Golconda Mahankali Temple : గోల్కొండలో బోనాలు ఎప్పుడు మొదయ్యాయి ? అమ్మవారి విగ్రహాన్ని ఎవరు కనుగొన్నారు ?

షేర్ చేయండి

Golconda Mahankali Temple : హైదరాబాద్ నగరంలో ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఈ బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసం తొలి వారం నుంచే ప్రారంభమవుతాయి. గోల్కొండ కోటలో ఒక రాతి గుహలో కొలువై ఉన్న శ్రీ మహంకాళి దేవి ఆలయం

నుంచి బోనాలు మొదలవుతాయి. జూలై 6, 2025న (శనివారం) గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

కోరిన కోర్కెలు నెరవేర్చే శక్తి స్వరూపిణిగా కొలిచే ఈ మహంకాళి అమ్మవారికి బోనం పెడితే ఏడాదంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాతే, భాగ్యనగరంలోని మిగతా ఆలయాల్లో బోనాల పండుగ మొదలవుతుంది.

గోల్కొండ బోనాల ఉత్సవాలు గత 1000 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ అమ్మవారికి బోనం సమర్పించడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ స్థాపన, నిర్మాణం గురించి ప్రజలు పలు రకాలుగా చెప్పుకుంటారు.

Prayanikudu
అమ్మవారికి బోనం సమర్పించేందుకు దూరదూరం నుంచి భక్తులు విచ్చేస్తారు

గోల్కొండ బోనాల చరిత్ర | Golconda Bonalu History

పురాణాల ప్రకారం… : హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రామ్ దేవ్ రావు అనే వ్యక్తి పశువులను కాస్తుండగా, ఒకరోజు తేజస్సుతో వెలిగిపోతున్న అమ్మవారి విగ్రహం దొరికిందట. ఈ విషయం అప్పటి కాకతీయ రాజులకు (Kakatiya Kings) తెలియడంతో వారు ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని కట్టించి, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారట. అంతేకాదు, ఆ ప్రాంతానికి గొల్లకొండ అని పేరు పెట్టారని, అది కాలక్రమేణా గోల్కొండగా మారిందని చెబుతారు.

కాకతీయ రాజుల, నిజాంల ప్రత్యేక పూజలు | Golconda Mahankali Temple

కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు (Pratapa Rudra) మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబులు (Hyderabad Nizam) కూడా ఈ ఆలయాన్ని అలాగే కొనసాగించారని స్థానికులు చెప్తుంటారు. హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల వేడుకలకు నిజాంలు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేవారట.

  • ప్లేగు వ్యాధి కథ: గోల్కొండ బోనాల (Golconda Temple Story) వెనుక ప్రచారంలో ఉన్న మరొక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న సమయంలో ఒకానొకప్పుడు ప్లేగు వ్యాధి సోకి వేలాది మంది ప్రజలు చనిపోయారట. ఆ సమయంలో స్థానికంగా ఉండే ఒక వ్యక్తి కలలోకి మహంకాళి అమ్మవారు వచ్చి, తనకు బోనాలు సమర్పిస్తే ప్లేగు వ్యాధి తగ్గిపోతుందని చెప్పిందట.

ఆ వ్యక్తి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో, వారంతా కలిసి గోల్కొండ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారట. ఆశ్చర్యకరంగా, కొద్ది రోజుల్లోనే ప్లేగు వ్యాధి పూర్తిగా తగ్గిపోవడంతో అప్పటి నుంచి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు పెట్టే సంప్రదాయం కొనసాగుతోందని చెబుతారు.

బోనాల పద్ధతి | Method Of Presenting Bonalu

బోనాల పండుగ అనేది శక్తి స్వరూపిణీలకు సమర్పించే ఒక కృతజ్ఞతా వేడుక. భక్తులు తమ కోరికలు తీరినందుకు లేదా అవి నెరవేరాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. భక్తులు బియ్యం, పాలు, బెల్లం కలిపి వండిన నైవేద్యాన్ని మట్టి కుండల్లో పెట్టుకుని, నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వస్తారు.

డప్పు చప్పుళ్లు, పోతురాజుల (Pothuraju) విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో భక్తులు ఉత్సాహంగా ఆలయానికి చేరుకుంటారు. భక్తి పారవశ్యంతో అమ్మవారిని కీర్తిస్తూ నినాదాలు చేస్తారు. ఆలయానికి చేరుకున్న తర్వాత, అమ్మవారికి బోనాన్ని సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులంతా అమ్మవారి ఆశీస్సులు పొంది, ఏడాదంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు.

ముఖ్యమైన తేదీలు | Important Days In Golconda 2025 Bonalu

గోల్కొండ మహంకాళి ఆలయంలో బోనాల పండుగకు కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని మిగతా ఆలయాలకు, గోల్కొండ మహంకాళి ఆలయానికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. సాధారణంగా ఇతర ఆలయాల్లో ఆషాఢ మాసంలో వచ్చే నాలుగు లేదంటే ఐదో ఆదివారంలోనే ఆయా దేవతలకు బోనాలు సమర్పిస్తారు.

కానీ, గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసంలోని ప్రతి గురువారం, ఆదివారం కూడా భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయంలో బోనాలు సమర్పించడం ద్వారా ఏడాదంతా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉంటారని భక్తులు బలంగా విశ్వసిస్తారు.

గోల్కొండ కోట బోనాల ప్రారంభ దినం (జూలై 6) నాడు ఒక ప్రత్యేకమైన ఊరేగింపు జరుగుతుంది. ఇది సాధారణంగా ఆలయం వెలుపల నుంచి ప్రారంభమై, కోట లోపల ఉన్న అమ్మవారి సన్నిధికి చేరుకుంటుంది. ఈ ఊరేగింపులో పోతురాజులు, శివసత్తులు, సాంప్రదాయ కళాకారులు పాల్గొని ఉత్సవానికి శోభను చేకూరుస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ప్రారంభ వేడుకను తిలకిస్తారు.

2025 సంవత్సరం బోనాల ప్రత్యేకత ఏంటో తెలుసా ?

ఈ సంవత్సరం జూలై 6, 2025 గోల్కొండ బోనాలు మొదలు కానున్నాయి. ఈ సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలు సమర్పించడానికి తరలివస్తారని అంచనా. ఆలయ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు

గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్లాలి?
గోల్కొండ మహంకాళి దేవి ఆలయం (Golconda Mahankali Temple) గోల్కొండ కోట లోపల ఉంది. కాబట్టి కోట సందర్శనకు వచ్చే వారికి కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది.

  • స్థలం: శ్రీ మహంకాళి దేవి ఆలయం, గోల్కొండ కోట, హైదరాబాద్, తెలంగాణ.

ఎలా వెళ్లాలి? | How To Reach Golconda ?

  • బస్సు: హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కోట ప్రధాన ద్వారం దగ్గర దిగి, లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి.
  • మెట్రో: సమీప మెట్రో స్టేషన్ పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ లేదా రాయదుర్గం మెట్రో స్టేషన్. అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా గోల్కొండ కోటకు చేరుకోవచ్చు.
  • క్యాబ్/ఆటో: ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు, లేదా స్థానిక ఆటోలు హైదరాబాద్ నలుమూలల నుంచి గోల్కొండ కోటకు అందుబాటులో ఉంటాయి.
  • పార్కింగ్: గోల్కొండ కోట ప్రధాన ద్వారం వద్ద వాహన పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. అయితే బోనాల సమయంలో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి, ప్రభుత్వ రవాణాను ఉపయోగించడం మంచిది.

హోటల్స్: గోల్కొండ కోటకు సమీపంలో బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు అనేక హోటల్స్, లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. గోల్కొండ ఫోర్ట్ రోడ్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో బస చేయవచ్చు.

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!