వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి – అన్ని రూట్స్ ఒకటే ప్లేస్‌లో | Vizag Araku Lambasingi Vanjangi Distance Guide
వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి ఎంత దూరం, రూట్లు, ట్రావెల టైమ్, బెస్ట్ ట్రిప్ ఆర్డర్ క్లియర్‌గా తెలుసుకోండి. ఇది కంప్లీట్ Vizag Araku Lambasingi Vanjangi Distance Guide
వైజాగ్ – అరకు-లంబసింగి-వంజంగి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ గైడ్ లో (Vizag Araku Lambasingi Vanjangi Distance Guide) అన్ని మేజర్ డిస్టెన్సెస్, రూట్స్, ట్రావెల్ టైమ్, బెస్ట్ ఆర్డర్ సింపుల్‌గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి ట్రిప్ ప్లాన్ చేసే ప్రయాణికులకు డిస్టెన్స్ కన్ఫ్యూజన్ చాలా కామన్.
ముందు ఎక్కడ స్టార్ట్ చేయాలి?
డైరక్టుగా వెళ్లవచ్చా?
అరకు నుంచి బెటరా?
లంబసింగి నుంచి బెటరా?
అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి.
ఈ బ్లాగ్‌లో వైజాగ్, అరకు, లంబసింగి, వంజంగి మధ్య ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్రాంతాల దూరాలు, ట్రావెల్ టైమ్, రూట్స్, రోడ్డు కండిషన్స్, బెస్ట్ ట్రావెల్ ఆర్డర్ అన్నీ కూడా ఒకటే ప్లేస్‌లో క్లియర్‌గా వివరించాను.
మొదటి సారి ప్రయాణం చేస్తున్న వారికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్లానింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది.
ముఖ్యాంశాలు
వైజాగ్ నుంచి అరకు దూరం | Vizag to Araku Distance
వైజాగ్ నుంచి అరకు జర్నీ అంటే జస్ట్ ప్రయాణం మాత్రమే కాదు…
తూర్పు కనుమల్లో (Eastern Ghats) మధ్య ఒక అందమైన ట్రిప్ అది.
సిటీ రోడ్స్ నుండి బయటకు వచ్చాక ఘాట్స్ స్టార్ట్ అవుతాయి. వాతావరణం చల్లబడటం మొదలవుతుంది.
First Time Araku వెళ్లిన వారికి రోడ్ కండిషన్, ట్రావెల్ టైమ్ గురించి డౌట్స్ ఉంటాయి. ఈ రూట్లో క్లారిటీ ఉంటే జర్నీ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది.
Distance: సుమారు 121 km
ప్రయాణ సమయం (Travel Time): 3 నుంచి 4 గంటలు
రూట్: Vizag – Ananthagiri – Araku
రోడ్ కండిషన్: చాలా అందంగా, బాగుంటుంది.
ఈ రూట్లో రోడ్డు ప్రయాణం అనేది చాలా పాపులర్. మలుపులు ఎక్కువ ఉన్నా రోడ్డు క్వాలిటీ బాగుంటుంది. ట్రైన్ ఆప్షన్ కూడా ఉంది. కానీ సీనరీ కోసం రోడ్డు ట్రావెల్ బెస్ట్ అని కొంతమంది అభిప్రాయం.
Vizag To Araku Distance Google map
Vizag to Araku road route via Ananthagiri Ghats – scenic hill drive through Eastern Ghats.
వైజాగ్ నుంచి లంబసింగి దూరం | Vizag to Lambasingi Distance
లంబసింగి అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి ఫాగ్, చల్లని వాతావరణం, వింటర్ వైబ్స్.వైజాగ్ నుంచి లంబసింగికి ప్రయాణించేవాళ్లు ఎక్కువగా డిసెంబర్–జనవరి నెలల్లోనే వెళ్తుంటారు. ఈ రూట్లో సిటీ ట్రాఫిక్ మెల్లిగా తగ్గి, అడవులు, హిల్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి. కరెక్ట్ టైమింగ్ తెలుసుకుని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్.
- Distance (దూరం): సుమారు 119 km
- ప్రయాణ సమయం (Travel Time): సుమారు 4 గంటలు
- రూట్: Vizag – Narsipatnam – Lambasingi
వెలుగులో ప్రయాణించడం ఉత్తమం. చాలా మంది పొద్దున్నే బయల్దేరి మధ్యాహ్నం కల్లా డెస్టినేషన్‌లో సెట్ అవుతారు.
- పూర్తి సమాచారం కోసం ఈ బ్లాగ్ చదవండి : వైజాగ్ నుంచి లంబసింగి ఎంత దూరం ? బెస్ట్ రూట్ ఏంటి ? Vizag To Lambasingi Distance Route Travel Time
Vizag To Araku Distance Google map
Distance: ~119 km | Travel Time: ~4 hours | Route: Vizag – Narsipatnam – Lambasingi
వైజాగ్ నుంచి వంజంగి దూరం | Vizag to Vanjangi Distance
వంజంగిలో సూర్యోదయం చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వైజాగ్ నుంచి డైరక్టుగా వంజంగికి ప్రయాణించవచ్చు. అయితే లాంగ్ నైట్ జర్నీస్ వల్ల కాస్త అలసటగా అనిపించవచ్చు. అందుకే చాలా మంది ప్రయాణికులు ముందు అరకు చేరుకుని నెక్ట్స్ డే మార్నింగ్ వంజంగికి చేరుకుంటారు.
- Distance (దూరం): సుమారు 117 km
- ప్రయాణ సమయం (Travel Time): సుమారు 4 గంటలు
- రూట్: Vizag – Araku – Paderu Road
ఉదయం 5 am కి వంజంగి కొండపైకి ఎక్కి సూర్యోదయం చూడకపోతే మీ జర్నీ దాదాపు అసంపూర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇది చాలా బెస్ట్ వ్యూ పాయింట్‌గా మారిపోతుంది.
Vizag to Vanjangi Distance Google Map
Distance: ~117 km | Travel Time: ~4 hours | Route: Vizag – Araku – Paderu – Vanjangi
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
అరకు నుంచి వంజంగి దూరం | Araku to Vanjangi Distance
వంజంగిలో సూర్యోదయం చూడాలని ప్లాన్ చేస్తున్న వారు చాలా మంది ఈ రూట్‌నే ఫాలో చేస్తారు. దూరం తక్కువ అయినా, అడవుల వల్ల టైమ్ పడుతుంది. కానీ ఎంజాయ్ చేస్తారు.
- Distance (దూరం): సుమారు 43 km
- Travel Time (ప్రయాణ సమయం): గంట నుంచి గంటన్నర
- రూట్: Araku – Paderu
- రోడ్డు కండిషన్: చాలా వరకు బానే ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాలో కాస్త రఫ్‌గా ఉంటుంది.
పొద్దునా, రాత్రి ఫాగ్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు స్లోగా డ్రైవింగ్ చేయడం మంచిది.
👉 Sunrise timings, viewpoint entry tips కోసం సెపరేట్‌గా Araku to Vanjangi guide refer చేయండి.
- ఇది కూడా చదవండి : అరకు నుంచి వంజంగి ఎంత దూరం ? బెస్ట్ రూట్, ట్రావెల్ టైమ్ | Araku To Vanjangi Distance
Araku to Vanjangi Distance Google Map
Distance: ~43 km | Travel Time: ~1 to 1.5 hours | Route: Araku – Paderu – Vanjangi
అరకు నుంచి లంబసింగి దూరం | Araku to Lambasingi Distance
అరకులో బస చేసి లంబసింగికి వెళ్లడం అనేది చాలా మంది ఫాలో అయ్యే ప్లాన్. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ రూట్ చాలా పాపులర్.
- Distance (దూరం): సుమారు 90 km
- ప్రయాణ సమయం (Travel Time): సుమారు 3–4 గంటలు
- రోడ్డు కండిషన్: మలుపులు తిరిగిన ఘాట్ రోడ్లు ఎక్కువగా ఉంటాయి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
లంబసింగి నుంచి వంజంగి దూరం | Lambasingi to Vanjangi Distance
లంబసింగిలో రాత్రి స్టే చేసి నెక్ట్స్డే మార్నింగ్ వంజంగి సన్‌రైజ్ కోసం వెళ్లేందుకు ఇది బెస్ట్ రూట్.
- Distance (దూరం): సుమారు 47 km
- ప్రయాణ సమయం (Travel Time): సుమారు 2 గంటలు
- రోడ్డు కండిషన్: సన్నని ఫారెస్ట్ రోడ్లు ఉంటాయి.
సొంత వాహనం కంటే లోకల్ జీప్‌లో ప్రయాణించడం చాలా సేఫ్.

Lambasingi to Vanjangi Distance Google Map
Distance: ~47 km | Travel Time: ~2 hours | Route: Lambasingi – Paderu – Vanjangi
- ఇది కూడా చదవండి : Vanjangi 2025 : 5:30AM సీన్ మిస్సయితే = ట్రిప్ ఫెయిల్ Vanjangi Complete Travel Guide
వంజంగి నుంచి అరకు రిటర్న్‌లో
Vanjangi to Araku Distance (Return)
సన్‌రైజ్ చూసిన తరువాత మీరు తిరిగి అరకు చేరుకోవాలి అనుకుంటే ఆ సమయంలో విజిబిలిటీ బాగుంటుంది. ఎందుకంటే ఫాగ్ తగ్గిపోతుంది.
- దూరం (Distance): 43 km
- ప్రయాణ సమయం (Travel Time): సుమారు 2 గంటలు
బెస్ట్ రూట్ ఏంటి అంటే | Best Order to Cover Vizag, Araku, Lambasingi & Vanjangi
Vanjangi to Araku Distance google map
Distance: ~43 km | Travel Time: ~2 hours | Route: Vanjangi – Paderu – Araku
వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడే ముందు మీరు ఏఏ ప్రాంతాలు కవర్ చేయాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. దానిని బట్టి మీరు మీ రూట్ ఎంచుకోండి.అయితే నేను ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు వీలైనది, నచ్చినది ఎంచుకోవచ్చు.
ఆప్షన్ నెం.1 : ఇది చాలా ప్రాక్టికల్
ఇది వైజాగ్ నుంచి అరకు, తరువాత వంజంగి, అనంతరం లంబసింగికి వెళ్లే దారి. చివరికి మళ్లీ వైజాగ్ ఇదే దారిలో రిటర్న్‌లో చేరుకుంటారు.
Route Order:
Vizag → Araku → Vanjangi (Sunrise) → Lambasingi → Vizag
అయితే ఇందులో చూసిన ముఖాలే మళ్లీ చూసినట్టు చూసిన ప్రాంతాలను మళ్లీ చూసుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా మరో రూట్ కూడా ట్రే చేయవచ్చు.
ఆప్షన్ నెం.2 : ఇది సీజినల్
చలికాలంలో ఈ రూట్లో ప్రయాణించేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఇందులో ముందుగా వైజాగ్ నుంచి లంబసింగి చేరుకుంటారు. అక్కడి నుంచి వంజంగి, తరువాత అరకు నుంచి వైజాగ్ చేరుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని డెస్టినేషన్స్ కవర్ చేసినట్టే కదా.
Route Order:
Vizag → Lambasingi → Vanjangi → Araku → Vizag
No Backtracking:
ఈ రూట్ ఫాలో చేస్తే మీరు అన్ని ప్రాంతాలను కవర్ చేయవచ్చు. అలాగే ఒక్కసారి వెళ్లిన ప్రాంతానికి మరోసారి వెళ్లే అవసరం ఉండదు.
రోడ్డు, ట్రావెల్ టిప్స్ | Road & Travel Tips
అరకు సర్కిట్లో మీరు ఎక్కడికి వెళ్లినా మంచి ప్రయాణ అనుభూతితో ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఇక్కడ అర్థరాత్రి తరువాత పొగమంచు (Fog) ఏర్పడుతుంది. నేను వెళ్లినప్పుడు నాకు సాయంత్రం 6 గంటలకే పొగమంచు కనిపించింది. ఇక రాత్రి సమయంలో ఎలా ఉంటుందో You can imagine.
- ఎండాకాలం వెళ్లినా కూడా తేలికపాటి జాకెట్స్, షాలువుల లాంటివి తీసుకెళ్లండి.
- అరకు తరువాత పెట్రోల్ బంకులు (Fuel Stations Around Araku) చాలా తక్కువగా ఉంటాయి.
- వంజంగి వద్ద మొబైల్ నెట్వర్క్ వీక్‌గా ఉండే అవకాశం ఉంది.
- పొద్దున్నే చేసే ప్రయాణాలకు లోకల్ జీపులు చాలా సేఫ్.
ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి? | How Many Days Ideal?
అరకు–వైజాగ్ ట్రిప్ ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి అనేది మీ టైమ్, ఇంట్రెస్ట్, డబ్బుపై ఆధారపడి ఉంటుంది.
2 Days:
ఆల్మోస్ట్ మీరు పాదయాత్ర చేసినట్టే ఉంటుంది. చాలా టైట్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి లేదా కొన్ని ప్లేసెస్‌ను మాత్రమే కవర్ చేయాలి.
3 Days:
ఎక్కువ మంది చేసేది ఇదే. అరకు, లంబసింగి, వంజంగి ఈ మూడు కూడా కవర్ చేయవచ్చు.
4 Days:
నాలుగు రోజులు స్పెండ్ చేస్తే మీరే నాకు గైడ్ అయిపోవచ్చు. అన్ని ప్లేసెస్ కవర్ చేయవచ్చు. రిలాక్స్డ్ ట్రిప్‌లో మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. నిజమైన టూరిజం అంటే ఇదే కదా ✨
సాధారణ ప్రశ్నలు | FAQs
- వైజాగ్ నుంచి అరకు దూరం ఎంత?
What is the distance from Vizag to Araku?
సుమారు 121 km, 3–4 గంటల్లో కవర్ చేయవచ్చు. - వైజాగ్ నుంచి లంబసింగి దూరం ఎంత?
What is the distance from Vizag to Lambasingi?
సుమారు 119 km, సుమారు 4 గంటల్లో ప్రయాణించవచ్చు. - వైజాగ్ నుంచి వంజంగికి డైరక్టుగా వెళ్లవచ్చా?
Can we travel directly from Vizag to Vanjangi?
వెళ్లొచ్చు, కానీ Vizag → Araku → Vanjangi రూట్ బెస్ట్. - అరకు నుంచి వంజంగి దూరం ఎంత?
What is the distance from Araku to Vanjangi?
సుమారు 43 km, గంట నుంచి గంటన్నరలో చేరుకోవచ్చు. - లంబసింగి నుంచి వంజంగి దూరం ఎంత?
What is the distance from Lambasingi to Vanjangi?
సుమారు 47 km ఉంటుంది.
పనికొచ్చే మాట | Vizag Araku Lambasingi Vanjangi Distance Guide
అరకు, లంబసింగి, వంజంగి ప్రాంతాలను ఒక్కొక్కటిగా సెపరేట్ ట్రిప్‌లా కాకుండా,
అన్నీ కూడా ఒకటే Connected Hill Station Circuit లాగా ప్లాన్ చేయడం బెటర్.
అందుకే ఈ పోస్టు ప్లాన్ చేశాను. ఎందుకంటే డిస్టెన్సెస్, రూట్లు అన్నీ ఒకటే చోట ఉంటే,
మీకు ప్లాన్ చేయడంలో ఇబ్బంది ఉండదు కదా.
డబ్బు, ఫ్యూయల్, టైమ్ అన్నీ మిగులుతాయి.
కన్ఫ్యూజన్ ఉండదు.
జర్నీ ప్లాన్ చేసే ఒత్తిడి ఉండదు.
👉 Vanjangi sunrise planning, route condition updates, local ground tips కోసం “Araku to Vanjangi Distance – Detailed Guide” తప్పకుండా చదవండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
