తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.
బ్రిడ్జిని త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోడి ( PM Narendra Modi) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు మీకోసం …
ముఖ్యాంశాలు
తొలి వర్టికల్ లిఫ్టు బ్రిడ్జ్ | First Vertical Lift Bridge In India

కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి అనేది ఎన్నో అద్భుతాలకు నెలవు. రూ.531 కోట్లతో నిర్మించిన ఈ కొత్త బ్రిడ్జిలో వర్టికల్ లిఫ్టు బ్రిడ్జిని నిర్మించారు. భారత దేశంలో ఇలాంటి బ్రిడ్జి మరొకటి లేదు. నావలు, ఓడలు వెళ్లడానికి బ్రిడ్జిలో ఒక భాగాన్ని పైకి ఎత్తుతారు. అప్పుడు ఇది 72.5 మీటర్ల ఎత్తు వరకు చేరుకోగలదు.
- 2.1 కిమీ మేరా విస్తరించి ఉన్న ఈ వంతెనను 5 సంవత్సరాల కాలంలో నిర్మించారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన పనులు 2024 నవంబర్‌లో ముగిశాయి.
- పాల్క్ స్ట్రెయిట్ ప్రాంతం నుంచి నావలు, వెసల్స్ వస్తే ఎత్తడానికి బ్రిడ్జిలో ఒక భాగాన్ని ఎత్తే అవకాశం ఉంటుంది.
- Free Train Travel : కుంభమేళాకు ఉచితంగా రైలు ప్రయాణాన్ని అందిస్తున్న రాష్ట్రం ఏదో తెలుసా ?
అత్యాధునిక ఇంజినీరింగ్ ఫీచర్లు | Modern Engineering Features
పాత వంతెనతో పోల్చితే కొత్త రైల్వే బ్రిడ్జిలో ఎన్నో వినూత్నమైన, వైవిధ్యమైన ఫీచర్లు ఉన్నాయి:
- లిఫ్టింగ్ సదుపాయం : ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ ద్వారా నడిచే లిఫ్టు 5 నిమిషాల 30 సెకన్లలోనే అవసరమైనంత ఎత్తులోకి లెగుస్తుంది. దీంతో సముద్రంపై నడిచే నావలు బ్రిడ్జిని దాటి అవతలివైపు వెళ్లగలవు.
- పెరిగిన కెపాసిటీ : ఈ బ్రిడ్జిపై నుంచి ప్రతీ రోజూ 12 రైళ్లను గంటకు 75 కీమీ వేగంతో నడిపే విధంగా డిజైన్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ (Public Transport) మెరుగు అవుతుంది..
- నిర్వాహణ సామర్థ్యం: పాత పంబన్ బ్రిడ్జిలో లిఫ్టును ఎత్తాలంటే 16 మంది కూలీలను వినియోగించాల్సి వచ్చేది. కానీ కొత్త బ్రిడ్జిలో మనిషి శ్రమ అవసరం లేకుండా ఆటోమెటిగ్‌గా లిఫ్టు లేచే విధంగా టెక్నాలజీ వినియోగించారు.
- Mumbai Hyderabad Bullet Train : హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ …ఏ సంవత్సరం
మన్నికైనది

సముద్ర పర్యావరణానికి తగిన విధంగా కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు.ఈ కొత్త బ్రిడ్జి 100 ఏళ్ల వరకు కూడా చెక్కుచెదరకుండా అత్యాధునిక పరికరాలను వినియోగించారు :
- నిర్మాణ సామగ్రి: ఈ బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 3 లక్షల 38 వేల బస్తాల సిమెంటును వినియోగించారు. పటిష్టమైన నిర్మాణం కోసం 4500 మెట్రిక్ టన్నుల నిర్మాణ ఉక్కు, 5,772 మెట్రిక్ టన్నుల రీ ఇంఫోర్స్‌మెంట్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వినియోగించారు.
- తుప్పు నుంచి రక్షణ : ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఏ భాగం కూడా తప్పు పట్టకుండా ఉండేందుకు జింక్ మెటలైజింగ్ రెండు కోటింగ్లు వేయడంతో పాటు జింక్ రిచ్ ప్రైమర్ ఎపిలక్స్ తోపాటు మరింత భద్రత కోసం పాలిజైలాగ్జేన్‌ను వాడారు. ఈ వినూత్నమైన పెయింటింగ్ వల్ల 35 ఏళ్ల వరకు కూడా నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగదు.
- భవిష్యత్తు కోసం : ఈ వంతెనను భవిష్యత్తులో డబుల్ లైన్ అవసరం ఉంటే దానికి కూడా వినియోగించే విధంగా నిర్మించారు. ఎప్పుడైనా మరిన్ని రైల్వే సర్వీసులు అవసరం అయితే అప్పుడు అందుబాటులో ఉన్న డబుల్ లైన్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
చారిత్రాత్మక మార్పు | A Historical Transition

ప్రస్తుతం ఉన్న పాత పంబన్ (Old Pamban Bridge) బ్రిడ్జి స్థానంలో కొత్త పంబన్ బ్రిడ్జి రానుంది. అయితే ఒక సారి పాత బ్రిడ్జి గురించి తెలుసుకుందాం. ఈ బ్రిడ్జిని 1914 లో నిర్మించారు. ముందు మీటర్ గేజ్ ట్రాఫిక్ కోసం నిర్మించగా తరువాత దీన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చారు. ఈ బ్రిడ్జిపై చివరి రైలు 2022 లో నడిచింది.
- చివరి రైలుతో పాత బ్రిడ్జి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఇది వారసత్వ సంపదగా మాత్రమే మిగలనుంది.
- కొత్త రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) మరింత సురక్షితంగా, సమర్థవంతంగా రైల్వే ప్రయాణం కొనసాగనుంది.
- ఇక రైల్వే టికెట్లను క్యూార్ కోడ్ స్కాన్ చేసి కొనేయొచ్చు ! ఎలాగో తెలుసుకోండి !
స్థానికుల జీవితాల్లో కొత్త వెలుగు | Benefits of New Bridge
కొత్త రైల్వే బ్రిడ్జి (Pamban Railway Bridge) వల్ల స్థానికుల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకపై రామేశ్వరం నుంచి ప్రధాన భూభాగానికి మధ్య రవాణా అనేది మరింత సజావుగా సాగనుంది. దీంతో పర్యాటకం కూడా పుంజుకోనుంది. రవాణా చార్జీలు తగ్గుతాయి. స్థానిక వ్యాపారులు లాభపడతారు. ఇలా ఇరు ప్రాంతాల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది.
Pamban Bridge: featuring the historic structure alongside its modern iteration, illustrating the remarkable evolution from then to now.#IndianRailways #NewPambanBridge pic.twitter.com/QHKDJe2eMo
— Ministry of Railways (@RailMinIndia) February 10, 2025
ఆసక్తికరమైన విషయాలు | Facts About New Pamban Railway Bridge

- ఈ వంతెనపై ఉన్న వర్టికల్ లిఫ్ట్ స్పాన్ బరువు వచ్చేసి 660 మెట్రిక్ టన్నులు. దీనిని బ్యాలెన్స్ చేయడానికి 310 మెట్రిక్ టన్నుల కౌంటర్ వెయిట్స్ ఉపయోగించారు. మనం భవనాల్లో లిఫ్టులో ఉపయోగించే విధంగా అన్నమాట.
- ఈ వంతెన కోసం 3.38 లక్షల సిమెంట్ బస్తాలను వినియోగించారు. 4,500 ఉక్కు, 5,772 మె.ట. రిఇంఫోర్స్‌మెంట్ స్టీల్‌ను వినియోగించారు.
- ఈ వంతెన దాదాపు వందేళ్లు చెక్కుచెదరకుండా సేవలు అందిస్తుంది. దీనికి వేసిన రంగులు 35 ఏళ్ల వరకు చెదిరిపోవు.
- ఈ వంతెపై ప్రతీ రోజు 12 రైళ్లు రాకపోకలు సాగించవచ్చు.
- బ్రిడ్జిలో ఒక భాగాన్ని ఎత్తడానికి అప్పట్లో 16 మంది కూలీలు పని చేసేవారు. కానీ కొత్త బ్రిడ్జి ఎత్తడానికి మనుషులు అవసరం లేదు.
పాత పంబన్ బ్రిడ్జి అనేది కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానికి చేర్చింది. దాని స్థానంలో వచ్చిన కొత్త బ్రిడ్జి (New Pamban Bridge) కూడా అదే విధంగా కొత్త ఉత్సాహంతో భవిష్యత్తు సేవలు అందించేందుకు సిద్ధం అయింది.
భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనమైన ఈ బ్రిడ్జిని నిర్మించనడంలో యువ తెలుగు ఇంజినీర్ చక్రధర్ (Telugu Engineer Chakradhar) కీలక పాత్ర పోషించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన ఇంచార్జిగా పని చేశారు. నిజంగా ఇది తెలుగువారికి గర్వకారణం అని చెప్పవచ్చు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.