తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అని అనుకునే తెలుగు ఎన్నారైలకు (NRI Telugu) శుభవార్త. విదేశాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు (APNRTS) ప్రస్తుతం అందిస్తున్న డైలీ టికెట్లను భారీగా పెంచింది తితిదే.
ఏపీఎన్నార్‌టీఎస్ (APNRTS) సభ్యుల కోసం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని బట్టి వీఐపీ బ్రేక్ దర్శన (VIP Break Darshan) కోటాను రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. కొంత కాలం క్రితం ఏపీ ప్రభుత్వ జీఏడి చేసి విఙ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ముఖ్యాంశాలు
కోటా డబుల్ | NRI Telugu
తితిదే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీఐపీ బ్రేక్ దర్శన కోటా సంఖ్య 50 నుంచి 100 కు పెరగనుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam ). తితిదే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇకపై శ్రీవారిని దర్శించకునే తెలుగు ఎన్నారైల సంఖ్య పెరగనుంది. ఇందులో కుటుంబాల్లో ఉండే పెద్దవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
చాలా కాలం నుంచి ఎన్నారై భక్తుల నుంచి వస్తున్న డిమాండ్‌ను గమనించి టిటిడి ( TTD ) తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రవాస భారతీయులు మరింత ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవచ్చు.
తిరుపతి వాసులకు దర్శనం | Tirupati Locals Darshan Tokens
ప్రతీ నెల తొలి మంగళవారం రోజు తిరుపతి నగర ప్రజలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో దర్శనం కల్పించాల్సి ఉండగా రథ సప్తమి ( Ratha Saptami ) కారణంగా అది సాధ్యం కాలేదు. దీంతో రెండవ మంగళవారం రోజు స్థానిక భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.దీని కోసం 2025 ఫిబ్రవరి 9వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టికెట్లు అందించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 12న తిరుమలలో తీర్థ ముక్కోటి | Teertha Mukkoti
తిరుమలలో (Tirumala) 2025 ఫిబ్రవరి 12వ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఇటీవలే అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం తదితర సేవల గురించి అధికారులు సమీక్షించారు..
- పాపవినాశనం దగ్గర అన్న ప్రసాద ( Tirumala Annaprasadam ) పంపిణి జరుగుతుంది. దీని కోసం సేవకులను నియమించన్నారు.
- ఆస్తమా, గుండె జబ్బులు, ఉభకాయం, దీర్ఘకాలికి వ్యాధులు ఉన్నవారికి అనుమతి ఉండదు.
- గోగర్భం డ్యామ్ పాయింట్ నుంచి పాపవినాశనం వరకు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ (APSRTC) బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
- భక్తులను ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12వ వరకు మాత్రమే అనుమతించనున్నారు.
- 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్క ఉన్నాయి ? అమ్మవారి శరీరంలో ఏ భాగం ఎక్కడ పడింది?
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.