రైల్వే క్యూ ఆర్ కోడ్ ద్వారా రైల్వే టికెట్లు ఎలా కొనాలి ? | QR Code Payment At SCR Counters

షేర్ చేయండి

క్యూార్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసి ( QR Code Payment At SCR Counters ) టికెట్లు కొనే వెసులుబాటు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ టికెట్లు ఎక్కడ కొనాలి ? ఎలా కొనాలో తెలుసుకుందాం…

డిజిటల్ పేమెంట్స్ కోసం | QR Code Payment At SCR Counters

డిజిటల్ పేమెంట్‌కు అలవాటు పడిన నేటి తరం కోసం రైల్వే శాఖ కూడా అప్టేడ్ అవుతోంది. నిత్యం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే శాఖ. అందులో భాగంగా లేటెస్టుగా పేమెంట్ విధానాన్ని అప్టేడ్ చేసింది దక్షిణ మధ్య రైల్వే ( South Central Railways ).

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులు ఇకపై క్యాష్‌లెస్ విధానంలో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. దీని కోసం దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కౌంటర్లలో 879 పరికరాలు ఏర్పాటు చేసింది.
ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ విధానం వల్ల ప్రయాణికులు ఇకపై క్యాష్ లేకుండా సులభంగా టికెట్లు కొనుగోలు చేసే వెసులు బాటు ఉంటుంది.
వీటిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఈ విధానం వల్ల క్యూ లైన్లో ఉండే ప్రయాణికులు సమయం ఆదా అవుతుంది.
గతంలో క్యాష్ ఇచ్చి టికెట్ కోనే సమయంలో చిల్లర నాణేలు, నోట్ల సమస్య ఉండేది.ఈ క్యూఆర్ కోడ్ విధానం వల్ల ఆ సమస్య ఉండదు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అన్ని రైల్వే స్టేషన్లలో బుకింగ్ కౌంటర్ వద్ద ఒక స్క్రీన్‌లో ఈ క్యూర్ కోడ్ ఉంటుంది.
రైల్వే సిబ్బందికి మీ వివరాలు , కావాల్సిన టికెట్ల సంఖ్య చెబితే వాటిని ఎంటర్ చేసిన తరువాత మీ ముందు ఉన్న తెరపై ఆ డీటెయిల్స్ చెక్ చేయచ్చు.
వివరాలన్నీ కరెక్టుగా ఉన్నాయి అనిపిస్తే వెంటనే మీరు తెరపై కనిపిస్తున్న కోడ్‌పై మీ యూపీఐ పేమెంట్ యాప్‌తో స్కాన్ చేసి చెల్లింపు పూర్తి చేయవచ్చు.
పేమెంట్ విజయవయ్యాకే అయ్యాకే మీ టికెట్ మీ చేతికి వస్తుంది.


ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!