సమ్మర్‌లో ఎక్కువ మంది విజిట్ చేసే హిల్ స్టేషన్లో ఊటి కూడా ఒకటి. ఎండాకాలం చాలా మంది పర్యాటకులు ఊటికి (Ooty’s E Pass) వెళ్తుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఊటి వెళ్లడానికి భయపడుతున్నారు. వెళ్లినా వెనక్కి వెచ్చేస్తున్నారు. ఎందుకంటే…
ముఖ్యాంశాలు
క్వీన్ ఆఫ్ నీల్‌గిరిస్‌గా (Queen of the Nilgiris) పిలుచుకునే ఊటి అనేది ఎండాకాలంలో చాలా మందికి స్వర్గంలా కనిపిస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ఈ హిల్ స్టేషన్‌కు (Hill Stations) వెళ్తుంటారు. అలా వెళ్తున్న పర్యాటకులను అక్కడి ఈ పాస్ సిస్టమ్ తలనొప్పిగా మారింది.
దీని వల్ల గంటల కొద్ది క్యూలో ఉండాల్సి వస్తోంది. దీంతో పర్యాటకులకు చిరాకు పెరిగి ఊటిలోకి ఎంటర్ అవ్వకుండానే వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా పర్యాటకుల (Tourists) సంఖ్య తగ్గడంతో స్థానిక వ్యాపారులు ఈ -పాస్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజంగా ఊటి పర్యావరణాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుందా ? లేదా పర్యాటకాన్ని దెబ్బతీస్తోందా ?
ఎంట్రీ పాయింట్ నుంచే ఎగ్జిట్ | Ooty’s E Pass
ఈ పాస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి పట్టావయాల్ నంబియాకున్ను, తాలూరు, చెలోడి, నడుకని చూరం వంటి ప్రాంతాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ పాస్ గురించి తెలియకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులు భారీ క్యూలైన్‌తో విసిగిపోతున్నారు.
అధికారులు ఈపాస్‌లను చెక్ చేసేందుకు తీసుకుంటున్న సమయం పర్యాటకులలో ఉన్న ఉత్సాహాన్ని తగ్గిస్తోంది అంటున్నారు. కొంత మంది కోపంతో వెనక్కి వెళ్లిపోతున్నారు.

స్థానిక వ్యాపారుల్లో ఆగ్రహం
ఈ పాస్ సిస్టమ్ వల్ల ఊటికి పర్యటకుల తాకిడి తగ్గి, స్థానిక వ్యాపారాన్ని దెబ్బతీస్తోంది. దీనికి నిరసనగా కొన్ని రోజుల ముందు ఈ వ్యాపారులు 24 గంటల పాటు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ పాస్ వల్ల వారి ఆదాయం తగ్గింది అని దీనిని వెనక్కి తీసుకోవాలని కోరారు.
అదే సమయంలో ఈ పాస్ సిస్టమ్ విధానాన్ని పున: పరిశీలించాల్సిందిగా మద్రాస్ హైకోర్టును కోరింది తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వం. ఇది టూరిజంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా ఇబ్బంది పెడుతోంది అని తెలిపింది ప్రభుత్వం.
ఈ పాస్ లేకుండా వెళ్లడం ఎలా ? | Tamil Nadu Hill Stations
ఊటి (Ooty) వెళ్లాలని భావించే పర్యాటకులు ఈ పాస్ అనేది తప్పనిసరి అని తెలుసుకోవాలి. దీని కోసం మీరు ఈ కింది వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ఈ పాస్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది
- ఈ పాస్ బుక్ చేయడానికి క్లిక్ చేయండి
వెబ్‌సైట్‌ను విజిట్ చేసిన తరువాత మీ వ్యక్తిగత సమాచారం, వాహన వివరాలు, ఎన్నిరోజులు ఉంటారు అనే వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ పాస్ అవసరం లేకుండా వెళ్లాలి అనుకుంటే ఈ ఆ కింది ఆప్షన్స్ ప్రయత్నించవచ్చు.
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ : తమిళనాడు ఆర్టీసి బస్సులో (Tamil Nadu RTC) ప్రయాణించవచ్చు.
- ట్రైన్‌లో : నీల్‌గిరి ట్రైన్‌లో కూడా మీరు ప్రయాణించవచ్చు.
- షటిల్ సర్వీస్ : రెస్ట్రిక్టెడ్ జోన్‌కు ముందు బండి ఎక్కడైనా పార్క్ చేసి షటిల్ సర్వీసులో ప్రయాణించడం.
- నడవడం : ఇవన్నీ కాదు అనుకుంటే నడుచుకుంటూనే వెళ్లి బోటానికల్ గార్డెన్, ఊటి లేక్ (Ooty Lake) ను కవర్ చేయవచ్చు
ఈ పాస్ (Ooty’s E Pass) వ్యవస్థ అనేది అటు ప్రయాణికులకు, ఇటు వ్యాపారులకు ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తూ, పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఈ సిస్టమ్‌లో మార్పులు వస్తే ఊటికి వెళ్లావారి సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.