Harita Hotels లో భారీ మార్పులు.. స్టార్ హోటల్ ప్రమాణాలకు TGTDC ఫోకస్
Harita Hotels : తెలంగాణలోని హరిత హోటళ్లను మరింత నాణ్యమైన స్టే ఆప్షన్లుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) చర్యలు చేపడుతోంది. టూరిస్టులకు బెటర్ స్టే, పరిశుభ్రమైన వాతావరణం, క్వాలిటీ ఫుడ్, బెస్ట్ సర్వీసెస్ అందించడంపై ఫోకస్ పెడుతోంది.
అందులో భాగంగా TGTDC మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి పూజారి (Gautami Pujari) రాష్ట్రంలోని పలు హరిత హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. చెకింగ్‌లో భాగంగా హోటళ్లలోని రూమ్స్, రెస్టారెంట్లు, కిచెన్, ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, సేవా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.
హరిత హోటళ్లను (Harita Hotels Telangana) కేవలం స్టే ఆప్షన్లుగా మాత్రమే కాదు, మెరుగైన ఆతిథ్య అనుభవాన్ని అందించే ఆధునిక వసతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనుకుంటోంది TGTDC. అందుకోసం స్టార్ హోటల్స్‌లో ఇప్పటికే అమలులో ఉన్న బెస్ట్ స్టాండర్డ్స్‌ను ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు.
కిచెన్‌లో సీసీటీవీ | CCTV In Kitchen
హరిత హోటళ్ల వంటశాలల్లో ఆహార తయారీ, పరిశుభ్రత, సిబ్బంది కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు CCTV ఆధారిత ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు TGTDC తెలిపింది. ఇందులో భాగంగా వికారాబాద్ హరిత హోటల్ యూనిట్ మేనేజర్‌పై శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు.
ప్రత్యేక విజిలెన్స్ బృందాలు
హరిత హోటళ్లలో నాణ్యత, పరిశుభ్రత, రూమ్ మేనేజ్మెంట్, సర్వీస్ స్టాండర్డ్స్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ బృందాలు హోటళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోనున్నాయి.
- ఇది కూడా చదవండి : రామప్ప ఆలయం గురించి తెలుగు వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఆన్లైన్లో సులభమైన బుకింగ్ | Easy Booking
పర్యాటకులకు బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు హరిత హోటళ్లలో పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.
దీంతో గదుల లభ్యతను ఆన్లైన్లో తెలుసుకుని, మరింత సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం కలగనుంది.
పర్యాటకులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతి, సులభమైన బుకింగ్‌తో పాటు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా హరిత హోటళ్లను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు TGTDC తెలిపింది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
