Hyderabad Day Trips : అబ్బబ్బా… జూన్ నెల వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ దాదాపు అయిపోయింది. మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, రోజువారీ రొటీన్ మొదలైంది. ఈ హడావుడిలోకి పూర్తిగా దూకకముందే ఇంకొక్క చిన్నపాటి ట్రిప్ వేసేస్తే ఎంత బాగుంటుంది కదా? దీనికి పెద్దగా లగేజ్ అవసరం లేదు, లాంగ్ వీకెండ్ కూడా అక్కర్లేదు. ఒక్క రైలు టిక్కెట్, కిటికీ పక్కన సీటు, ఒక్క ఖాళీ రోజు ఉంటే చాలు. హైదరాబాద్ నుండి కొన్ని గంటల దూరంలోనే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో చరిత్ర దాగి ఉంది. అందమైన జలపాతాలున్నాయి. ఆహ్లాదకరమైన సరస్సులున్నాయి. మీ సెలవులు పూర్తిగా అయిపోకముందే ఓ చివరి మజిలీగా వెళ్ళి రావడానికి బెస్ట్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. సింపుల్‌గా రైల్లో వెళ్లొచ్చే ఐదు వన్‌డే ట్రిప్‌ల లిస్ట్ ఇవే.
వరంగల్
పొద్దున్నే రైలెక్కి వరంగల్‌కి వెళ్ళిపోండి. అక్కడ వరంగల్ ఫోర్ట్, వెయ్యి స్తంభాల గుడి, ఇంకా కాకతీయ మ్యూజికల్ గార్డెన్ చూసి రావచ్చు. ప్రకృతిని ఇష్టపడేవాళ్ళకి పాకాల లేక్, భద్రకాళి లేక్, ఏకశిల లేక్, లక్నవరం చెరువు చాలా బాగుంటాయి. చరిత్రను ఇష్టపడేవాళ్ళకి, ఫ్యామిలీతో సరదాగా గడపాలి అనుకునేవాళ్ళకి, తెలంగాణ వారసత్వాన్ని చూడాలనుకునేవాళ్ళకి వరంగల్ పర్ఫెక్ట్ ప్లేస్.
హైదరాబాద్ నుంచి దూరం: 147 కి.మీ.
రైలు ప్రయాణ సమయం: 2.5 నుండి 3 గంటలు.
బీదర్
కర్ణాటకలో ఉన్నా, చరిత్ర పరంగా దక్కన్‌తో దీనికి బలమైన సంబంధం ఉంది. బీదర్ అంటే దాని అద్భుతమైన కోట, బహమనీ రాజుల సమాధులు, ఇంకా ప్రత్యేకమైన బీద్రీ హస్తకళలకి చాలా ఫేమస్. ఇక్కడకు వెళ్తే తఖత్ మహల్, రంగీన్ మహల్, సోలార్ మసీద్‌లను అస్సలు మిస్ అవ్వద్దు. ప్రశాంతంగా, చాలా అందంగా ఉండే ఈ ప్రదేశం కల్చరల్‌గా చాలా గొప్ప వన్‌డే ట్రిప్‌కి పనికొస్తుంది.
హైదరాబాద్ నుండి దూరం: 141 కి.మీ.
రైలు ప్రయాణ సమయం: 3 నుండి 3.5 గంటలు.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
నల్గొండ
కొంచెం తక్కువ రద్దీ, కానీ మనసుకు హాయినిచ్చే ట్రిప్ కావాలంటే నల్గొండ బెస్ట్. ఇక్కడకు వెళ్ళినప్పుడు నాగార్జున సాగర్ కెనాల్, కోలన్‌పాకలో ఉన్న పురాతన జైన దేవాలయాలను చూడడం మర్చిపోవద్దు. లేదంటే, ఊరిలో దొరికే లోకల్ స్నాక్స్ తింటూ హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది చాలా రిలాక్స్‌డ్ ట్రిప్ అవుతుంది.
హైదరాబాద్ నుండి దూరం: సుమారు 110 కి.మీ.
రైలు ప్రయాణ సమయం: 1 నుండి 1.5 గంటలు.
మెదక్
ఆసియాలోకెల్లా అతి పెద్ద కేథడ్రాల్స్‌లో ఒకటైన మెదక్ కేథడ్రాల్‌కి మెదక్ చాలా ఫేమస్. ఫోటోలు తీసుకోవడానికి, ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి ఇది సరైన ప్లేస్. దీనికి మెదక్ ఫోర్ట్, పోచారం డ్యామ్, ఇంకా ఏథిపోతాల జలపాతాలను కూడా కలిపి చూస్తే చరిత్ర, ప్రకృతి ఒకేసారి చూసిన అనుభూతి కలుగుతుంది.
హైదరాబాద్ నుండి దూరం: 95 కి.మీ.
రైలు ప్రయాణ సమయం: 3 గంటలు.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
హన్మకొండ/కాజీపేట
వరంగల్‌కు దగ్గరగా ఉన్న ఈ అండర్‌రేటెడ్ సిటీలో డబుల్ ఫన్ ఉంటుంది. పొద్దున్నే కాజీపేటకు రైలెక్కి, హన్మకొండలోని పద్మాక్షి దేవాలయాన్ని, లోకల్ మార్కెట్లను సందర్శించండి. ఇంటికి తిరిగి వెళ్ళేముందు కొన్ని స్పైసీ తెలంగాణ వంటకాల రుచి చూసి రండి. ఇది పర్ఫెక్ట్ చివరి సమ్మర్ ట్రిప్ అవుతుంది.
హైదరాబాద్ నుండి దూరం: 150 కి.మీ.
రైలు ప్రయాణ సమయం: 2.5 గంటలు.
మరి ఇంకెందుకు ఆలస్యం? మీ సెలవులు పూర్తిగా అయిపోకముందే, ఈ ఐదింటిలో ఏదో ఒక ప్లేస్‌కి రైల్లో వెళ్లి వచ్చేయండి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.