హైదరాబాద్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పూర్తి గైడ్ | Hyderabad International Kite, Sweet Festival 2026
జనవరి 2026లో హైదరాబాద్ ఆకాశం రంగుల పండుగ! అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ (Hyderabad International Kite Sweet Festival 2026) , హాట్ ఎయిర్ బెలూన్ & డ్రోన్ ఫెస్టివల్ తేదీలు, వేదిక, హైలైట్స్ ఒక్క చోటే.
- 2026 జనవరిలో హైదరాబాద్ ఫెస్టివల్ లవర్స్‌కు ఫుల్ ట్రీట్ రెడీగా ఉంది.
- తెలంగాణ టూరిజం శాఖ (Telangana Tourism) జనవరి నెలలో మల్టిపుల్ స్కై-బేస్డ్ ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తోంది.
- పర్యాటకులకు ఇది విజువల్, ఫుడ్ అండ్ ఫన్ కాంబో అని చెప్పవచ్చు.
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే…
ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతాయి.
దీనర్థం ఏంటో తెలుసా… ఒక లొకేషన్… అన్లిమిటెడ్ సెలబ్రేషన్స్.
కైట్ ఫెస్టివల్ జరిగే వేదిక | Parade Ground, Secunderabad
హైదరాబాద్ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (Kite Festival) అనేది సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఇక్కడే ఎందుకు అంటే..

- ఇక్కడ మెట్రో & రోడ్ కనెక్టివిటీ ఉంటుంది
- ఫ్యామిలీస్, కిడ్స్, టూరిస్టులకు ఇది చాలా సౌకర్యవంతమైన వేదిక
- సాయంత్రం ఔటింగ్‌కు ఇది పర్ఫెక్ట్ స్పాట్
- ఇది కూడా చదవండి : జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings
ముఖ్యమైన తేదీలు | 🪁Hyderabad International Kite Sweet Festival 2026

ప్రతీ సంవత్సరం హైదరాబాద్ వేదికగా జరిగే కైట్ ఫెస్టివల్ (Hyderabad International Kite Sweet Festival 2026) , కొత్త సంవత్సరం అయిన 2026 జనవరిలోజనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది.
ప్రతిసారి ఈ ఫెస్టివల్ సూపర్ హిట్ అవుతుంది. ఈసారి కూడా సూపర్ హిట్ చేసేందుకు అధికారుల సన్నాహాలు ప్రారంభించారు.
- ఇది కూడా చదవండి : ఈ ఆదివారం ఖాళీనా? Hyderabad దగ్గర ఈ 6 ప్లేసులు మిస్ అవ్వకండి ! 6 Weekend Destinations
ఈ ఫెస్టివల్ హైలైట్స్ | Festival Highlights
హైదరాబాద్ వేదికగా జరిగే ఈ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్లో భారతదేశం (India) నుంచే కాకుండా అంతర్జాతీయ ఔత్సాహికులు కూడా పాల్గొంటారు.

- వేడుక జరిగే అన్ని రోజుల్లో రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో సందడి చేస్తాయి
- ట్రెడిషనల్ తెలంగాణ మిఠాయిలు (Traditional Telangana Sweets) ను సందర్శకులు ఆస్వాదించవచ్చు
- భారతీయ, అంతర్జాతీయ స్వీట్స్ రుచిని కూడా ఎంజాయ్ చేయవచ్చు
- పలు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు
- పిల్లలు, పెద్దలు కలిసి ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
ఎందుకు వెళ్లాలి? | Why to Visit
ఈ ఫెస్టివల్ జరిగినన్ని రోజులు అక్కడ ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.
ట్రెడిషనల్ ఫుడ్, ఫన్ అన్నీ ఒకే చోట ఉండటంతో సందర్శకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
కుటుంబంతో కలిసి వెళ్లి సంతోషంగా సమయం గడపవచ్చు.
ఫోటోగ్రాఫర్లు, ట్రావెల్ వ్లాగర్స్ (Travel Vloggers) అయితే తప్పకుండా వెళ్లాల్సిన వేడుక ఇది.
- ఇది కూడా చదవండి : Uday Cafe: ఉదయ్ కేఫ్.. 63 ఏళ్లుగా కొత్త రుచుల మధ్య పాత రుచిని అందిస్తున్న అరుదైన రెస్టారెంట్!
- ఇది కూడా చదవండి : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ | Hot Air Balloon Festival Hyderabad 2026

సంక్రాంతి (Sankranti) సమయంలో గాలిపటాలు చూడటం కామన్. అదే మూడ్‌లో మీరు హాట్ ఎయిర్ బెలూన్లు చూడాలి అనుకుంటే, 2026 జనవరి 16 నుంచి 18 వరకు పరేడ్ గ్రౌండ్స్‌కి వెళ్తే చాలు.
కైట్ ఫెస్టివల్ తర్వాత హైదరాబాద్ స్కైలో ఇది ఒక మ్యాజికల్ మూమెంట్ యాడ్ చేస్తుంది అని చెప్పవచ్చు.
- రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్లు ఆకాశంలో రంగులు నింపుతాయి
- ఫోటోగ్రఫీ ఇష్టమైతే సూపర్ ఫోటోలు తీసుకోవచ్చు
- సాహసం ఇష్టపడే వారికి ఇది మంచి అవకాశం
- సాయంత్రం సమయంలో వెళ్తే పర్ఫెక్ట్ ఫన్ దొరుకుతుంది
- ఇది కూడా చదవండి : Ta.Ma.Sha Cafe : ఓకే కేఫ్‌లో అన్ని రకాల ఆసియా రుచులు..అదే త.మా.షా!
ట్రావెల్ టిప్:
సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో బెలూన్లను ఫోటో లేదా వీడియోగా తీసి రీల్‌గా అప్లోడ్ చేస్తే, లైక్స్ & ఫాలోవర్స్ రావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది.
డ్రోన్ ఫెస్టివల్ | Hyderabad Drone Festival 2026
డ్రోన్ డే సందర్భంగా డ్రోన్ ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
2026 జనవరి 13, 14 తేదీల్లో జరిగే ఈ ఉత్సవంలో ఆకాశంలో డ్రోన్ షోలు ఉంటాయి.
రాత్రి సమయంలో డ్రోన్లు ఆకాశంలో సందడి చేస్తాయి.
డ్రోన్ల ద్వారా తెలంగాణ పర్యాటక ప్రదేశాలను ప్రదర్శిస్తారు.
యూత్, టెక్ లవర్స్, వ్లాగర్స్‌కి ఇది హైలైట్ ఈవెంట్ అవుతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
