మౌని అమవాస్య అంటే ఏంటి ? ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? | Mauni Amavasya 2025

షేర్ చేయండి

Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రికి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌనీ అమావాస్యను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈరోజున నదీలో లేదా పవిత్ర నదీ నీటితో స్నానం చేసినా ముక్తి లభిస్తుంది అని చాలా మంది నమ్మకం. నదీ స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

Mauni Amavasya Guide : మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా ( Maha Kumbh Mela 2025 ) జరుగుతున్న సందర్భంగా ఈ మౌని అమావాస్య పర్వదినం మరింత విశిష్టతను సంతరించకుంది. ఎందుకంటే పురాణాల ప్రకారం కుంభ మేళా సమయంలో వచ్చే ఈ అమావాస్యకు పలు విశిష్టతలున్నాయి. 

మౌని అమావాస్య ఎప్పుడు ? | When Is Mouni Amavasya 2025

మౌని అమాస్యను మన పూర్వికులకు, శ్రీమహావిష్ణువుకు అంకితం చేసినట్టు చెబుతారు. అయితే ఈ సారి వచ్చే ఈ అమవాస్య తేదీలపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. జనవరి 28వ తేదీన వస్తుందా లేక  29వ తేదీనా అని చాలా మంది సందేహపడుతున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఉజ్జయినికి ( Ujjaini- నెక్ట్స్ కుంభమేళా జరిగేది ఇక్కడే )  చెందిన అచార్య ఆనంద భరద్వాజ్.

మౌని అమావాస్య సమయం | Timings Of Mauni Amavasya 2025

వైదిక క్యాలెండర్ ప్రకారం 2025 జనవరి 25న సాయంత్రం 7.35 మౌని అమావాస్య ప్రారంభమై 29వ తేదీ సాయంత్రం 6.05 నిమిషాలకు ముగుస్తుంది. సో 28వ తేదీనా లేకా 29న అనే కన్‌ఫ్యూజన్‌కు కారణం ఏంటంటే ఈ సారి మౌని అమావాస్య రెండూ తేదీల మధ్యలో ఉండటం. అయితే టైమింగ్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. టైమింగ్ తెలుసుకుని 29వ తేదీ సాయంత్రం లోపు స్నానం చేసి పూజలు చేయాల్సి ఉంటుంది.

మౌని అమావాస్య రోజు ఏం చేయాలి ? | Things To Do on Mauni Amavasya

మౌని అమవాస్య రోజు ఏం చేయాలి అనే విషయాలపై చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. 

Mauni Amavasya 2025
| మౌని అంటే మౌనంగా ఉండటం | pHoto : Unsplash

1. ముందుగా మౌని అమవాస్య రోజు మౌనంగా ఉండాలి అనేది తెలుసుకోవాలి. నోటి నుంచి మాట రాకుండా మౌనంగా ఉండాలి. 

2.ఈ రోజున నదీ స్నానం చేయాలి.గంగా నది ( Ganga River ) లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది అంటారు. 

3. ఈ రోజున గంగామాతను, లక్ష్మీ దేవిని ఆరాధించడం శుభం అంటారు.

4.ఈ రోజున తమ పరిస్థితిని బట్టి పేదవారికి దానాలు చేయాలి. మిగిలిన దుస్తువులు, నువ్వులు, నల్లబట్టలు. దుప్పట్లు, నూనె, స్వెట్టర్, శాలువ, జాకెట్ లాంటి వేడిని కలిగించే బట్టలు దానం చేయవచ్చు.

5. ఈ రోజును శ్రీ మహా విష్ణువుకు అంకితం చేశారు కాబట్టి నువ్వులు, దీపాలు ఆయనకు అర్పించాలని ఆధ్యాత్మిక గురువులు, వేద పండితుల సూచన.

6. మౌని అమావాస్యను పెద్దరమావాస్య ( Peddala Amavasya ) అని కూడా అంటారు. పెద్దలు, పూర్వికుల ఆత్మ శాంతి కోసం పిండదానం, శ్రాద్ధ, జలసమర్ఫణ వంటివి చేయడం మంచిది అంటారు.

7. పెద్దరమావాస్య రోజున పూర్వికులు తమ వారిని కలవడానికి వస్తారని భక్తుల విశ్వాసం. అందుకే వారికి పిండదానం,తర్పణం వంటివి చేస్తే ఆశీర్వాదం లభిస్తుంది అంటారు.

8. సాయంకాలం సమయంలో తులసి కోట లేదా మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి.

9. సమస్త జగానికి శక్తిని ఇచ్చే సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.

10. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి

‘ఓం పితృ దేవతాయై నమః’

ఏం చేయకూడదు | Things Not To Do On Mauni Amavasya 

మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.

ఈ రోజున మాంసాహారం తీసుకోరాదు.

స్మోకింగ్, మద్యపానం తీసుకోరాదు

గొడవలు పడటం, నిందించడం చేయరాదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

Note : మౌని అమవాస్య సందర్భంగా ఇంటర్నెట్‌లో అందుబాటులో సమాచారాన్ని సేకరించి వాటిని ఆధారంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆధ్యాత్మిక గురువులు, పండితులను సంప్రదించగలరు. సమాచారాన్ని పున: పరిశీలించి పాటించగలరు.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!