హరిద్వార్‌లో శివుడి రౌద్ర రూపం.. | Daksheswar Mahadev Temple
Daksheswar Mahadev Temple : ప్రపంచంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని కూడా సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడటానికి మూలం అయిన ఒక ప్రదేశం గురించి నేను ప్రయాణికుడు ఛానెల్లో వీడియో చేశాను.
సతీ దేవి తండ్రి , బ్రహ్మకుమారుడు అయిన దక్షప్రజాపతి (Daksha Prajapati) ఆలయమే దక్షేశ్వర్ ఆలయం. ఈ ఆలయం …
- శక్తి పీఠాలు ఏర్పడానికి కారణం…
- ఇక్కడి యఙ్ఞకుండంలోనే సతీ దేవి చేసింది ప్రాణ త్యాగం…
- హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ఆలయాల్లో ఒకటైన దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన కంప్లీట్ ఇంఫర్మేషన్ ఈ బ్లాగ్‌లో మీకు లభిస్తుంది.
ఈ బ్లాగును రెండు ప్రశ్నలతో స్టార్ట్ చేస్తాను. మొదటి ప్రశ్న మహా శివుడు ఎక్కడుంటాడు ?
- ఒకటి భక్తుల గుండెల్లో లేదా కైలాసంలో.
- ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భోళా శంకరుడి అత్తారిల్లు ఎక్కడ ఉంది ? ఈ ప్రశ్నకు సమాధానం కూడా నేను చెబుతాను. అదే హరిద్వార్‌లోని కంఖాల్ అనే ప్రాంతంలో ఉన్న దక్ష ప్రజాపతి ఆలయ ప్రాంగణం.

ఎక్కడ ఉంది ? Location
హరిద్వార్ రైల్వే స్టేషన్ (Haridwar) నుంచి 5-6 కిమీ దూరంలో కంఖాల్ (Kamkhal) అనే ప్రాంతంలో దక్షేశ్వర్ ఆలయం హిందూ పౌరాణికాల్లో ప్రధానమైన ఆలయాల్లో ఒకటి. ఒక వేళ మీరు హరిద్వార్ వెళ్లాలని ప్లాన్ చేస్తే మాత్రం ఈ ఆలయానికి తప్పకుండా వెళ్లండి. ఎందుకంటే ఈ ఆలయం చూడటానికి ఎంత అందంగా ఉంటుందో…అంతే విశిష్టత గలది కూడా .
దక్షేశ్వర్ ఆలయం ప్రాంగణం ఎంతో అందంగా, చూడచక్కని శిల్పకళతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఆలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టి ముందుకు వెళ్తుండగా మనకు సత్య శివ సాధన ఆలయం కనిపిస్తుంది. తరువాత శ్రీ దక్ష యఙ్ఞ కుండ్ (Sri Daksha Yagna Kund) అనే ఆలయం కనిపిస్తుంది. ఇక్కడే దక్షుడు యాగాన్ని నిర్వహించాడు.
సతీ కుండ్ | Daksheshwar Mahadev Temple
ఇప్పుడు మీరు చూస్తోంది ప్రధాన ఆలయం ప్రాంగణం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే దక్షుడు యాగం నిర్వహించిన కుండం కనిపిస్తుంది. ఇదే కుండంలో సతీ దేవి అగ్నిప్రవేశం (Sati Kund) చేసుకుని ఆత్మార్పణం కూడా చేసుకుంది. ఈ హోమ గుండం కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఆలయ ప్రాంగణమే శక్తి పీఠాలు ఏర్పడానికి మూలం.

ఆలయ ప్రాంగణలో మీకు ఎన్నో ఉప ఆలయాలు, పవిత్రమైన వృక్షాలు కూడా కనిపిస్తాయి.
ఆలయానికి ఒకవైపు గంగానది ప్రవాహం కనిపిస్తుంది. ఇక్కడికి నేను గతంలో కూడా వచ్చాను.
ఇక్కడ చాలా మంది ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు స్విమ్మింగ్ చేస్తున్న వీరిని చూసి నాక్కూడా ఈత కొట్టాలి అనిపించింది. కానీ స్విమ్మింగ్ రాదు అని గుర్తొచ్చి ఆగిపోయా.

ఇక్కడ చాలా మంది నదీ పూజలు చేస్తారు. దాంతో పాటు పిత్రు తర్పణం, పిండదానాలు కూడా చేస్తుంటారు.
శక్తి పీఠాలు ఏర్పడటానికి కారణం ఈ ఆలయం | How Shakti Peethas Formed
భారత దేశంలో మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా శక్తి పీఠాలు ఉన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడానికి ఈ ఆలయానికి ఒక లింకు ఉంది.
మన దేశంలో స్త్రీని శక్తికి స్వరూపంగా కొలుస్తాం. శక్తి ప్రతిరూపంగా భావించి పార్వతి మాత (Maa Parvati) , సతీ దేవిలను పూజించే పీఠాలే శక్తి పీఠాలు. దక్షప్రజాపతి అనే రాజు కూతురైన సతీదేవి భోళా శంకురుడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఈ పెళ్లి దక్షుడికి ఇష్టం లేదు. అందుకు తన కూతురుని పెళ్లి చేసుకున్న మహా శివుడిని ఎలాగైనా అవమానించాలి అని ఆలోచించి ఒక యాగం చేయాలని నిర్ణయిస్తాడు. మీరు దక్ష యఙ్ఞం అనే సినిమా చూసినా, లేదా కథ తెలిసినా కూడా ఒకసారి మళ్లీ తెలసుకోండి.
దక్షుడు తను నిర్వహించే యాగానికి (Daksha Yajna) దేవతలను అందరినీ పిలుస్తాడు. కానీ అల్లుడైన శివుడిని ( Lord Shiva) మాత్రం పిలవడు. కానీ పుట్టింట్లో వేడుక జరుగుతోెంటే కూతురైన సతీదేవి మనసాగలేదు. పరమ శివుడు వద్దని అన్నా కూడా వినకుండా యఙ్ఞం జరిగే ప్రాంతానికి వెళ్తుంది.
సతీదేవిని చూసిన దక్షుడు పిలవని పేరంటానికి నువ్వెలా వచ్చావు అని అవమానిస్తాడు. అంత మంది ముందు తనకు జరిగిన అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది సతీ దేవి.
పరమ శివుడి ఉగ్ర రూపం | Shiva’s Wrath On Daksha
ఈ విషయ మహా శివుడికి తెలియడంతో ఆయన మహా ఉగ్రరూపం ధరిస్తాడు. వెంటనే వీరభద్రుడిని (Creation of Veerabhadra) సృష్టించి దక్ష యాగాన్ని నాశనం చేయమంటాడు త్రికాలాఙ్ఞుడు. వెంటనే శివగణాలతో కలిసి దక్షుడు నిర్వహించే యాగశాలకు చేరుకుని అతని తలను పీకేస్తాడు వీరభద్రుడు. అయితే తరువాత దేవతలు అందరూ వెళ్లి కోరడంతో యాగాన్ని పూర్తి చేసేందుకు మేక తలను దక్షుడి (Daskha Goat Head Story) తలకు అతికించమంటాడు శివుడు.
Daksheswar Mahadev Temple : అలా యాగం పూర్తవుతుంది. తరువాత మహా శివుడి వద్దకు పరుగున వెళ్లిన దక్షుడు తనను క్షమించమని కోరుకుంటాడు.
దక్షయాగం తరువాత పూర్తయిన తరువాత కూడా మహా శివుడికి సతీ వియోగం బాధ అగ్నిలా దహించి వేస్తుంటుంది. తన బాధలను అణచుకోలేక సతీ దేవి పార్థీవ దేహాన్ని తీసుకుని సమస్త జగత్తు కంపించేలా ప్రళయ తాండవం చేయడం ఆరంభిస్తాడు. అది చూసిన శ్రీ మహా విష్ణువు సతీ దేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆమె శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి.
- ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ…శక్తి పీఠం దర్శనం
- Watch : కామాఖ్య అమ్మవారు కొలువైన శక్తి పీఠం దర్శనం
హారిద్వార్లో ఉన్న ఈ ఆలయం మహా శివుడికి అత్తారిల్లు కదా అందుకే ఆయన ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో ఇక్కడికి వస్తారంటారు.
దశ మహా విద్యలు | Dasha Maha Vidya Temple

దక్ష ప్రజాపతి ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, దశమహా విద్యల ఆలయం, శని దేవుడి ఆలయంతో పాటు శ్రీరాముడి దర్బార్, లక్ష్మీ నారాయణుడి ఆలయాలు కూడా ఉంటాయి.
ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న దశ మహా విద్య ఆలయంలో సతీ దేవి 10 అవతారాలను మనం చూడవచ్చు. మీరు కూడా చూడండి.
దక్షేశ్వర్ మహా దేవ్ ఆలయంలో ఎన్నో భారీ వృక్షాలను మీరు దర్శించుకోవచ్చు. ఇందులో భారీ రావి చెట్టుతో పాటు రుద్రాక్ష చెట్టును కూడా చూడవచ్చు.
ఈ ఆలయానికి వస్తే మీరు కనీసం రెండు మూడు గంటలు ఉండేలా ప్లాన్ చేసుకోండి.
ఆలయం ప్రవేశ ద్వారం వద్ద మీకు కొన్ని షాపులు, ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. కావాలంటే కాసేపు అక్కడే మీరు రిలాక్స్ అవ్వొచ్చు.
తరువాత ఆలయం బయటే మీకు ఆటోలు కనిపిస్తాయి. షేరింగ్ లేదా ప్రైవేట్ చేసుకుని మీరు హరిద్వార్‌లో ఎక్కడికైనా చేరుకోవచ్చు.
నేను సాయంత్రం గంగా హారతి చూసేందుకు హరికి పౌరీ (Har Ki Pauri) ప్రాంతానికి చేరుకున్నాను.
Daksheswar Mahadev Temple : కానీ ఇంకా చాలా టైమ్ ఉండటంతో మళ్లీ రూమ్‌కు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుని చీకటి పడుతుంగా మళ్లీ హరికి పౌరీకి చేరుకున్నాను. కానీ అప్పటికే గంగా హారతి (Ganga Aarti) అయిపోయింది. గంగా హారతి అయిపోయింది కాబట్టి తరువాత హరిద్వార్‌లో ఫేమస్ అయిన చోటీ వాలా దగ్గరకు వెళ్లి అక్కడ అలూ టిక్కి (Alu ki Tikki In Haridwar Har Ki Pauri) ఆర్డర్ ఇచ్చాను.

దీనిని బంగాళ దుంపను మాష్ చేసి అందులో కొన్ని వెజిటెబుల్స్ కలిపి ఇలా ఫ్రై చేస్తారు. టేస్ట్ అదిరిపోతుంది. అది తినేసి రూమ్‌కు వెళ్లి ప్యాకప్ చేసి హైదరాబాద్ బయల్దేరాను.
ఇది దక్షేశ్వర్ ఆలయంపై నేను చేసిన వీడియోకు సంబంధించిన బ్లాగు. ఇక ఈ వీడియోలోను మీరు చూడాలి అనుకుంటే మీ కోసం పోస్ట్ చేస్తున్నాను.
వీడియోలో కవర్ కాని విషయాల, కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మీ కోసం అందిస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను.
ప్రశ్న : దక్షేశ్వర్ మహా దేవ్ ఆలయం ఎక్కడ ఉంది ? | Where is Daksheswar Mahadev Temple
సమాధానం : ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రైల్వే స్టేషన్‌కు 5-6 కీమి దూరంలో ఉంటుంది.
ప్రశ్న : హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి ? | How To Reach From Hyderabad
సమాధానం : మీరు హైదరాబాద్ అయినా, విజయవాడ నుంచి అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ట్రైనులో మీరు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి హరిద్వార్ లేదా రిషికేష్‌కు బస్ లేదా ట్రైన్లో చేరుకోవచ్చు.
ప్రశ్న : హరిద్వార్‌కు విమానాలు లేవా ?
సమాధానం : హరిద్వార్‌కు సమీపంలో జాలీ గ్రాంట్ అనే విమానాశ్రయం ఉంటుంది. డెహ్రాడూన్‌లో ఉండే ఈ ఎయిర్‌పోర్టు నుంచి మీరు హరిద్వార్ చేరుకోవచ్చు.
ప్రశ్న : ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? | History Of Daksheswar Mahadev Temple
సమాధానం : ఈ ఆలయాన్ని 1810 లో రాణి ధనక్ నాగారా శైలిలో (Nagara Style) నిర్మించారు. తరువాత 1962 లో మహా నిర్వాని ఆఖాడాకు చెందిన సాధువులు పునర్మించారు. రినోవేషన్ సమయంలో
ప్రశ్న : ఈ ఆలయం సమయం ఏంటి ? ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To Visit & Temple timing
సమాధానం : ఈ ఆలయం ఉదయం 5 గంట నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటారు. ఆలయం మూసి ఉన్న సమయంలో మీరు ప్రాంగణంలో కూడా ఉండవచ్చు. మీరు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించే అవసరం లేదు.
- ఇక బెస్ట్ టైమ్ వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చి వరకు. మార్చి తరువాత భీకరమైన వేడి, ఎండాకాలం తరువాత భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అందుకే అక్టోబర్- మార్చి సమయంలో ప్రయత్నించండి.
ప్రశ్న : ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏమైనా ఉన్నాయా? | Special Festivals in Temple
సమాధానం : మహా శివరాత్రి సమయంలో, శ్రావణ మాసంలో ( ఈ సమయంలో మహా శివుడు అత్తారింటికి వస్తారట) ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.
ప్రశ్న : దగ్గర్లో చూసేందుకు ఏమున్నాయి ? Near By Attractions
సమాధానం : ఈ ఆలయానికి వస్తే మీరు సతీ కుండ్, దక్ష ఘాట్, దశ మహా విద్య ఆలయాలతో పాటు నీలేశ్వర్ ఆలయం, రామకృష్ణ మిషన్ సందర్శించవచ్చు.