Haiking: 50 ఏళ్లకు పైగా హైదరాబాదీలకు చైనా టేస్టీ ఫుడ్ అందిస్తున్న హైకింగ్ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా ?
Haiking: నగరంలోని అత్యంత పాపులర్ ఇండో-చైనీస్ రెస్టారెంట్ ఏది అని ఏ హైదరబాదీని అడిగినా ఠక్కున చెప్పే పేరు హైకింగ్. హిమాయత్ నగర్ నడిబొడ్డున ఉన్న ఈ ప్రసిద్ధ రెస్టారెంట్ 1970ల నుండి అసలైన చైనీస్ వంటకాలను నగరవాసులకు అందిస్తోంది.
ఇండో-చైనీస్ హైదరాబాద్ అంతటా ఇంతగా ప్రసిద్ధి చెందకముందే హైకింగ్ ఈ రంగంలో ఉంది. వాస్తవానికి హైకింగ్ బిజినెస్ లా మొదలవలేదు. ఇది తల్లిదండ్రుల ప్రేమతో పుట్టింది. 1972లో అఫో, అకుంగ్ అనే దంపతులు తమ పిల్లల చదువుల కోసం డబ్బు సంపాదించడానికి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
హిమాయత్ నగర్‌లోని యూనివర్సిటీ రోడ్డులో మెయిన్ బ్రాంచ్ ఉంది. రెండో బ్రాంచ్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లోని నేచర్స్ బాస్కెట్ ఎదురుగా ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో టెక్, కార్పొరేట్ ఉద్యోగుల కోసం కొత్త అవుట్లెట్ ఓపెన్ చేశారు. ప్రతి బ్రాంచ్ కూడా మొదటి హైకింగ్ రెస్టారెంట్‌ను ప్రసిద్ధి చేసిన అదే రుచులను అందిస్తుంది.
- ఇది కూడా చదవండి : Hyderabad Food : హైదరాబాదులో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్
హైకింగ్ మెనూ చూడటానికి, రుచి చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడి ఆహారం ఎప్పుడూ తాజాగా, సాంప్రదాయ చైనీస్ వంట పద్ధతులతో కొద్దిగా హైదరాబాదీ రుచితో వండుతారు.

ఇది కూడా చదవండి : Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్
ట్రై చేయాల్సిన ఫుడ్
చికెన్ కార్న్ సూప్, చిల్లీ ప్రాన్స్, బాంబూ చికెన్ రైస్, క్రిస్పీ త్రెడ్ చికెన్, గార్లిక్ జింజర్ చికెన్, చికెన్ పకోరా, చైనీస్ చాప్ సూయ్, మంచూరియన్ బాల్స్
హైకింగ్ హిమాయత్ నగర్లో అడుగుపెడితే టైమ్ ట్రావెల్ చేసినట్లు అనిపిస్తుంది. లోపలి భాగాలు చాలా సాధారణంగా, కొద్దిగా పాతబడినట్లు అనిపిస్తుంది. కానీ అదే దీని ప్రత్యేకత.
చాలా కాలంగా వచ్చే కస్టమర్లు ఇక్కడి వాతావరణం వారికి వారి స్కూల్ రోజులను, ఆదివారం ఫ్యామిలీ డిన్నర్లను గుర్తు చేస్తుందని చెబుతారు. కట్లరీ, డెకార్ విషయంలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది. కానీ రుచి మాత్రం అందరినీ మళ్లీ మళ్లీ రప్పిస్తుంది.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
హైదరాబాద్‌లో చైనీస్ వంటకాలకు భారీగా గిరాకీ పెరిగింది. కారంగా ఉండే నూడుల్స్ నుండి ఫ్రైడ్ రైస్ వరకు హైదరాబాద్ వాసులు ఈ రుచులను బాగా ఇష్టపడుతున్నారు. హైకింగ్ ఈ మార్పులన్నింటిలోనూ తన స్పెషాలిటీని నిలుపుకుంది. అసలైన చైనీస్ ఆహారాన్ని అందిస్తూనే, స్థానిక రుచులకు తగినట్లుగా కొద్దిగా మార్పులు చేసుకుంది.
రెండు స్టార్టర్స్, ఒక సూప్, మెయిన్ కోర్స్, డ్రింక్స్‌తో కూడిన కంప్లీట్ మీల్ ఇద్దరికీ దాదాపు రూ.800 నుండి రూ.1000 వరకు అవుతుంది. వడ్డించే పోర్షన్ ఎక్కువగానే ఉంటుంది. దీని రుచి సాటిలేనిది.
📎 Source: News originally published by Siasat.com
🎥 Content reinterpreted by Prayanikudu for educational and travel information purposes.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.