ఒకే రోజులో తిరుమల దర్శనం సాధ్యమా? తాజా నియమాలు & పూర్తి గైడ్ | SRIVANI Darshan Guide
SRIVANI Darshan Guide: తిరుమలలో ఒకే రోజు దర్శనం సాధ్యమా? క్యూలైన్లో ఎంత వెయిటింగ్ ఉంటుంది? శ్రీవాణి టికెట్లు అంటే ఏంటి? ఇలా ఎన్నో సందేహాలకు ఈ పోస్టే సమాధానం.
ముందుగా శ్రీవాణి దర్శనం అనేది ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్లకు ఒక సమాధానం లాంటిది. ఇది కేవలం ఒక స్పెషల్ ఎంట్రీ కాదు.
TTD కి చెందిన శ్రీవాణి ట్రస్ట్ (TTD SRIVANI Trust) కి డొనేషన్ ఇచ్చి, ఒకే రోజులో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పొందే ఒక ప్రాపర్ దర్శన మార్గం ఇది.
ఇటీవలే ఈ వ్యవస్థలో కొన్ని మార్పులు చేసింది.
ఈ పోస్టు టిటిడి ప్రకటన మాత్రమే కాదు… మీరు ఎలా ప్లానింగ్ చేసుకోవాలో వివరించే ప్రయాణికుడు అందించే గైడ్ కూడా.
ఈ దర్శనం ఎవరికీ సెట్ అవుతుంది? ఎలా ప్లాన్ చేసుకోవాలి? కామన్ మిస్టేక్స్ ఏంటి? అనేవి సింపుల్‌గా చూద్దాం.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
ముఖ్యాంశాలు
టిటిడి అధికారిక అప్డేట్ | TTD Update on SRIVANI – January 2026
భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానాలు (Tirumala Tirupati Devasthanams – TTD)
శ్రీవాణి దర్శనం టికెట్లకు ఆన్లైన్ కరెంట్ బుకింగ్ సదుపాయాన్ని ట్రయల్ బేసిస్‌లో ప్రారంభించింది.
ఈ సిస్టమ్ 2026 జనవరి 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఎలా బుక్ చేసుకోవాలి | SRIVANI Online Current Booking
ఇప్పటి వరకు కౌంటర్లలో జారీ అయ్యే 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఇకపై పూర్తిగా ఆన్లైన్లో బుక్ చేసుకునేలా మార్చారు.
ఇందులో ఇప్పటికే ఉన్న 500 టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ కోటా యథావిధిగా కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి : తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలు ? ఏ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అవుతుంది | Tirumala Darshan Guide
ఆన్లైన్ బుకింగ్ షెడ్యూల్ | SRIVANI Daily Online Booking Schedule
శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు టైమింగ్స్ పాటించడం చాలా ముఖ్యం.
- Tickets Release: ప్రతీ రోజు ఉదయం 9:00 గంటలకు
- Booking Close: మధ్యాహ్నం 2:00 గంటలకు
- Darshan Reporting Time: అదే రోజు సాయంత్రం 4:00 గంటలకు
ఇది ట్రయల్ మాత్రమే | TTD SRIVANI Trial Run
ఈ ట్రయల్ రన్ అనేది ఒక నెల పాటు జరుగుతుంది.
దాని ఫలితాలను విశ్లేషించిన అనంతరం టైమింగ్స్ లేదా కోటా మారే అవకాశం ఉంది.
టిటిడి విజ్ఞప్తి | TTD Appeal

లాంగ్ వెయిటింగ్‌ను ఎవాయిడ్ చేయడానికి భక్తులు ఈ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ అంటే ఏంటి?
What is SRIVANI Online Current Booking
శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ అంటే —
- తిరుమలలో ఇప్పటికే ఉన్న ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్లకు బదులు,
- అదే రోజు దర్శనం కోసం ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేయాలి.
ఇంతకు ముందు:
- తిరుమల కౌంటర్లలో 800 ఆఫ్‌లైన్ టికెట్లు
- వాటిలో 500 టికెట్లు ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్
ఇప్పుడు:
- ఆ 800 టికెట్లన్నీ పూర్తిగా ఆన్లైన్ కరెంట్ బుకింగ్
- కౌంటర్ల వద్ద క్యూలు ఉండవు
- లైన్లలో నిలబడే అవసరం ఉండదు
ఒక్క మాటలో చెప్పాలంటే – ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటేనే ఒకే రోజులో దర్శనం సాధ్యం.
- ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | i Andhra Pradesh 7 Vishnu Temples
శ్రీవాణి కరెంట్ బుకింగ్ ఎవరు ట్రై చేయవచ్చు? | SRIVANI Darshan Guide
Who Can Try SRIVANI Current Booking
ఈ ఆప్షన్ ఈ భక్తులకు బెస్ట్
- ముందస్తు ప్లాన్ లేకుండా సడెన్‌గా తిరుమల చేరుకునే వారికి
- ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేస్తున్న వారికి
గరిష్టంగా 4 మంది (1 + 3) - ఎక్కువ సేపు క్యూలో నిలబడలేని సీనియర్ సిటిజన్లకు
వేరే తేదీలో దర్శనం కావాలంటే SRIVANI Advance Booking బెటర్.
తప్పకుండా తెలుసుకోవాల్సిన రూల్స్ | SRIVANI Booking Rules
- ఒక కుటుంబంలో గరిష్టంగా నలుగురికి మాత్రమే అనుమతి
- ఆధార్ వెరిఫికేషన్ & మొబైల్ నెంబర్ తప్పనిసరి
- మల్టిపుల్ లేదా మిస్యూజ్ బుకింగ్‌లను నివారించేందుకు చెకింగ్స్
- ఈ సిస్టమ్ ట్రయల్ బేసిస్‌లో రన్ అవుతుంది
ట్రయల్ ఫలితాలను బట్టి రూల్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
తిరుమల ఒక్కరోజు దర్శనం ప్లాన్ | Tirumala One-Day Darshan Simple Plan
శ్రీవారిని ఒకే రోజులో దర్శనం చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ఉదయం
- తిరుమల / తిరుపతికి వీలైనంత త్వరగా చేరుకోండి
- స్టే లేకపోయినా One-Day Darshan సాధ్యం
ఉదయం 9:00 గంటలకు
- SRIVANI Online Current Booking ప్రయత్నించండి
మధ్యాహ్నం 2:00 గంటలకు ముందు
- టికెట్లు కన్ఫర్మ్ అయితే స్నానం, అన్నదానం / లైట్ ఫుడ్ తీసుకోండి.
సాయంత్రం 4:00 గంటలకు
- దర్శనం కోసం రిపోర్ట్ చేయండి
చిన్న సూచన | Prayanikudu Tip
సాయంత్రం 4 గంటలకు దర్శనం ఉంటుంది కాబట్టి, ఉదయమే తిరుమల చేరుకునేలా ప్లాన్ చేసుకోవడం సేఫ్.
- ఇది కూడా చదవండి : తెలంగాణలో 7 ప్రసిద్ధ శ్రీ మహావిష్ణువు & అవతారాల ఆలయాలు |
శ్రీవాణి దర్శనం ఆప్షన్లు | Available SRIVANI Darshan Options
శ్రీవాణి దర్శనానికి ఇంకా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి,.
శ్రీవాణి అడ్వాన్స్ బుకింగ్ | SRIVANI Advance Booking
- ప్రతీ రోజు 500 టికెట్లు
- 3 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఆఫ్‌లైన్ బుకింగ్
- ప్రతీ రోజు 200 టికెట్లు
- ఈ ప్రాసెస్‌లో ఎలాంటి మార్పు లేదు
అంటే భక్తుల అవసరాన్ని బట్టి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
తిరుమల దర్శనం రూల్స్ టైమ్ టు టైమ్ మారవచ్చు.
TTD ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చినప్పుడు, ప్రయాణికుడు ప్లాట్ఫామ్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
