ఆత్రేయపురం, కోనసీమ సంక్రాంతి ట్రావెల్ గైడ్ 2026 | Atreyapuram, Konaseema Sankranti Travel Guide
Atreyapuram, Konaseema Sankranti Travel Guide : సంక్రాంతి అంటే కోనసీమ గుర్తొస్తుందా చాలా మందికి. ఈ గైడ్లో మీకు ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
ఏం చూడాలి?, ఎక్కడ ఉండాలి?, అనే ప్రశ్నలకు సమాధానంతో పాటు ప్రాక్టికల్ టిప్స్ కూడా ఉంటాయి.
సంక్రాంతి అంటే ఆత్రేయపురం, కోనసీమ విజిట్ చేయడానికి పెర్ఫెక్ట్ టైమ్. ఇక్కడ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ బోట్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్. గోదావరి బ్యాక్ వాటర్స్‌లో జరిగే ఈ వేడుక అనేది అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ గైడ్లో మీకు ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
ఏం చూడాలి?
ఎక్కడ ఉండాలి?
అనే ప్రశ్నలకు సమాధానంతో పాటు ప్రాక్టికల్ టిప్స్ కూడా ఉంటాయి.
సో మీకు స్మూత్ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం అందించేందుకు ఇది ఒక టూల్‌గా ప్రతీ సంవత్సరం ఉపయోగపడుతుంది.
- ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం స్టోరిస్ కోసం క్లిక్ చేయండి
ముఖ్యాంశాలు
సంక్రాంతికి కోనసీమ ఎందుకు వెళ్లాలి? |
Why Visit Atreyapuram & Konaseema?
కోనసీమ అండ్ సంక్రాంతి అనే కాంబినేషన్ ఆంధ్రా ప్రజలకు మాత్రమే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పుడు బాగా నచ్చుతోంది. అందుకే చాలా మంది తెలంగాణ ప్రజలు సంక్రాంతికి కోనసీమ వెళ్తున్నారు. తెలిసినవాళ్లు ఉంటే వారి వద్దకు, లేదంటే ఈ మధ్య కోనసీమ సంక్రాంతి వేడుకల ప్యాకేజీలు కూడా వచ్చాయి. అందులో ఏదోక ప్యాకేజీలో వెళ్తున్నారు.
ఆత్రేయపురం స్లోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. దీని యూనిక్ బోట్ ఫెస్టివల్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే కోడి పందాలు, ఇతర కార్యక్రమాల వల్ల ఇక్కడికి చాలా మంది సంక్రాంతి సమయంలో ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లగలిగే 7 డెస్టినేషన్స్
కోనసీమలో పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, గోదావరి బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ చలికాలంలో ఒక సినిమాటిక్ ఫీల్‌ను ఇస్తాయి. పైగా ప్రతీ ఊరు చుట్టాలతో కళకళలాడుతుంది.
ఎందుకు వెళ్లాలో చెప్పే 7 కారణాలు
- సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ బోట్ ఫెస్టివల్ అనేది ఇక్కడ ప్రధాన ఆకర్షణ
- బ్యాక్ వాటర్ టూర్లతో పాటు చిన్నపాటి బోటు రైడ్లు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు
- అదే సమయంలో కోనసీమ అందాలను కెమెరాల్లో క్లిక్ చేసి షేర్ చేసేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు
- ఉదయం వేళలో గ్రామాల అందాలను చూసి మనసు, స్థానిక బ్రేక్‌ఫాస్ట్‌తో ఆకలి నింపేసుకునే వారు అనేకం

- స్థానిక ఆలయాల్లో దైవ దర్శనం, కల్చర్‌ను మరింత డీప్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం
- ప్రతీ ఊరికో విధానం, ఆచారం ఉంటుంది. వాటిని గమనించడం
- కోనసీమ రుచులను హోటల్లో కాకుండా కోనసీమ ఇళ్లలో రుచి చూసే వాళ్లు కూడా ఉన్నారు
- ఇది కూడా చదవండి :అరకు నుంచి వంజంగి ఎంత దూరం ? బెస్ట్ రూట్, ట్రావెల్ టైమ్ | Araku To Vanjangi Distance
- ఇది కూడా చదవండి : Vanjangi 2025 : 5:30AM సీన్ మిస్సయితే = ట్రిప్ ఫెయిల్ | Complete Travel Guide
- ఇది కూడా చదవండి : Araku Trip Cost : అరకు వెళ్లాలి అంటే జేబులో ఎంత ఉండాలి ? ₹5000 లో వెళ్లిరావచ్చా ?
ఎప్పుడు వెళ్లాలి? | Atreyapuram, Konaseema Sankranti Travel Guide
Best Time to Visit
కోనసీమ వెళ్లేందుకు బెస్ట్ టైమ్ జనవరి నెల. మరీ ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ప్రతీ గ్రామం ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోతుంది. బోట్ ఫెస్టివల్, కల్చరల్ కార్యక్రమాలు, తొలిమంచు, పిల్లాపాపల కేరింతలు మొత్తంగా ఇక్కడి వైబ్ ఎంజాయ్ చేయడానికి జనవరిని మించిన టైమ్ లేదు.
సంక్రాంతితో పాటు ఓవరాల్‌గా చెబితే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే చలికాలంలో మీరు ఎప్పుడైనా కోనసీమ వెళ్లవచ్చు. వాతావరణం ప్రశాంతంగా, ప్లెజెంట్‌గా, పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఉక్కపోత చాలా తక్కువగా ఉంటుంది.
మార్చి నుంచి మే, జూన్ వరకు వెళ్లడం ఎవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎండలు దంచేస్తాయి. ఉక్కపోత మామూలుగా ఉండదు. ప్రయాణానికి అంత మంచి సమయం కాదు.
పీక్ సంక్రాంతి టైమ్ అంటే జనవరి 13, 14, 15, 16 తేదీల్లో ఇక్కడ ఉండేలా చూసుకుంటే కోనసీమను కోనసీమ అని ఎందుకంటారో తెలుస్తుంది.
ఒకవేళ సంక్రాంతికి మిస్ అయితే ఫిబ్రవరి వరకు ఎప్పుడూ వెళ్లినా సరిపోతుంది.
ఎలా చేరుకోవాలి? |
How to Reach Konaseema
By Road:
ముందుగా మీరు రాజమండ్రి లేదా కాకినాడకు చేరుకుని ట్యాక్సీ లేదా బస్సులో ఇక్కడికి చేరుకోవచ్చు.
By Train:
ట్రైన్లో అయితే దగ్గర్లో రాజమండ్రి లేదా కాకినాడ రైల్వే స్టేషన్ ఉంటుంది.
By Flight:
రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీలో ఆత్రేయపురం చేరుకోవచ్చు.
Local Transport:
స్థానికంగా లోకల్ ట్యాక్సీలు, షేరింగ్ ఆటోలు, సైకిల్ రిక్షాలు, లోకల్ బోట్స్ కూడా ఉంటాయి.
Hyderabad to Atreyapuram (Konaseema) distance సుమారు 444 కిలోమీటర్లు.
ఎక్కడ ఉండాలి? |
Where to Stay
కోనసీమ ప్రాంతాల్లో మంచి స్టే ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో కంఫర్టబుల్ లాడ్జీలు, హోటళ్లు ఉన్నాయి.ఆత్రేయపురంలో గెస్ట్ హౌజులు, హోమ్‌స్టేల్లో ఉంటే ఆథెంటిక్ విలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు.
ఈ యాక్టివిటీస్ ట్రై చేయండి |
Things to See and Do in Konaseema
కోనసీమకు మీరు సంక్రాంతి సమయంలో వెళ్తే ఇక్కడి బోట్ రేసులు, ఫెస్టివల్స్ చూడొచ్చు. బోట్లను చాలా అందంగా ముస్తాబు చేసే ప్రక్రియను చూసినా పైసా వసూల్ అవుతుంది. అలా అలంకరించుకున్న బోట్లు గోదావరిలో వెళ్తుంటే చూడటం కూడా ఒక అనుభవమే.
మీకు మిగతావారిలా పందాలు, జాతరలు, పార్టీలు ఇష్టం లేకపోతే సరదాగా ఊరు మొత్తం తిరగండి. బండికి ఆర్సీ, మీకు లైసెన్స్, ట్యాంకులో పెట్రోలు ఉంటే అలా నాలుగు ఊర్లు చూసేయొచ్చు. ప్రతీ ఊరికి ఒక కల్చర్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అది గమనించండి.
పొద్దున్నే స్నానం చేసి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లండి. గుడి చిన్నదా పెద్దదా అని చూడకండి. దండం పెట్టుకుని దేవుడా ఈ అనుభవాన్ని ఆస్వాదించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ అని చెప్పండి.
సూర్యోదయానికి ముందే లేచి సన్‌రైజ్ కోసం సిద్ధం అవ్వండి. మంచి ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయండి.
- ఇది కూడా చదవండి : అడవుల మధ్య పెరిగిన రంపచోడవరం విశేషాలు | Rampachodavaram Travel Guide
ఈ విషయాలు గుర్తుంచుకోండి
Tips
చలికాలం కోనసీమ వెళ్తే కంఫర్టబుల్‌గా ఉన్న కాటన్ దుస్తులు ధరించండి. మంచి షూస్ ఉండేలా చూసుకోండి. బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తే మంచినీరు, స్నాక్స్ లాంటివి క్యారీ చేయండి.
మీకు అక్కడి కల్చర్ అర్థం కాకపోతే లేదా ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే స్థానికుల సాయం తీసుకోండి.
మీ రోజును ఇలా ప్లాన్ చేసుకోండి |
Sample 1-Day Itinerary for konaseema
ఉదయం 7 గం.: ఆత్రేయపురం చేరుకోండి. సరదాగా ఊరు మొత్తం తిరగండి.
ఉదయం 10 గం.: బోట్ ఫెస్టివల్ అటెండ్ అవ్వండి.
లంచ్ సమయంలో లోకల్ ఆత్రేయపురం రుచులను ఆస్వాదించండి.
లంచ్ తరువాత బ్యాక్ వాటర్‌లో బోట్ రైడ్ చేయండి లేదా ఫోటోగ్రఫీ ఎంజాయ్ చేయండి.
సాయంత్రం రాజమండ్రి చేరుకుని అక్కడే నైట్ స్టే చేయండి లేదా రిటర్న్ బస్సు క్యాచ్ చేయండి.
పనికొచ్చే చిట్కాలు |
Practical Tips
కోనసీమకు సంక్రాంతి సమయంలో వెళ్లాలి అనుకుంటే ముందస్తు బుకింగ్ చేసుకోండి. వీలైతే జనవరి 13 తేదీకి వచ్చేలా ప్లాన్ చేసుకోండి.
నవంబర్ నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎప్పుడైనా కోనసీమ రావచ్చు. వస్తే మాత్రం ఒకటి రెండు రోజులు ప్రశాంతంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
