అరకు నుంచి వంజంగి ఎంత దూరం ? బెస్ట్ రూట్, ట్రావెల్ టైమ్ | Araku To Vanjangi Distance
Araku To Vanjangi Distance : అరకు నుంచి వంజంగి sunrise view చూసేందుకు వెళ్తున్నారా? మరి దూరం ఎంత? బెస్ట్ రూట్ ఏంటి? ట్రావెల్ టైమ్, ఫాగ్ కండిషన్, వెహికల్ ఆప్షన్స్ మీ కోసం.
Araku To Vanjangi Distance ఎంత ఉందో తెలుసుకుని ట్రిప్‌ని ఈజీగా ప్లాన్ చేయండి. రూట్, టైమ్, రోడ్ రియాలిటీ అన్నీ ఒక్క చోటే.
అరకు నుంచి వంజంగి ఎంత దూరం | Araku to Vanjangi Distance
Araku to Vanjangi Distance : అరకు నుంచి వంజంగి సుమారు 27–30 కిమీ (27–30 KM) దూరంలో ఉంటుంది. వంజంగి అనేది ఒక గ్రామం. ఇది అరకు లోయకు చేరువలో ఉంటుంది. ఇది మెయిన్‌గా sunrise view point కోసం ఫేమస్. అరకులో స్టే చేస్తున్న ప్రయాణికులకు తక్కువ దూరంలో నేచర్ ఎక్స్‌పీరియెన్స్ కావాలంటే వంజంగి మంచి ఆప్షన్.
సాధారణంగా అరకు నుంచి వంజంగి రీచ్ అవ్వడానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుంది. పొద్దున్నే fog, ఘాట్ రోడ్లు, టర్నింగ్స్ వల్ల ప్రయాణం కాస్త ముందూ వెనకా అవ్వొచ్చు.
ఎంత దూరం | Distance Overview
| విషయం | వివరం |
| దూరం | 27–30 KM |
| సమయం | 1.5 నుంచి 2 గంటలు |
| బెస్ట్ రూట్ | Araku – Paderu Road |
| రోడ్డు పరిస్థితి | బాగానే ఉంటుంది, కొన్ని rough stretches ఉంటాయి |
| సెట్ అయ్యే వాహనాలు | బైక్, కారు, జీప్, కొంత మంది ఆటోలో కూడా కొండ పాదం వరకు వెళ్తారు |
నార్మల్‌గా చెప్పాలంటే సుమారు 27 KM దూరం ఉంటుంది. ఫాగ్ వల్ల స్పీడ్ తగ్గితే దూరం పెరగదు కానీ టైమ్ పెరుగుతుంది.
అరకు వంజంగి దారి ఎలా ఉంటుంది | Araku to Vanjangi Route Details
ఈ రూట్ అనేది సాధారణంగా అందరూ ఫాలో అయ్యే రూట్.
Araku Valley – Paderu Road – Vanjangi Village
అరకు నుంచి పాడేరు వరకు రోడ్డు కండిషన్ బాగానే ఉంటుంది. మలుపులు, అడవులు, ఉదయమే చిన్నపాటి మంచు సాధారణమే. చివరి 5–6 KM లో రోడ్డు చిన్నగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై గుంతలు, rough patches ఉంటాయి. స్లోగా వెళ్లాలి.
- ఇది కూడా చదవండి : Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
సొంత వాహనం లేకపోతే Araku లో local jeep booking options కూడా ఉంటాయి. గ్రూప్‌గా sunrise ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అంటే జీప్ కన్వీనియెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఫాగ్‌లో ప్రయాణం పెట్టుకుంటే జీప్ బెస్ట్.
Google Maps లో “Vanjangi Sunrise View Point” అని సెర్చ్ చేస్తే సరైన రూట్ చూపిస్తుంది. పొద్దున్నే విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. అందుకే headlights కరెక్ట్‌గా యూజ్ చేయండి.
ఎప్పుడు వెళ్లాలి ? | Vanjangi Best Time and Travel Tips
అరకు నుంచి వంజంగి వెళ్లేందుకు లేదా వంజంగి ట్రిప్ కోసం October నుంచి February బెస్ట్ టైమ్. ఈ సమయంలో ఫాగ్, చిన్నపాటి మంచు ఎంజాయ్ చేయవచ్చు. ఉదయం సమయంలో temperature 5–8°C వరకు చేరుకుంటుంది.

మీతో పాటు winter jacket లేదా muffler ఉంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. బైక్‌పై వెళ్లే వాళ్లు ఫాగ్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
Sunrise ప్లాన్ చేస్తే ఒక రోజు ముందే Paderu లో స్టే ప్లాన్ చేయండి. లేదంటే Araku లో అయినా స్టే ప్లాన్ చేయాలి. మీతో పాటు water bottles, snacks తీసుకెళ్లండి.
గుర్తుంచుకోండి ఉదయం 2.30 AM – 3.00 AM మధ్యలో Araku నుంచి స్టార్ట్ అవ్వాలి. Paderu లో ఉంటే 4.00 – 4.15 AM కు స్టార్ట్ అవ్వొచ్చు. అప్పుడే మీరు Vanjangi sunrise point కి టైమ్‌కు చేరుకోగలరు.
సాధారణ ప్రశ్నలు | FAQs
అరకు నుంచి వంజంగి దూరం ఎంత? | Araku to Vanjangi Distance
అరకు నుంచి వంజంగి సుమారు 27–30 KM దూరంలో ఉంటుంది. రూట్‌ను బట్టి కొంచెం మారవచ్చు.
బైక్‌పై వంజంగి వెళ్లడం సేఫా? | Is it safe to travel Vanjangi by bike?
సేఫే, కానీ పొద్దున్నే వెళ్తే ఫాగ్‌లో స్పీడ్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్.ఫ్యామిలీతో కలిసి వంజంగి
ట్రావెల్ చేయవచ్చా? | Can families visit Vanjangi?
చేయవచ్చు. కారు లేదా జీప్ బెస్ట్. త్వరగా వెళ్లి వచ్చేలా ప్లాన్ చేయండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
