ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:
ముఖ్యాంశాలు
స్పెషల్ ట్రైన్లు | Special Trains

మహా కుంభ మేళా సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల (Hyderabad to Kumbh Mela trains) నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తం 76 ప్రత్యేక రైళ్లను నడిపింది.
ప్రయాణికుల సామర్థ్యం

దక్షిణ మధ్య రైల్వే నడిపిన ఈ ప్రత్యేక రైళ్ల వల్ల జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం లక్షా 40 వేల మంది ప్రయాణికులు మహాకుంభమేళాకు వెళ్లారు. అక్కడ పవిత్ర స్నానాల్ని ఆచరించారు.
జాతీయ గణాంకాలు

ప్రయాగ్‌రాజ్‌కు (Prayagraj) వెళ్లే తీర్థయాత్రికుల కోసం దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే 13,000 ప్రత్యేక రైళ్లు నడిపింది. ఇందులో 12,583 ట్రైన్లు ఇప్పటి వరకు తమ లక్ష్యాన్ని పూర్తి చేశాయి.
ప్రయాణికులు నుంచి భారీ డిమాండ్

సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railways) నడిపిన ట్రైన్లకు ప్రయాణికులు నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ట్రైన్లు తమ సామర్థ్యాన్ని మించి అంటే 144 శాతం ఆక్యుపెన్సీతో ప్రయాణించాయి.
ప్రధాన ట్రైన్ మార్గాలు
ఈ స్పెషల్ ట్రైన్లు ప్రధానంగా ప్రయాగ్‌రాజ్ చియోకిని కనెక్ట్ చేస్తూ వెళ్లాయి. దీంతో పాటు గయా (Gaya), పట్నా, అజంగఢ్, బనారస్, దానాపూర్, రక్సౌల్ వంటి ప్రదేశాలను కనెక్ట్ చేస్తూ ప్రయాణికులను అక్కడికి చేర్చాయి.
లొకల్ స్టేషన్లు

జంట నగరాల్లోని (Hydrabad Twin Cities) పలు స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైల్లు ప్రయాగ్‌రాజ్ వైపునకు బయల్దేరాయి. అందులో సికింద్రాబాద్‌తో పాటు, చర్లపల్లి (Charlapalli), కాచిగూడ, మౌలాలి వంటి స్టేషన్లు ఉన్నాయి.
రిజర్వేషన్ల ద్వారా
ఈ ప్రత్యేక ట్రైన్లను అడ్వాన్స్‌గా రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులు పూర్తిగా వినియోగించుకున్నారు. ప్రణాళికా పరంగా దక్షిణ మధ్య రైల్వే ఇందులో విజయం సాధించింది.
భారీ సంఖ్యలో తీర్థయాత్రికులు

2025 జనవరి 13వ తేదీన ప్రారంభమైన కుంభమేళాకు (Maha Kumbh Mela 2025) దాదాపు 3 కోట్ల 9 లక్షల మందిని తమ గమ్యస్థానానికి చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways).
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
సేవా భావం
ప్రయాణికుల సౌకర్యానికి, వారికి సదుపాయలు కల్పించడానికి దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మరీ ముఖ్యంగా మహా కుంభమేళా సమయంలో తీర్థయాత్రికులకు తగిన ఏర్పాట్లు చేసింది. ఎన్నో ప్రత్యేక రైళ్లను నడిపి వారిని వారి గమ్యస్థానానికి చేర్చింది దక్షిణ మధ్య రైల్వే.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా సమయంలో కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానిక చేర్చింది భారతీయ రైల్వే. అందులో దక్షిణాది పర్యాటకులను, తీర్థయాత్రికులను (Pilgrims) సురక్షితంగా, సౌకర్యవంతంగా కుంభమేళా వరకు చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే సఫలం అయింది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.