Red River of India: అసలు ఈ నదిని రెడ్ రివర్ ఎందుకు అంటారు?
Red River of India: భారత దేశంలో ఎన్నో రివర్స్ ఉన్నాయి. కానీ కొన్ని నదులు కేవలం నీటిని మాత్రమే కాదు, ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, ప్రకృతితో స్ట్రాంగ్ కనెక్షన్ కలిగి ఉంటాయి. అలాంటి గొప్ప నదుల్లో బ్రహ్మపుత్ర కూడా ఒకటి. బ్రహ్మపుత్ర నదిని కొన్ని సందర్భాల్లో రెడ్ రివర్ అని కూడా అంటారు.
బ్రహ్మపుత్ర నది జర్నీ టిబెట్‌లో ప్రారంభం అవుతుంది. టిబెట్‌లో దీనిని యార్లాంగ్ సాంగ్పో (Yarlung Tsangpo) అని పిలుస్తారు. హిమాలయాలను దాటుకుంటూ భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యాక, దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అక్కడి నుంచి అస్సాం మీదుగా ప్రయాణించి బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది.
బ్రహ్మపుత్ర నది స్పెషాలిటీ ఏంటి అంటే అస్సాంకి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చిన నేచురల్ ఫోర్స్ ఇది. నది చుట్టూ కనిపించే పచ్చని అడవులు, ద్వీపాలు, వెట్‌ల్యాండ్స్, హిమాలయన్ పాద ప్రాంతాలు కలిసి ఒక అద్భుతమైన సీనరీని క్రియేట్ చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Gulmarg: భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide
ఇక రెడ్ రివర్ అనే పేరు విషయానికి వస్తే, నది నీటిలో కనిపించే ఎరుపు రంగే దీనికి కారణం. హిమాలయాల నుంచి భారీ స్థాయిలో వచ్చే సెడిమెంట్స్, మట్టి, ఖనిజాలు నదిలో కలుస్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నదీ నీరు ఎర్రగా లేదా మట్టిగా కనిపిస్తుంది.
బ్రహ్మపుత్ర అస్సాంకి కేవలం ఒక నది మాత్రమే కాదు. స్థానిక ప్రజల జీవితం కూడా. వ్యవసాయం, చేపలు పట్టడంలో ప్రజలకు ఉపయోగపడటంతో పాటు ఇక్కడి కల్చర్‌తో కూడా ఈ నదికి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. నదీ లోయలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల జీవితం కూడా ఈ నదితో పాటు కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది.
బ్రహ్మపుత్ర నదీ జర్నీలో మజూలీ (Majuli Island) అనే ప్రముఖ నది ద్వీపం కూడా ఒక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం అస్సాం కల్చర్, ట్రెడిషన్స్, నేచురల్ బ్యూటీకి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
హిమాలయాల నుంచి ప్రారంభమై, అస్సాం మైదానాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ వరకు ప్రయాణించే బ్రహ్మపుత్ర నది జర్నీ నిజంగా అద్భుతంగా ఉంటుంది. అందుకే రెడ్ రివర్ అనే పేరుతో భారతీయ భౌగోళిక అద్భుతాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
