ఈ సంక్రాంతికి బర్డ్స్ & భక్తి కాంబినేషన్ ట్రై చేయండి | Flamingo Festival 2026 – TTD Combo Tour
Flamingo Festival 2026 – TTD Combo Tour : జనవరిలో పులికాట్ పింక్ అవ్వడానికి కారణం ఫ్లెమింగోలు. సంక్రాంతి ట్రావెల్ మూడ్, తిరుపతి దర్శనంతో పాటు కోస్తా ఆంధ్రా అందాలను వీక్షించే ఎవర్ గ్రీన్ Pulicat Travel Guide
ముఖ్యాంశాలు
జనవరి వస్తే ఆంధ్రా తీరం (Coastal Andhra) మొత్తం పండగలా బ్యూటిఫుల్‌గా మారిపోతుంది. ప్రజలు కూడా ప్రకృతి ఇచ్చే సిగ్నల్‌ను క్యాచ్ చేసి వేడుకలతో క్యాష్ చేసుకుంటారు.
మరీ ముఖ్యంగా పులికాట్ సరస్సు (Pulicat Lake) ప్రాంతం మొత్తం పింక్ రంగును పులుముకుంటుంది. వేలాది వలస పక్షులు అందులో మరీ ముఖ్యంగా ఫ్లెమింగోలు వచ్చి మరీ ఈ సీజన్‌కు స్పెషల్ టచ్ ఇస్తాయి. వాటిని చూసేందుకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది.
మరి ఈ సారి
Flamingo Festival విశేషాలు ఏంటో తెలుసకుందామా ?
నిజానికి ఈ ఫెస్టివల్ రెండు రోజులు మాత్రమే ప్రభుత్వం తరపున నిర్వహిస్తారు. కాని ఇది రెండు రోజుల ఫెస్టివల్ మాత్రమే కాదు. ఇది చలికాలం మొత్తం సాగే నేచురల్ వేడుక.
సంక్రాంతి ట్రావెల్ మూడ్‌లో, TTD దర్శన ప్లానింగ్‌లో ఎక్కడో చోట అవకాశం ఉంటే ఫ్లెమింగోలకు ఒకసారి హాయ్ చెప్పేయండి. Let’s Flamin GO!
పులికాట్ ప్రాంతంలో జనవరి అంటే పక్షుల పండగ
January at Pulicat Is a Bird Festival

ఫ్లెమింగోలు పులికాట్‌కు రావడం ఒకటే కాదు. జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రాంతాల్లో ఈ పక్షులు తమ అందాలు, హడావిడితో ట్రైలర్ లేకుండానే సినిమాలు చూపించి పక్షి ప్రేమికులను అలరిస్తాయి.
- లోతైన నీటిలోంచి ఫీడ్‌ను పికప్ చేస్తాయి
- మనదే ఇదంతా అన్నట్టుగా గ్రూపులు గ్రూపులుగా ఫ్లై చేస్తాయి
- అలా దూరంగా ఎగిరి నీళ్లపై ల్యాండ్ అయ్యే సీన్
- అది మీరు డైరెక్ట్‌గా చూస్తేనే బాగుంటుంది
ఫ్లెమింగోలతో పాటు storks, pelicans, grey herons, open-billed storks, sandpipers లాంటివి తరచూ దర్శనం ఇస్తాయి.
నేలపట్టు బర్డ్ శాంక్చువరిలో (Nelapattu Bird Sanctuary) వాచ్ టవర్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి చూస్తే ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది. అలాగే ఉదయం వేళలో సూర్యోదయం సమయంలో మరింత అందంగా ఉంటుంది ఆ ఏరియా మొత్తం.
- ఇది కూడా చదవండి : అడవుల మధ్య పెరిగిన రంపచోడవరం విశేషాలు | Rampachodavaram Travel Guide
సంక్రాంతి వైబ్కు ఫ్లెమింగోల ఝలక్
Sankranti Vibe Adds Soul To The Trip
ఎగ్జాక్టుగా సంక్రాంతి సమయంలో వచ్చే ఫ్లెమింగో ఫెస్టివల్ నాకు తెలిసి సంక్రాంతి వేడుకల్లో ఒక భాగం అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒకటే టైమ్‌లో రావడంతో పక్షులతో పాటు గ్రామీణ జీవితాన్ని కూడా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
రోడ్ సైడ్‌లో ఎటు చూసినా కనిపించే చెరుకుగడలు, రోడ్డుపై ముగ్గులు, సంప్రదాయ సంగీతం, లోకల్ ఫుడ్ స్టాల్స్ అన్నీ కలిసి ఈ ప్రయాణ అనుభవాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తాయి.
ఉదయం బర్డ్ వాచ్ అయ్యాక ఊరిలో తిరిగితే ఆంధ్రాలో సంక్రాంతి అంటే గ్రామీణ క్రాంతి అని, ఊరంటే టూరు కాదు అది ఒక జీవన విధానం అని అర్థం అవుతుంది. వేడి, ఉక్కపోత ఉండదు కాబట్టి తీరప్రాంతాల నుంచి వచ్చే గాలి కూడా హాయినిస్తుంది.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లగలిగే 7 డెస్టినేషన్స్
తిరుపతి–తిరుమల దర్శనం కాంబో
Tirupati – TTD Darshan Combo Opportunity
పులికాట్, సూళ్లూరుపేట నుండి తిరుపతి రీచబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అందుకే చాలా మంది ప్రయాణికులు ఈ ట్రిప్‌ను బర్డ్ అండ్ భక్తి కాంబోగా ప్లాన్ చేస్తారు.
మొదటి రోజు పులికాట్, నేలపట్టులో బర్డ్స్ చూసి, నెక్ట్స్ డే తిరుపతి శ్రీవారి దర్శనం ప్లాన్ చేయొచ్చు. లేదా రివర్స్ కూడా చేయొచ్చు.
సంక్రాంతి హాలిడేలో తిరుమలలో రష్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ దర్శనం బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాంబినేషన్లో ట్రిప్ అనేది కుటుంబంతో ప్రయాణించే వారికి పైసా వసూల్లా ఉంటుంది.

వేగంగా కాదు స్వాగం | Slowly Explore the Surroundings
పులికాట్ దగ్గరలే Dutch Cemetery లాంటివి కాలనియల్ హిస్టరీని టచ్ చేస్తాయి.
నేలపట్టు శాంక్చువరి ఒక మంచి ప్రకృతి అనుభవాన్ని అందించే ప్లేస్.
సూళ్లూరుపేట లోకల్ మార్కెట్లో అప్పుడే వలలో పడిన చేపలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. దీంతో పాటు మీరు ఆంధ్రా ఫుడ్ కూడా ట్రై చేయవచ్చు.
శ్రీహరికోట ద్వీపం (Sriharikota Island) వరకు వెళ్లే అవకాశం అనుమతి లేకపోయినా, దూరం నుంచి చూస్తూ చరిత్రను, కీర్తిని తలుచుకోవచ్చు.
ఇక్కడికి వస్తే వేగం కన్నా స్వాగం (Swag) ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. జీవితాన్ని మెల్లిగా ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో తెలంగాణలో ఒక జైపూర్ | Jaipur In Telangana Travel Guide 2025
ఎవరు ప్లాన్ చేయాలి?
Who Should Plan This Trip?
నేను చెప్పిన ఈ కాంబో ట్రిప్‌ను కుటుంబంతో కలిసి ప్రయాణించే వారు, లేడీస్ గ్రూప్స్, సీనియర్ సిటిజన్లు అందరూ ఎంజాయ్ చేయవచ్చు. బట్ ఎవరైనా ట్రై చేయొచ్చు.
ఫోటోగ్రఫీ అంటే ఇష్టమైన వాళ్లకు జనవరిలో ఇక్కడ కనిపించే షేడ్స్ నచ్చుతాయి.
మొబైల్ కెమెరాలో కూడా ఫ్లెమింగోలు అందంగా కనిపిస్తాయి.
అయితే మంచి ఫోటోలు రావాలంటే మాత్రం కాస్త ఓపిక పట్టాలి.
ఈ బ్లాగ్ ఎందుకు? | Flamingo Festival 2026 – TTD Combo Tour
Why This Blog Matters Every Year
ఈ బ్లాగ్ ఎవర్ గ్రీన్. ఫ్లెమింగో ఫెస్టివల్ తేదీలు మారొచ్చు. కానీ వలస పక్షులు రావడం మానవు. అలాగే సంక్రాంతి సమయంలో మంచి పండగ మూడ్‌లో ఉన్నప్పుడు తిరుమల దర్శనం కూడా ఆ కాంబినేషన్లో చేర్చుకుంటే ఇవన్నీ ప్రతీ ఇయర్ రిపీట్ అయ్యే వేడుకలా సంతోషంగా మారుతాయి.
అందుకే ఈ బ్లాగ్ న్యూస్ కాదు.
అలాగే ఈ ఈవెంట్‌ను ప్రమోట్ చేసే పోస్ట్ కాదు.
ఇది జనవరిలో ఫాలో అవ్వాల్సిన Evergreen AP Coastal Travel Handbook లాంటిది.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
ఫ్లెమింగోలు వస్తాయి, వెళ్లిపోతాయి.
కానీ జనవరిలో పులికాట్ దగ్గర పక్షులు, అక్కడి గ్రామాలు, ఆలయాలు, సముద్రపు గాలి ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక ట్రావెల్ మెమరీని క్రియేట్ చేస్తాయి.
పండగ కోసం ఊరివైపు బయల్దేరే సమయంలో మీరు కేవలం వేడుక మైండ్‌లో ఉంటే, నేచర్ ట్విస్ట్ కూడా అందులో యాడ్ చేసే అవకాశం ఇదే.
ప్రయాణికుడు ట్రావెల్ స్పిరిట్ కూడా ఇదే.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
