ఆవకాయ్ ఫెస్టివల్ అంటే ఏంటి ? | పూర్తి గైడ్ Amaravati Avakai Festival Complete Guide
Amaravati Avakai Festival : తెలుగు సినిమా, సాహిత్యం, కళలు అంటే మన తెలుగు వారికి ఒక రంగస్థల ప్రదర్శన, లేదా వెండితెరపై కదిలే బొమ్మలు మాత్రమే కాదు. అవి ఒక జీవన విధానం, అది ఒక జ్ఞాపకాల వీధి, సమకాలీన సాహిత్యానికి దర్పణం లాంటివి.
అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ అనే ఈ కొత్త కల్చరల్ ఫెస్టివల్ ఎగ్జాక్ట్‌గా అదే ప్రేరణను, అదే స్పిరిట్‌ను పబ్లిక్‌లోకి తీసుకొస్తుంది. 2026 జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విజయవాడలోని పున్నమి ఘాట్ & భవానీ ఐలాండ్ వద్ద జరగబోయే ఈ ఫెస్టివల్, తెలుగు కల్చర్ ఈకోసిస్టమ్‌ను ఒక ఓపెన్ ఎయిర్ ప్లాట్ఫామ్లో కలిపే వేదిక.
Entry : ఫ్రీ
ఎవరి కోసం : అందరి కోసం
- ఇది కూడా చదవండి : ఈ సంక్రాంతికి బర్డ్స్ & భక్తి కాంబినేషన్ ట్రై చేయండి | Flamingo Festival 2026 – TTD Combo Tour
ముఖ్యాంశాలు
అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ అంటే ఏంటి ?
What is Amaravati Avakai Festival?
అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మరియు Teamwork Arts కలిసి నిర్వహిస్తున్న 3 రోజుల కల్చరల్ ఫెస్టివల్ ఇది.
ఈ వేడుకలో
- తెలుగు సినిమా
- తెలుగు సాహిత్యం
- సంగీతం
- థియేటర్
- కల్చరల్ డిస్కషన్స్
అన్నీ ఒకే ఓపెన్ వేదికపై జరుగుతాయి.
దీని లక్ష్యం : Amaravati Avakai Festival
అమరావతి – విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడం.
మంత్రి కందుల దుర్గేష్ చెప్పినట్టు ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు.
అమరావతిని భవిష్యత్తులో సాహిత్య, కళా రాజధానిగా నిలబెట్టే ప్రయత్నంలో ఇది ఒక తొలి అడుగు.
ఆవకాయ్ అనే పేరు ఎందుకు పెట్టారు ?
Why is this Festival Named Avakai?
ఆవకాయ్ అనేది తెలుగు వారి ఐడెంటిటికి ఒక స్ట్రాంగ్ సింబల్.
సింపుల్ ఇంగ్రీడియెంట్స్, డీప్ ఫ్లేవర్, కొన్ని తరాల నుంచి కొనసాగుతున్న ప్రాసెస్ ఇది.
ఈ ఫెస్టివల్ కూడా అంతే —
- తెలుగు సంప్రదాయానికి ప్రతిరూపం
- ఆధునిక భావాలకు స్వాగతం
- స్థానిక కథనాలు అవుతాయి జాతీయం
ఇది కేవలం ప్రాస బాగుందని పెట్టిన పేరు కాదు.
నిజంగా ఇందులో ఉన్న పాయింట్స్, ఆవకాయ్ ఫెస్టివల్ లక్ష్యాలు ఒక్కటే.
కాబట్టి ఇందులో ఆవకాయ్ అనేది ఒక క్యాచీ జిమ్మిక్ లేదా క్లిక్‌బైట్ కాదు.
అది తెలుగు సంప్రదాయం DNAకి ప్రాతినిధ్యం వహించే పదం.
అంతకంటే ఎక్కువగా, తెలుగువారి జీవితంలో అది ఒక భాగం.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో టాప్ 7 కుటుంబ సమేతంగా వెళ్లదగిన ప్రాంతాలు | Vijayawada Near By Places
ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ?
Avakai Festival Locations
ఆవకాయ్ ఫెస్టివల్‌ను రెండు వేదికల్లో నిర్వహిస్తున్నారు.

భవానీ ఐలాండ్ | Bhavani Island
ఇక్కడ పగటి పూట వేడుకలు, కల్చరల్ కార్యక్రమాలు జరుగుతాయి.
సాహిత్య కార్యక్రమాలు, స్టోరీ టెల్లింగ్, ప్యానల్ డిస్కషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు.
పున్నమి ఘాట్ | Punnami Ghat
ఇక్కడ కార్యక్రమాలు సాయంత్రం సమయంలో జరుగుతాయి.
సంగీత ప్రదర్శనలు, థియేటర్, సినిమా సంబంధిత కల్చరల్ ఈవెంట్స్, కృష్ణానది తీరంలో ఓపెన్ ఎయిర్ వేడుకలు ఉంటాయి.
ఇండోర్ హాల్స్‌లో కాకుండా, పబ్లిక్ ఓపెన్ స్పేస్‌లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ వేడుకను నిర్వహించనున్నారు.
తేదీలు, లొకేషన్, ఎంట్రీ ఫీ
Avakai Festival Dates, Location & Entry Fee
Dates: 2026 జనవరి 8వ తేదీ నుంచి జనవరి 10 వరకు – మూడు రోజుల పాటు
Location: విజయవాడ – భవానీ ఐలాండ్, పున్నమి ఘాట్
Entry Fee: ఉచితం
కుటుంబంతో కలిసి వెళ్లడానికి, టూరిస్టులు, విద్యార్థులు, కళాకారులు — అందరికీ ఈ ఈవెంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
ఈ ఈవెంట్లో ఏం చూడొచ్చు ?
Highlights of the Avakai Festival
చాలా మంది దీనిని ఒక సినిమా ఈవెంట్ అని అనుకుంటున్నారు. మీరు కూడా అలాగే అనుకుంటే, ఇది తప్పకుండా చదవండి. మీరు అనుకునే దాంట్లో నిజం కూడా ఉంది. ఆ నిజాలను ముందు చదవండి… తరువాత మరో కోణం గురించి…
సినిమా లవర్స్ కోసం ఇక్కడ తెలుగు సినిమా జర్నీ గురించి డిస్కషన్స్ జరుగుతాయి. స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్స్, సినిమా కల్చర్‌కు సంబంధించిన చర్చలు జరుగుతాయి.
వీటితో పాటు సాహిత్యం, పుస్తక ప్రేమికుల కోసం
- రచయితల సమావేశాలు
- తెలుగు సాహిత్య సెషన్స్
- మోడర్న్ స్టోరీ టెల్లింగ్ Vs ట్రెడిషనల్ సాహిత్యంపై చర్చలు జరుగుతాయి.
- ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం స్టోరిస్ కోసం క్లిక్ చేయండి

సంగీతం, థియేటర్ | Music & Theatre
సంగీత అభిమానులు, థియేటర్ ఆడియెన్స్ కోసం లైవ్ పెర్ఫార్మెన్సులు, ఫోక్ & కాంటెంపరరీ మిక్స్‌తో జరిగే ప్రదర్శనలు, రంగస్థల ప్రదర్శనలు, వివిధ ప్రయోగాత్మక కార్యక్రమాలు జరుగుతాయి.
యువ క్రియేటర్ల కోసం | For Young Creators
యువ క్రియేటర్స్ కోసం వర్క్‌షాపులు జరుగుతాయి. క్రియేటివ్ టాక్స్, వివిధ కళా రూపకాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మొత్తానికి ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులు ఎలా ప్లాన్ చేసుకోవాలి ?
How travellers should plan Amaravati Avakai Festival
ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ టైమ్‌ను బట్టి ఇక్కడ మీరు సగం రోజు స్పెండ్ చేసేలా ప్లాన్ చేయవచ్చు. లేదంటే మీరు పూర్తి రోజు కూడా స్పెండ్ చేయవచ్చు.
- భారతీయ రైల్వే తాజా సమాచారం కోసం క్లిక్ చేయండి.
Avakai Festival – Half Day Plan
సగం రోజులో ఈవెంట్స్ కవర్ చేయాలంటే ఈ ప్లాన్ చెక్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి.
మీరు విజయవాడలో ఇతర పనులు చేసుకుని ఈ ఈవెంట్స్ అటెండ్ చేయవచ్చు. దీని కోసం మీరు సాయంత్రం సమయంలో డైరెక్ట్‌గా పున్నమి ఘాట్‌కి వెళ్లండి. ఎందుకంటే కల్చరల్ ఈవెంట్స్ సాయంత్రమే ఎక్కువగా జరుగుతాయి.
నదీ తీరంలో సాయంత్రం సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఫ్యామిలీ, పెద్దలు, క్యాజువల్ విజిటర్స్‌కి కూడా ఈ ప్లాన్ సెట్ అవుతుంది.
Avakai Festival – Full Day Plan
తెలుగు సంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి అనుకుంటే…
మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవానీ ఐలాండ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోండి.
ఆ సమయంలో సాహిత్యం, ఇతర చర్చలు, క్రియేటివ్ సెషన్స్ నడుస్తాయి.
మధ్యాహ్నం చక్కగా భోజనం చేసుకుని
సాయంత్రం సమయంలో పున్నమి ఘాట్ చేరుకోండి. ఈ సమయంలో…
- సంగీతం
- థియేటర్
- ఇతర ప్రదర్శనలు
అలాగే చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు.
ఇది విద్యార్థులకు, కళాకారులకు, సాహిత్యాభిమానులకు సెట్ అవుతుంది. అలాగే ఎవరైనా ట్రావెల్ వ్లాగర్లు ఉంటే, వారికి కూడా ఒక ఫుల్ వీడియో దొరుకుతుంది.
ఈ విషయాలు గుర్తుంచుకోండి
Simple rules to remember
టైమ్ ఉంటే భవానీ ఐలాండ్‌తో పాటు పున్నమి ఘాట్ వెళ్లండి. లేదంటే సాయంత్రం మీ పనులు పూర్తి చేసుకుని పున్నమి ఘాట్ వెళ్లినా సరిపోతుంది.
ఎలాంటి హడావిడి లేకుండా, ప్రెషర్ లేకుండా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫెస్టివల్‌ను ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. Have Fun
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
