తెలంగాణలో 13 హైటెక్ బస్టాండ్లు.. ప్రయాణికులకు కొత్త అనుభవం | TGSRTC Hitech Bus Stations
TGSRTC Hitech Bus Stations : తెలంగాణలో 13 ప్రాంతాల్లో TGSRTC కొత్త హైటెక్ బస్టాండ్లను ఏర్పాటు చేయనుంది. Integrated Transit, Shopping, Food Courts, Entertainment Zones వివరాలు తెలుసుకోండి.
బస్టాండ్ రూపం మారనుంది
New Look for Bus Stations
తెలంగాణలో బస్సు ప్రయాణం చేసే వారికి రాబోయే రోజుల్లో బస్టాండ్ అనుభవం మారనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 13 ప్రాంతాల్లో కొత్త తరహా బస్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది.

సాధారణ బస్టాండ్ తరహాలో కాకుండా, ప్రయాణంతో పాటు ఇతర రవాణా మార్గాలు, వాణిజ్య కార్యకలాపాలు, ఆహారం, వినోదానికి సంబంధించిన సదుపాయాలను ఒకే ప్రాంగణంలో అందించే విధంగా వీటిని రూపొందించనున్నారు.
ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి అనుమతులు లభించినట్లు TGSRTC తెలిపింది.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
13 ప్రాంతాల్లో కొత్త బస్టాండ్లు
13 Proposed Locations
TGSRTC అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం కొత్త హైటెక్ బస్ స్టేషన్లు ఏర్పాటు కానున్న ప్రాంతాలు …
- నాగర్కర్నూల్
- రేగొండ
- హుజూర్ నగర్
- కోదాడ
- కొడంగల్
- కోస్గి
- మద్దూరు
- కేసముద్రం
- హుస్నాబాద్
- ములుగు
- మధిర
- నల్గొండ
- కొత్తగూడెం
ఇవి ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాంతాలు. ప్రయాణికులు ఈ పట్టణాలకు వెళ్లినప్పుడు భవిష్యత్తులో బస్టాండ్ అభివృద్ధి ఎలా మారుతుందో గమనించవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ విధానం
Integrated Transit System
ఈ ప్రాజెక్టులో ప్రధానంగా Integrated Transit System అంశంపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలి అంటే బస్సు జర్నీకి ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేసే విధానం.
కొత్త బస్ స్టేషన్లలో బస్సు నుంచి ఇతర రవాణా మార్గాలకు సులభంగా మారే అవకాశం కల్పించాలన్నది ప్రణాళికలో భాగం. రైల్వేతో పాటు ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం ఉండేలా వీటిని రూపొందించనున్నట్లు TGSRTC పేర్కొంది.
షాపింగ్, ఫుడ్ కూడా ఒకే చోట
Shopping and Food Facilities
కొత్త బస్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం వాణిజ్య ప్రదేశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వ్యాపారం చేసే వారికి, ఇతర వ్యాపార సంస్థలకు ఈ Commercial Space కేటాయించే అవకాశం ఉంటుంది.
- అలాగే Food Courts, Gaming, Entertainment Zones వంటి సదుపాయాలను కూడా ప్రణాళికలో చేర్చినట్లు సంస్థ తెలిపింది.
- దీంతో ప్రయాణికులు బస్సు కోసం (Telangana Bus Stations) ఎదురుచూసే సమయంలో ఫుడ్ అండ్ యాక్టివిటీస్ వంటి సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఈ అప్డేట్లో హైలైట్స్…
- ఒకే ప్రదేశంలో బస్సు, ఇతర రవాణా మార్గాల అనుసంధానం.
- ప్రయాణికుల కోసం ఆధునిక సదుపాయాలతో బస్ స్టేషన్ నిర్మాణం.
- Commercial Space ద్వారా షాపులు, వ్యాపార కార్యకలాపాలకు అవకాశం.
- Food Courts, Gaming, Entertainment Zones వంటి సదుపాయాల ప్రతిపాదన.
- తెలంగాణలోని 13 ప్రాంతాల్లో ఈ తరహా బస్ స్టేషన్ల ఏర్పాటు.
- ప్రయాణికులతో పాటు స్థానిక వ్యాపారులకు కూడా కొత్త అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశం.
టూరిస్టులకు దీని వల్ల ఏం ఉపయోగం?
Why Tourists Should Care
తెలంగాణలోని వివిధ పట్టణాలకు బస్సుల్లో వెళ్లే పర్యాటకులకు బస్టాండ్ ఒక ముఖ్యమైన Transit Point. ముఖ్యంగా ఒక పట్టణం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో ట్రైన్ నుంచి బస్సుకు మారడం లేదా బస్సు నుంచి రైల్వే స్టేషన్కు చేరుకోవడం, ఆహారం లేదా కొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు సాధారణం.
ఈ ప్రతిపాదిత మోడల్ అమల్లోకి వస్తే, ప్రయాణికుల అవసరాలను ఒకే ప్రాంగణంలో తీర్చే విధంగా బస్టాండ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇవి ప్రతిపాదిత సదుపాయాలే. నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి కేంద్రంలో ఏ సౌకర్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేం.

ఈ హైటెక్ బస్టాండ్లను ఎక్కడ చూడొచ్చు?
Where Can Travellers See Them?
ప్రస్తుతం TGSRTC ప్రకటించిన 13 ప్రాంతాలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రదేశాలు. నాగర్కర్నూల్ నుంచి కొత్తగూడెం వరకు వివిధ పట్టణాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి అని అధికారులు వెల్లడించారు.
అందువల్ల ప్రస్తుతం ప్రయాణికులు కొత్త హైటెక్ బస్టాండ్లను సందర్శించగలరని చెప్పడం సరైంది కాదు. నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాతే వాటిని ఉపయోగించగలరు.
తరచుగా అడిగే ప్రశ్నలు
Frequently Asked Questions
1. తెలంగాణలో ఎన్ని హైటెక్ బస్టాండ్లు ఏర్పాటు చేయనున్నారు?
TGSRTC ప్రకారం 13 ప్రాంతాల్లో కొత్త హైటెక్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
2. ఈ బస్టాండ్లలో షాపులు ఉంటాయా?
Commercial Space కేటాయించే ప్రణాళిక ఉంది. ఆసక్తి ఉన్న వ్యాపారులు TGSRTC యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది.
3. నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
Press Release ప్రకారం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ఖచ్చితమైన ప్రారంభ తేదీని ప్రకటనలో పేర్కొనలేదు.
Source : TGSRTC Officials
వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
