తుల ఆధ్యాత్మిక భావాలు కలిసి ఒక అద్భుతమైన దృశ్యం ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. సరైన వ్యూ కావాలంటే మీరు త్వరగా వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.

3. పంచగంగా ఘాట్ | Panchganga Ghat

PANCHAGANGA GHAT
| పంచగంగా ఘాట్

పవిత్రతకు మారు పేరు:  ఐదు నదులు కలిసే పవిత్ర స్థలంగా దీనిని భావిస్తారు. ఈ ఐదు నదులు వచ్చేసి:

  • గంగా
  • యమునా
  • సరసర్వతి
  • కిరణ
  • ధూతప్ప

ఈ ఐదు నదుల కలయిక వల్ల ఈ ఘాట్‌కు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక తేజస్సు వస్తుంది. స్థానికంగా ఉండే శ్రీ మహా విష్ణువు (Lord Vishnu) ఆలయాన్ని సందర్శంచడం మర్చిపోకండి.

4. హరిశ్చంద్ర ఘాట్ | Harishchandra Ghat

HARISHACHANDRA GHAT
| హరిశ్చంద్ర ఘాట్

సత్యవాది శ్రీ హరిశ్చంద్రుడి పేరుపై ఈ ఘాట్‌కు ఆ పేరు వచ్చింది. ఇది ఒక క్రిమేషన్ ఘాట్ (Cremation Ghat). అంటే ఇక్కడ పార్థీవ దేహాలను ఆగ్నికి సమర్పిస్తారు. ఇక్కడికి వచ్చాక చాలా మంది జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, మరణం ఒక్కటే సత్యం అని దాని నుంచీ ఎవరూ తప్పించుకోలేరు అని తెలుసుకుంటారు. అలాగే ధర్మానికి కట్టుబడి ఉన్న హరిశ్చంద్రుడి జీవితాన్ని తలచుకుని స్ఫూర్తి పొందుతారు.

5. కేదార్ ఘాట్ | Kedar Ghat

KEDAR GHAT
| కేదార్ ఘాట్

దీనిని మహా శివుడి (Lord Shiva) హిమాలయన్ ఘాట్ అని కూడా పిలుస్తారు. పరమశివుడి కేదార్‌నాథ్ అవతారానికి ప్రతీకగా భావిస్తారు. కేదారేశ్వర్ ఆలయానికి వెళ్తే రంగు రంగుల మెట్లను ఇక్కడ చూడవచ్చు. దక్షిణ భారత దేశం (South Indian Devotees In Kashi) నుంచి చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు.

6. అస్సి ఘాట్ | Assi Ghat

ASSI GHAT
ప్రతీకాత్మక చిత్రం

శివుడి శక్తి నేలను తాకిన చోటు : ఈ ఘాట్‌ను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడే గంగానదితో అస్సి నదీ (Assi River)  కలుస్తుంది. ఇక్కడే శివుడి కత్తి ( అసి) పడింది అంటారు. ఇక్కడ మీరు ఉదయం సమయంలో హరతికి వెళ్లవచ్చు, యోగా సాధన చేయవచ్చు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

7. సిందియా ఘాట్ | Scindia Ghat

Scindia Ghat
సిందియా ఘాట్

అద్భుతమైన శిల్పకళా రహస్యం:  ఈ ఘాట్‌లో ఉన్న మహాశివుడి ఆలయం అద్భుతం అని చెప్పవచ్చు. ఇది ఒకవైపు నదీలోకి (Ganga River) ఒదిగి ఉంటుంది. గతంలో నిర్మాణంలో జరిగిన పొరపాటు వల్ల ఇలా జరిగింది. ఇక్కడే అగ్నిదేవుడు జన్మించారని భావిస్తారు.

ఈ శివరాత్రి చాలా ప్రత్యేకం

Spiritual Ghats In Varanasi : ఈసారి కాశీలో మహా శివరాత్రి అనేది అత్యంత ప్రత్యేకం. ఎందుకంటే ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా (Maha Kumbh Mela 2025) జరుగుతోంది. ఇది మహా శివరాత్రి రోజున ముగుస్తుంది. దీంతో కాశీ, అయోధ్యా, ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు అధిక సంఖ్యలో పవిత్ర స్నాలు ఆచరించడానికి వస్తుంటారు. అందుకే మీరు ముందే సరిగ్గా ప్లాన్ చేసుకుని వెళ్లండి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!