భారతీయులను ఊరిస్తోన్న టాప్ 7 విదేశీ వింటర్ డెస్టినేషన్స్ | Top 7 Winter Destinations for Indians Abroad
TOP 7 WINTER DESTINATIONS FOR INDIANS ABROAD : చలికాలం వచ్చిందంటే చాలు భారతీయులు ప్రయాణాలు చేయడం కోసం కొత్త కొత్త డెస్టినేషన్స్ వెతుకుతుంటారు. ఇలా చాలా మంది భారతీయులు వెళ్లే టాప్ 7 విదేశీ వింటర్ ఇవే.
ముఖ్యాంశాలు
1️. థాయ్‌లాండ్ | Thailand (Bangkok, Phuket, Chiang Mai)

థాయ్‌లాండ్ వెళ్లేందుకు సీజన్, రీజన్ అంటూ ఏమీ అవసరం లేదు. అందుకే వింటర్లో కూడా ఇక్కడికి వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడి బీచుల్లో, నైట్ మార్కెట్లో, బడ్జెట్ ఫ్రెండ్లీ లైఫ్స్టైల్లో జీవితాన్ని కొత్తగా ఎంజాయ్ చేయొచ్చు.
- ఇది కూడా చదవండి : Thailand : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- ఇది కూడా చదవండి : భారతీయులను 11 కారణాలతో ఆయస్కాంతంలా లాగేస్తున్న థాయ్‌లాండ్
2. వియత్నాం | Vietnam (Hanoi, Da Nang, Ho Chi Minh City)

చల్లని వాతావరణంలో అందమైన పర్వతాలను చూస్తూ టీ తాగుతూ, నచ్చింది తింటూ అది కూడా ఇండియన్ బడ్జెట్లోనే విదేశీ యాత్రను చేసే అవకాశాన్ని వియత్నాం అందిస్తుంది.
- ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- ఇది కూడా చదవండి : థాయ్‌లాండ్ కాదని భారతీయులు ఈ దేశానికి ఎందుకు వెళ్తున్నారు ?
3. దుబాయ్ | Dubai, UAE
దుబాయ్ వెళ్లేందుకు పర్ఫెక్ట్ సీజన్ ఇదే.ఈ సమయంలో ఎడారి సఫారీల్లో సరదాగా రైడ్స్ చేయొచ్చు, షాపింగ్, ఫెస్టివ్స్ లగ్జరీ సైట్ సీయింగ్ ఇలా చేయొచ్చు.
- ఇది కూడా చదవండి : దుబాయ్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు
- ఇది కూడా చదవండి : దుబాయ్ నీటి రహస్యం…ఎడారి దేశానికి నీరు ఎలా లభిస్తోంది ?
4. భూటాన్ Bhutan
ప్రశాంతమైన దేశం భూటాన్. అంతే ప్రశాంతంగా మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలు, స్లో ట్రావెల్ ఇష్టపడే వారికి వీసా అవసరం లేకుండానే విదేశీ యాత్ర చేసే అవకాశం. అద్భుతం కాదా.
- ఇది కూడా చదవండి : భూటాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? | గైడ్
5. కజకిస్తాన్ | Kazakhstan (Almaty)

మంచుతో నిండిన పర్వతాలు, గడ్డకట్టుకుపోయిన సరస్సలు, తక్కువ ధరలో యూరోప్ వెళ్లామనే ఫీలింగ్ కలిగించే అందాలు కజకిస్తాన్ వెళ్తే చూడొచ్చు
- ఇది కూడా చదవండి : Cheapest Countries To Travel : భారతీయ కరెన్సీ కన్నా తక్కువ…చవకగా వెళ్లగలిగే 6 దేశాలు
- ఇది కూడా చదవండి : ఈ 58 దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం లేదు
6. టర్కీ | Turkey (Istanbul, Cappadocia)

చలికాలం టర్కీలో ఆఫ్ సీజన్. కానీ మనకు మాత్రం ఇది పర్ఫెక్ట్ సీజన్. ఈ సమయంలో టర్కీ ఒక మేజికల్ డ్రీమ్‌లా మారిపోతుంది.
- ఇది కూడా చదవండి : వీసా అవసరం లేకుండా భారతీయులు వెళ్లగలిగే 7 దేశాలు
7. స్విటర్లాండ్ Switzerland (Interlaken, Lucerne, Zurich)

ప్రతీ ప్రయాణికుడి కల స్విట్జర్లాండ్ వెళ్లడం. ఈ మంచు ప్రపంచంలో ఎన్నో గడ్డకట్టుకున్న పర్వతాలు, కేబుల్ కార్ ప్రయాణాలు, అల్పైన్ బ్యూటిని ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండే 7 దేశాలు
- ఇది కూడా చదవండి : స్విట్జర్లాండ్ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలోనే ఉన్న మినీ స్విట్జర్లాండ్స్ చూసేయండి
ఆసియా నుంచి యూరోప్ వరకు మన బడ్జెట్ అండ్ టైమింగ్‌ను బట్టి ఎన్నో అద్భుతమైన దేశాలు భారతీయులను చల్లని చలిలో ఆప్యాయతతో స్వాగతిస్తున్నాయి.
ప్రపంచం అత్యంత అందంగా కనిపించే సీజన్ కూడా ఇదేనేమో అందుకే వాటిని చూసేందుకు భారతీయులు ప్రపంచ యాత్రను చేపట్టే సమయం కూడా ఇదే అనిపిస్తుంది. అందుకే వారి ఆహ్వానాన్ని మన్నిస్తూ విదేశాల్లో వాలిపోతుంది ప్రతీ ప్రయాణికుడి మనసు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
