నాంపల్లిలో జరిగే నుమాయిష్‌కు ప్రతీ సంవత్సరం జనవరి 31వ తేదీన చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా సెలబ్రేట్ చేస్తారు. అందులో భాగంగా పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. వారికి ఎలాంటి టికెట్ తీసుకునే ( Childrens Day at Numaish 2025 ) అవసరం లేదు. మరి నుమాయిష్ టైమింగ్ ఏంటి ? ఏజ్ లిమిట్, చిల్డ్రన్స్ స్పెషల్ డే రోజు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుందామా ?
హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతీ ఏడాది అఖిల భారత వాణిజ్య ( All India Industrial Exhibition ) ప్రదర్శన జరుగుతంది. దీనిని నుమాయిష్ అని కూడా పిలుస్తుంటారు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు ప్రతీ సంవత్సరం ఈ ప్రదర్శన జరుగుతుంది. అయితే ఈసారి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది.
నాంపల్లిలో జరిగే నుమాయిష్‌కు ప్రతీ సంవత్సరం జనవరి 31వ తేదీన పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. అంటే వారికి ఎలాంటి టికెట్ తీసుకునే అవసరం లేదు. మరి నుమాయిష్ టైమింగ్ ఏంటి ? ఏజ్ లిమిట్, చిల్డ్రన్స్ స్పెషల్ డే రోజు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుందామా ?
ముఖ్యాంశాలు
నుమాయిష్ అంటే ఏంటి ? | Numaish Meaning
నుమాయిష్ అనేది ఒక ఉర్దూ పదం. ఆ పేరు ఎందుకు పెట్టారో ఈ పోస్టు పూర్తిగా చదివితే మీకే అర్థం అవుతంది. ఇక ఈ పేరు విషయానికి వస్తే నుమాయిష్ అంటే ప్రదర్శన అని అర్థం వస్తుంది. హైదరాబాద్ నిజాం సంస్థానంలో ( Hyderabad Statehood ) భాగంగా ఉన్న సమయంలో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం అయింది. కాబట్టి అప్పట్లో దీనిని నుమాయిష్ అని క్యాజువల్‌గా పిలిచేవారు. ఇప్పుటికీ చాలా మంది అదే పేరుతో పిలుస్తుంటారు.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుమాయిష్ చరిత్ర, ఎప్పుడు వెళ్లాలి ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ఇంఫర్మేషన్ | Hyderabad Numaish 2025
నుమాయిష్ ఎవరు మొదలుపెట్టారు ? | Who Started Hyderabad Numaish
Did you know the title Nizam literally means ‘order’ in Arabic?
— Murali Duggineni (@NarrativeNest) April 6, 2024
Today marks the birth anniversary of Mir Osman Ali Khan, the Seventh and the last reigning Nizam of Hyderabad. Here’s a small thread on him. pic.twitter.com/ngGXrTPP7h
నుమాయిష్ కథ 1938లో మొదలవుతుంది. అప్పట్లో కేవలం 50 స్టాల్స్‌తో దీనిని ప్రారంభించారు. హైదారాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ( Last Nizam Of Hyderabad ) దీనిని ప్రారంభించారు. స్థానిక కళాకారులను, వారి ఉత్పత్తులను ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో ఆయన ఈ ప్రదర్శనను మొదలుపెట్టారు.
అయితే నుమాయిష్ మొదలైన తొలినాళ్లలో ఈ ప్రదర్శన పబ్లిక్ గార్డెన్‌లో జరిగేది. తరువాత దీనిని నాంపల్లిలో, ప్రస్తుతం ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించారు. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. కానీ నేటికీ నుమాయిష్ వైభవం ఏ మాత్రం తగ్గలేదు. 50 స్టాల్స్‌తో మొదలైన ఈ ప్రదర్శన నేడు 2400 స్టాల్స్ ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లింది. ప్రతీ ఏడాది ఇక్కడికి 20 లక్షల వరకు సందర్శకులు వస్తుంటారు.
- ఇది కూడా చదవండి : ఎక్స్ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park
పిల్లలకు ప్రత్యేకం | Special Events for Children

ఈ ఏడాది చిల్డ్రన్స్ డే సందర్బంగా నుమాయిష్‌లో జనవరి 31వ తేదీన పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. పిల్లల సందడికి తగిన విధంగా ఎగ్జిబిషన్‌లో ఏర్పాట్లు చేశారు.
- ఈ సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా ఇంటెరాక్టివ్ వర్క్ షాప్స్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పిల్లలు ఆర్ట్స్ డిజైనింగ్ వంటి యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు సొంతంగా వీటిని తయారు చేయవచ్చు.
- నుమాయిష్‌లో పిల్లల కోసం చాలా రైడ్స్ ఏర్పాటు చేశారు. ఫెర్రీస్ వీల్, మినీ రైడ్స్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఆడే అవకాశం ఉంటుంది.
- చిల్డ్రన్స్ స్పెషల్ డే ( Children’s Day In Numaish ) సందర్భంగా అద్భుతమైన డ్యాన్స్, మ్యూజిక్ షో వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇందులో పిల్లలు తమ ట్యాలెంట్‌ను చూపించే అవకాశం ఉంటుంది.
- ఈ రోజున పిల్లల కోసం కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇందులో పెయింటింగ్, రంగోలి డిజైన్, ఫ్లవర్ అరేంజ‌్‌మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటి వల్ల పిల్లలు తమ ట్యాలెంట్‌తో పాటు క్రియేటివిటీని ప్రపంచానికి చూపించే అవకాశం లభిస్తుంది.
- ఇది కూడా చదవండి : బ్యాగులు మోసేవాడు పురుషుడు సుమతి : నుమాయిష్‌లో బ్యాగులు మోసే భర్తల రీల్ వైరల్ | Men At Numaish
టైమింగ్, ఎంట్రీ ఫీ | Numaish Timing and Entry Fee
నుమాయిష్ అనేది నాంపల్లిలోని ఎగ్జిబిషన్ ( Nampall Exhibition 2025 ) గ్రౌండ్‌లో జరుగుతుంది. ఇది స్టాల్స్ నిర్వాహకుల కోసం రోజంతా తెరిచే ఉంటుంది. అయితే సందర్శకులను మాత్రం ఈ మైదానంలోకి సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల మధ్యలోనే అనుమతి ఇస్తారు. శనీ, ఆదివారాల్లో 11 గంటల వరకు నుమాయిష్ ఉంటుంది.
ఇక ఎంట్రీ ఫీజు ( Numaish Entry Fee ) : సాధారణ రోజుల్లో వ్యక్తికి రూ.50 చార్జ్ చేస్తారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఇక జనవరి 31న మాత్రం 14 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ కొనే అవసరం లేదు. డైరక్టుగా వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఇక సీనియర్ సీనియర్ సిటీజన్స్ కోసం, ప్రత్యేక అవసరాలు ఉన్నవారి కోసం ప్రత్యేేక ఏర్పాట్లు కూడా చేశారు.
పసందైన వంటకాలు | Culinary Delights

నుమాయిష్‌లో చాలా మంది షాపింగ్ కోసం మాత్రమే కాదు అక్కడి వెరైటి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు. మనం జాతరకు వెళ్లినప్పుడు ఎన్ని వెరటీ ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయో అన్నే వెరైటీ పదార్థాలు మనకు నుమాయిష్‌లో కనిపిస్తాయి. పోలిక కోసం చెప్పాను కానీ అంతకు మించి వెరైటీ డిషెస్ ఉంటాయి. ఇక్కడి ఫుడ్ కోర్టులో వివిధ రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్ ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : Experium Eco Park : 25,000 అరుదైన మొక్కలతో అలరిస్తున్న ఎక్స్ పీరియం పార్క్
- నుమాయిష్‌లోకి ఎంటర్ అవ్వగానే పిస్తా హౌజ్ ( Pista House ) రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు హలీమ్‌తో ( Haleem ) పాటు ఇంకా చాలా వెరైటీలు ట్రై చేయవచ్చు.
- ఇంకా పలు ఫుడ్ కోర్టుల్లో హైదరాబాదీ బిర్యానీ ( Hyderabad Biryani ), కబాబ్స్ ( Kebabs ) లభిస్తాయి.
- జిలేబి, ఐస్‌క్రీమ్స్, ఇంకా ఎన్నో ఎంజాయ్ చేయవచ్చు.
బయటి ప్రపంచం చూపించండి
చిల్డ్రన్స్ డే సందర్బంగా నుమాయిష్‌కు ( Hyderabad Exhibition 2025 ) కుటుంబంతో సహా కలిసి వెళ్లొచ్చు. చాలా స్కూల్స్ తమ పిల్లలను ఎగ్జిబిషన్‌కు తీసుకు వెళ్తుంటాయి. హైదరాబాద్ ఎగ్జిబిషన్ చరిత్ర, వివిధ రకాల యాక్టివిటీస్, సందడి వాతావరణం ఇవన్నీ పిల్లలకు బాగా నచ్చుతాయి.
Childrens Day at Numaish 2025 : దీంతో పాటు పిల్లలు ఇక్కడి స్టాల్స్‌ను సందర్శించి వివిధ రకాలు పరికరాలు, చేనేత వస్తువుల గురించి తెలుసుకోవచ్చు. బయటి ప్రపంచం ఎంత కమర్షియల్‌గా, ప్రాక్టికల్‌గా నడుస్తుందో పిల్లలకు కూడా అర్థం అవుతుంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.